వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...రాష్ట్రంలో వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

అమరావతి:కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. అధికారులు కూడా ప్రజలను అప్రమప్తం చేయాలని ఆయన ఆదేశించారు.

రాష్ట్రంలో భారీవర్షాల నేపథ్యంలో వరద పరిస్థితిపై జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సిఎం చంద్రబాబు సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారికి తగిన సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. విపత్తు నివారణ, అగ్నిమాపక దళాలను సిద్ధంగా ఉంచాలని, వారితో రెవెన్యూ, పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సిఎం చెప్పారు.

 CM Chandrababu Review Meeting on Rains and Floods in Andhra Pradesh

అలాగే సహాయక చర్యల్లో స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. వర్షాలు పడుతున్న జిల్లాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని వైద్యఆరోగ్య శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కూలిపోయి, కొట్టుకుపోయిన వంతెనల స్థానంలో ప్రత్యామ్నాయం, పునర్నిర్మాణం చేయాలన్నారు.

Recommended Video

బిక్కుబిక్కుమంటున్న కోనసీమవాసులు

ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని, ప్రాజెక్టుల్లో వరదని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉండాల్సిందిగా అధికారులకు సూచించారు. దివిసీమలో ఒకేరోజు 24 మంది పాము కాట్లకు గురైన నేపథ్యంలో సిఎం ఆ విషయంపై దృష్టి సారించారు. రైతులు, కూలీలు విష సర్పాల బారిన పడకుండా చూడాలని, పాముల ఉనికి విషయమై వారికి జాగ్రత్తలు తెలియచెప్పాలని అధికారులను హెచ్చరించారు.

English summary
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu on Sunday reviewed flood situation in the state following incessant rains.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X