వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్ తో జగన్ దంపతుల లంచ్ మీట్: తాజా వివాదాలను వివరించిన సీఎం: మతపర విమర్శలపైనా..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్యమంత్రి జగన్ సతీ సమేతంగా గవర్నర్ తో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కార్యాలయం రాజ్ భవన్ లో ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ ను కలిసేందుకు అప్పాయింట్ మెంట్ కోరింది. వెంటనే గవర్నర్ బీబీ హరిచందన్ సతీ సమేతంగా లంచ్ కు రావాలని ఆహ్వానించారు. దీంతో..ముఖ్యమంత్రి దంపతులు రాజ్ భవన్ లో గవర్నర్ దంపతులతో కలిసి విందు స్వీకరించారు.

ఆ తరువాత రాష్ట్రంలో నెలకొన్ని తాజా పరిస్థితులు..ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు..ప్రతీ అంశం వివాదాస్పదం అవుతున్న తీరు గురించి వివరించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వస్తున్న మతపరమైన విమర్శల వెనుక వాస్తవాలను గవర్నర్ కు నివేదించినట్లు సమాచారం. ఇక, ఇదే సమయంలో పలు యూనివర్సిటీలు..ఏపీపీఎస్సీ ఛైర్మన్ వ్యవహారం పైన చర్చ జరిగినట్లు విశ్వసనీయ సమాచారం.

రాజ్ భవన్ లో సీఎం దంపతులు

రాజ్ భవన్ లో సీఎం దంపతులు

ముఖ్యమంత్రి జగన్ దంపతులు రాజ్ భవన్ లో గవర్నర్ బీబీ హరిచందన్ తో సమావేశమయ్యారు. తొలుత ముఖ్యమంత్రి గవర్నర్ అప్పాయింట్ మెంట్ కోరగా గవర్నర్ లంచ్ కు ఆహ్వానించినట్లు అధికారులు చెబుతున్నారు. సతీ సమేతంగా రావాలని ఆహ్వానించారు. దీంతో..గవర్నర్ ఆహ్వానంతో రాజ్ భవన్ లో లంచ్ మీటింగ్ జరిగింది. ఆ తరువాత రాష్ట్రంలో నెలకొన్ని తాజా పాలనా పరమైన..రాజకీయ అంశాల పైన ముఖ్యమంత్రి గవర్నర్ ను వివరించినట్లు సమాచారం.

రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితితో పాటుగా.. ఇసుక సమస్య పరిష్కారం..ఇంగ్లీషు మీడియం నిర్ణయం వంటి వాటి పైన నెలకొన్న వివాదాలు..ప్రభుత్వ ఉద్దేశాలను గవర్నర్ కు ముఖ్యమంత్రి వివరించారని తెలుస్తోంది. ఇదే సమయంలో.. రాష్ట్ర ఆర్దిక పరిస్థితి..కేంద్రం నుండి అందాల్సిన సాయం పైన ప్రస్తావించినట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు అంశం..కోర్టుల్లో కేసుల గురించి గవర్నర్ వద్ద ముఖ్యమంత్రి ప్రస్తావించినట్లు విశ్వసనీయ సమాచారం.

మతపరమైన విమర్శల పైనా..

మతపరమైన విమర్శల పైనా..

ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయంగా మతరపరమైన విమర్శలు తీవ్ర స్థాయికి చేరాయి. అటు బీజేపీ నేతలు..ఇటు జనసేన..టీడీపీ నేతలు సైతం ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకొని రాజకీయంగా మతపరమైన విమర్శలు చేస్తున్నారు. తిరుపతిలో బస్ టిక్కెట్ల పైన అన్యమత ప్రచారం అంశం మొదలు..ఇంగ్లీషు మీడియం పాఠశాలల నిర్ణయం వెనుక మత మార్పిడి ఆలోచనలు ఉన్నాయంటూ చేస్తున్న విమర్శల పైన ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఇదే విషయాన్ని గవర్నర్ వద్ద ప్రస్తావించి..ఇవన్నీ ఉద్దేశ పూర్వకంగా తన పైన సున్నితమైన అంశాలతో రాజకీయంగా దాడి చేస్తున్నారని చెబుతూనే..ఆరోపణల కు సమాధానంగా సాక్ష్యాలు ఇవంటూ ముఖ్యమంత్రి నివేదించినట్లుగా తెలుస్తోంది. శాసనసభా సమావేశాల్లో ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు చేస్తున్న అన్ని విమర్శలకు ఆధారాలతో సహా ప్రభుత్వం సమాధానం చెప్పటానికి సిద్దం అవుతోంది. రాష్ట్రానికి రాజ్యాంగ బద్దంగా అధిపతి అయిన గవర్నర్ కు సైతం సీఎం వాస్తవాలను వివరించే ప్రయత్నం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

ఆ పదవుల్లో ఉన్న వారి పైనా చర్చ..!

ఆ పదవుల్లో ఉన్న వారి పైనా చర్చ..!

ఇక, ప్రభుత్వం యూనివర్సిటీల పాలక మండళ్లను మార్చే ఆలోచన చేస్తోంది. యూనివర్సిటీలకు గవర్నర్ ఛాన్సలర్ గా వ్యవహరిస్తారు. దీంతో..ఆ అంశాల పైన గవర్నర్ తో భేటీ సమయంలో చర్చకు వచ్చినట్లు గా తెలుస్తోంది. దీంతో పాటుగా ఏపీపీఎస్సీ ఛైర్మన్ వ్యవహారం పైన చర్చ జరిగినట్లు సమాచారం. అయితే, అధికారులు దీనిని ఎవరూ ధ్రువీకరించటం లేదు. అయితే, ఏపీపీఎస్సీలో చోటు చేసుకున్న పరిణామాల పైన ప్రభుత్వం ఫోకస్ చేసినట్లు సమాచారం.

తాజాగా ఏపీపీఎస్సీ కమిషనర్ గా ఐపీఎస్ అధికారి పీయస్సార్ ఆంజనేయులను ప్రభుత్వం నియమించింది. ఇద్దరు సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఛైర్మన్ మార్పు పైన చర్చ సాగుతున్నట్లు ప్రభత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీంతో..ముఖ్యమంత్రి ఈ అంశం పైన గవర్నర్ తో చర్చ సమయంలో ప్రస్తావించారని అనధికారిక సమాచారం.

English summary
AP Cm couple attended lunch meeting with governor BB Harichandan in Rajbhavan. Cm disucssed present controversy issues and govt decision in AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X