వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసులను పంపిస్తా: సీఎం రమేష్ కంపెనీపై బాబు తీవ్ర ఆగ్రహం, హెచ్చరిక

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం మరోసారి రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం మరోసారి రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వదిలేది లేదు: సీఎం రమేష్ సంస్థపై చంద్రబాబు తీవ్ర హెచ్చరికవదిలేది లేదు: సీఎం రమేష్ సంస్థపై చంద్రబాబు తీవ్ర హెచ్చరిక

అమరావతిలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ భేటీ అయింది. ఈ సందర్భంగా చంద్రబాబు గండికోట ప్రాజెక్టు, ఇంటింటికి టీడీపీ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.

 బాబు ఆగ్రహం

బాబు ఆగ్రహం

ఈ సందర్భంగా చంద్రబాబు గండికోట ప్రాజెక్టుపై సుదీర్గంగా చర్చించారని తెలుస్తోంది. సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ సంస్థ సరిగా పనులు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు అవసరమైతే పోలీసులను పంపిస్తామని చంద్రబాబు నేతలకు హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.

 ఎవరైనా సహించేది లేదు

ఎవరైనా సహించేది లేదు

కాంట్రాక్టర్లు ఎవరైనా సరే పనుల్లో జాప్యం జరిగితే మాత్రం ఏమాత్రం సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. ఏ సంస్థ అయినా అప్పగించిన పనులను త్వరితగతిన, నిర్దిష్ట సమయంలో పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేయాలన్నారు.

 ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్

ఎమ్మెల్యేలకు చంద్రబాబు క్లాస్

ఇంటింటికీ తెలుగుదేశం పార్టీపై కూడా చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని సరిగా చేపట్టని నియోజకవర్గాలను సీ, డీ గ్రేడులుగా పేర్కొన్నారు. ఆ ఎమ్మెల్యేలకు, ఇంచార్జులకు బాబు క్లాస్ తీసుకున్నారు.

 యనమలకు అప్పగింత

యనమలకు అప్పగింత

ముఖ్యంగా మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని గన్నవరం, అవనిగడ్డ, మచిలీపట్నం, పెనమలూరు, పామర్రు తదితర నియోజకవర్గాల్లో ఏమాత్రం బాగా లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరినీ గాడిలో పెట్టాలని మంత్రి యనమల రామకృష్ణుడికి సూచించారు.

English summary
CM Chandrababu Naidu fires on the delay of Irrigation projects. He got serious on CM Ramesh Company and his brother Rajesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X