కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క‌డ‌ప పెద్ద ద‌ర్గాలో ప్రార్థ‌న‌లు: కాషాయ త‌ల‌పాగాతో వైఎస్ జ‌గ‌న్‌

|
Google Oneindia TeluguNews

క‌డ‌ప‌: రాష్ట్రానికి కాబోయే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బుధ‌వారం ఉద‌యం క‌డ‌ప‌కు చేరుకున్నారు. ఈ ఉద‌యం క‌లియుగ దైవం తిరుమ‌ల‌లోని శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు. అనంత‌రం రేణిగుంట విమానాశ్ర‌యం నుంచి ప్ర‌త్యేక విమానంలో క‌డ‌ప‌కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు జిల్లా కలెక్టర్ హరికిరణ్, పోలీసు సూప‌రింటెండెట్ అభిషేక్ మహంతి, క‌డ‌ప లోక్‌స‌భ స‌భ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, జిల్లాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాస‌న స‌భ్యులు ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికారు.

అక్క‌డి నుంచి రోడ్డు మార్గంలో వైఎస్ జ‌గ‌న్ క‌డ‌ప‌లోని అమీన్‌పీర్ ద‌ర్గాకు చేరుకున్నారు. ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు చేశారు. ద‌ర్గా పెద్ద‌లు, మౌలాలు జ‌గ‌న్‌కు సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం పలికారు. కాషాయ త‌ల‌పాగాను చుట్టి ఆహ్వానించారు. ప్ర‌త్యేక ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్న జ‌గ‌న్‌.. ద‌ర్గాకు పూల ఛాదర్‌ను సమర్పించారు.

CM designated of AP YS Jagan visits Ameen peer Dargah at Kadapa

అక్కడి నుండి జగన్‌ పులివెందులకు బయలుదేరారు. పులివెందులలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో జగన్‌ పాల్గొననున్నారు. హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా గండిలో వెలసిన నెట్టికంటి ఆంజనేయ స్వామి వారిని ద‌ర్శించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

English summary
Chief Minister designated of Andhra Pradesh YS Jagan Mohan Reddy is visits Ameen Peer Dargah, popularly known as Pedda Dargah at Kadapa on Thursday morning. He is offered prayers and Flower Chaddar to the Mosque. Kadapa District Collector Hari Kiran, Superintendent of Police Avinash Mahanty welcomed his at Airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X