వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తుపాను బాధితులకు సాయంపై సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ:కేంద్రం నిర్లక్ష్యం...మేము రూ.1000 కోట్లు ఖర్చు

|
Google Oneindia TeluguNews

అమరావతి: తిత్లీ తుపాను బాధితులకు సాయం చేయాలంటూ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. శ్రీకాకుళం ఎన్నడూ లేనంతగా అల్లకల్లోలమైందని సిఎం ఈ లేఖలో పేర్కొన్నారు.

ఆ పేర్లు చెప్పడానికి భయమెందుకు, ఏపీలో లాలూ ప్రభుత్వం, బాబుకు అదే గతి: జీవీఎల్ హెచ్చరిక <br>ఆ పేర్లు చెప్పడానికి భయమెందుకు, ఏపీలో లాలూ ప్రభుత్వం, బాబుకు అదే గతి: జీవీఎల్ హెచ్చరిక

Recommended Video

టిట్లీ బీభత్సం.. కంటతడి పెడుతున్న శ్రీకాకుళం..!

చక్కటి ఉద్యానవనంలాంటి ఉద్దానం ఘోరంగా దెబ్బతిందని, తీవ్ర నష్టంతో దశాబ్దాలు వెనక్కి పోయిందని ఆయన లేఖలో పేర్కొన్నారు. తిత్లీ తుఫాన్ కారణంగా రూ.3428కోట్ల వరకు నష్టం వాటిల్లిందని అంచనా వేశామని లేఖలో చంద్రబాబు వెల్లడించారు. సాయం చేయాల్సిన కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని...తుఫాన్ సహాయక చర్యల కోసం ఎపి ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని సిఎం చంద్రబాబు వివరించారు.

CM Chandrababu writes open letter to people of Andhra Pradesh over Titli tupan aid

తిత్లీ తుపాను బాధితులకు సాయం చేయాలంటూ ప్రజలకు రాసిన బహిరంగ లేఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు తుఫాన్ నష్టం,కేంద్రం నిర్లక్ష్యం, ప్రభుత్వ సాయం తదిదర విషయాలను వివరించారు. తిత్లీ తుఫాన్ కారణంగా రూ.3428కోట్ల వరకు నష్టం వాటిల్లగా...ఇంతటి పెను విపత్తులో సాయం చెయ్యాల్సిన కేంద్ర ప్రభుత్వం
తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని సిఎం చంద్రబాబు ఆరోపించారు.

మరోవైపు ఎపి ప్రభుత్వం శ్రీకాకుళంలో తుఫాన్ సహాయక చర్యల కోసం ఇప్పటికే రూ.1000 కోట్లను ఖర్చు చేసిందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు, ఐఏఎస్‌లు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని తెలిపారు. త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు కృషి చేస్తున్నామని సిఎం వెల్లడించారు. గతంలో ఉక్కు సంకల్పంతో, మనోనిబ్బరంతో హుద్‌హుద్‌ను జయించామన్నారు.

తిత్లీ తుపాన్ విధ్వంసం నుంచి శ్రీకాకుళం జిల్లా తేరుకునేందుకు తూర్పు అనే కార్యక్రమాన్ని రూపొందించామని చంద్రబాబు తెలిపారు. ఇందులో భాగంగా అనేక కార్యక్రమాలు చేపడతామని, తుపాను బాధిత ప్రాంతాలన్నీ పునర్నించాల్సి ఉంటుందన్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఆర్థిక స్థోమత కలిగిన కంపెనీలు, ప్రవాసాంధ్రులు, ప్రజలు ఇందుకు ఆర్థికంగా చేయూత అందించాలని సిఎం చంద్రబాబు ఈ బహిరంగ లేఖ ద్వారా పిలుపునిచ్చారు.

English summary
Amaravathi:AP CM Chandrababu writes an Open Letter to Andhra Pradesh people over titli cyclone aid. He said AP government working hard aiming to get out of the Titli loss quickly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X