వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు నోబెల్ బహుమతి వ్యాఖ్య: వైసిపి ఎమ్మెల్యే అనిల్ సెటైర్లు

ఒలింపిక్స్‌లో గెలిస్తే నోబుల్ బహుమతి ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఒలింపిక్స్‌లో గెలిస్తే నోబుల్ బహుమతి ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు.

జలీల్ ఖాన్ బాటలోనే... ఒలింపిక్ గెలిస్తే, నోబుల్ ప్రైజ్ ఇప్పిస్తా శ్రీకాంత్ కు బాబు బంపరాఫర్

నోబెల్ బహుమతి ఎందుకిస్తారో తెలియదా?

నోబెల్ బహుమతి ఎందుకిస్తారో తెలియదా?

నోబెల్ బహుమతి ఎందుకు ఇస్తారో కూడా సీఎం చంద్రబాబుకు తెలియదా అని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు మతి తప్పిందని మండిపడ్డారు. రాష్ట్రంలో క్రీడాకారులు ఒలింపిక్స్‌లో మెడల్ సాధిస్తే నోబెల్ బహుమతి ఇప్పిస్తానని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

మానసికస్థితి తెలుస్తోంది

మానసికస్థితి తెలుస్తోంది

నోబెల్ బహుమతి ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు.. అనే విషయాలపై కూడా కనీస అవగాహన లేకుండా మాట్లాడటం చూస్తుంటే ఆయన మానసికస్థితి ఏమిటో అర్థమవుతోందన్నారు.

ఒలింపిక్స్ కూడానా..

ఒలింపిక్స్ కూడానా..

2019లో అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని చెబుతున్నారని, ఒలింపిక్స్ నిర్వహణకు ఎలాంటి స్థాయిలో అవసరాలు ఉంటాయో కూడా తెలియకుండా మాట్లాడటం విచిత్రమన్నారు.

విశాఖ భూస్కాంపై గుడివాడ అమర్నాథ్..

విశాఖ భూస్కాంపై గుడివాడ అమర్నాథ్..

విశాఖ ఇమేజ్‌ను తెలుగుదేశం పార్టీ నేతలు చెడగొడుతున్నారని, భూదందాలపై సిట్ విచారణతో న్యాయం జరగదని వైసిపి నేత గుడివాడ అమర్నాథ్ విశాఖలో అన్నారు. భూదందాపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఏజెన్సీలో గిరిజన గ్రామాల్లో ప్రబలిన ఆంత్రాక్స్, విష జ్వరాలను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్నారు.

English summary
AP CM Chandrababu Naidu has made a confusing statement at the felicitation event in Vijayawada. The Chief Minister encouraged the state people to win the Olympics and at the same time reminded his nobel prize statement on the earlier occasion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X