అసెంబ్లీకి మిధున్, అవినాశ్ - జగన్ కొత్త లెక్కలు, జాబితా సిద్దం..!!
ఏపీ ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. సీఎం జగన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దుల జాబితాలో అనూహ్య మార్పులు చేస్తున్నారు. ఎంపీలను కొందరిని అసెంబ్లీకి పంపుతున్నారు. కొందరు మంత్రుల ను ఎంపీలుగా ఖరారు చేస్తున్నారు. గెలుపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ మార్పులు - చేర్పుల పైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా సీట్ల దక్కని వారికి సీఎం జగన్ కీలక హామీలు ఇస్తున్నారు.
తుది కసరత్తు : ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల్లో తన అభ్యర్దులను ఫైనల్ చేస్తున్నారు. ఇంఛార్జ్ ల మార్పు కసరత్తు తుది దశకు చేరుకుంది. దాదాపు 30 మంది వరకు మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. ఎంపీల్లోనూ 11 మంది వరకు మార్పులు ఖాయమని తెలుస్తోంది. ఈ సారి ఎంపీలుగా ఉన్న పలువురిని ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపుతున్నారు. అందులో భాగంగా కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురం నుంచి అసెంబ్లీ అభ్యర్దిగా ఖరారు చేసారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని ఈ సారి పీలేరు నుంచి అసెంబ్లీ బరిలో నిలిపే అంశం పైన కసరత్తు జరుగుతోంది. కానీ, మిథున్ మాత్రం తాను లోక్ సభకే పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ ను రాజమండ్రి అర్బన్ నుంచి ఖరారు చేసారు.

ఎమ్మెల్యేలుగా ఎంపీలు : కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఈ సారి జమ్మలమడుగు అసెంబ్లీ నుంచి పోటీ చేయిస్తారని తెలుస్తోంది. కడప ఎంపీగా వైఎస్ కుటుంబం నుంచి ఒక వైద్యుడి పేరు ప్రచారంలో ఉంది. దీని పైన జగన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి పోటీ పైన స్పష్టత రావాల్సి ఉంది. మాజీ మంత్రి బాలినేని తిరిగి ఒంగోలు ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గుంటూరు ఎంపీగా బరిలోకి దిగటం దాదాపు ఖాయమైంది. ఎమ్మిగనూరు టిక్కెట్‌ను సిట్టింగ్ కేశవరెడ్డికి కాకుండా.. ఈసారి బీసీలకు ఇవ్వాలని వైసీపీ హైకమాండ్ నిర్ణయించిన వైసీపీ బుట్టా రేణుక అభ్యర్ధిత్వం పరిశీలిస్తోంది. కర్నూలు ఎంపీగా ఒక మంత్రి పేరు ఖాయమైనట్లు తెలుస్తోంది.

మార్పులు - చేర్పులు : గోదావరి జిల్లాల్లో మార్పుల పైన ఒక నిర్ణయానికి వచ్చారు. హిందూపురం ఎంపీ అభ్యర్దిగా బళ్లారికి చెందిన మాజీ మంత్రి సోదరి పేరును పరిశీలిస్తున్నారు. ప్రస్తుత ఎంపీ గోరంట్ల మాధవ్ విషయంలో జగన్ నిర్ణయం ఏంటనేది తెలియాల్సి ఉంది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు రూట్ క్లియర్ అయింది. తిరిగి ఆయన మైలవరం నుంచే ఆయన పోటీ చేస్తారని తెలుస్తోంది. విజయవాడ, ఏలూరు ఎంపీలుగా బీసీ వర్గాలకు అవకాశం ఇవ్వాలని వైసీపీ నాయకత్వం ఆలోచన చేస్తోంది. జనవరి 1న పెన్షన్ రూ 3 వేలకు పెంపు..తరువాత వరుసగా సంక్షేమ పథకాల పైన కార్యాచరణ సిద్దమైంది. వీటి విడుదల సమయం నుంచి కొత్త ఇంఛార్జ్ లు ప్రజల్లోకి పంపాలని భావిస్తున్న సీఎం జగన్ ఈ రోజు లేదా రేపు మార్పుల జాబితా అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications