వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ మంచి ప్లేయర్ కానీ: సి రామచంద్రయ్య వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

C Ramachandraiah
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంచి ప్లేయర్ అని దేవాదాయ శాఖ మంత్రి సి రామచంద్రయ్య సోమవారం వ్యాఖ్యానించారు. కిరణ్ మంచి ఆటగాడు అని అయితే, జట్టుకు మంచి సారథిగా ఉండాల్సి ఉందన్నారు. విభజన విషయంలో కిరణ్‌ను లగడపాటి రాజగోపాల్ వంటి సమైక్యవాదులు బ్యాట్సుమెన్‌తో పోల్చుతున్న విషయం తెలిసిందే.

కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర కోసం ధైర్యంగా పోరాడుతున్నారని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా కాంగ్రెసు సీనియర్ శాసన సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వేరుగా అన్నారు. ముఖ్యమంత్రి హైకమాండ్ నిర్ణయాన్ని ఎదిరించి దైర్యంగా పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు.

కిరణ్ హయాంలో పార్టీ బలపడినా విభజన నిర్ణయంతో మొదటికే మోసం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాము తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు రాయల తెలంగాణ ప్రతిపాదన తీసుకు రాలేదని కూడా తెలిపారు.

అసెంబ్లీకి వచ్చే బిల్లులో రాయల తెలంగాణ ఉంటే తాము అదే కోరుతామన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల నేతలు రాయల తెలంగాణకు సుముఖంగా ఉన్నారని కానీ, వారు బయటకు చెప్పలేకపోతున్నారని చెప్పారు. విభజన అంతా అమ్మ చేతిలో ఉందని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని ఉద్దేశించి అన్నారు.

English summary
Endowment Minister C Ramachandraiah on Monday said CM Kiran Kumar Reddy is a good player, but he needs to be a good captain for the team.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X