చంద్రబాబుకు సీఎం జగన్ విషెస్ : మెగాస్టార్ - జనసేనాని శుభాకాంక్షలు : నా సూపర్ స్టార్ అంటూ..!!
టీడీపీ అధినేత చంద్రబాబు 73వ ఏట అడుగు పెట్టారు. పార్టీ అధినేత జన్మదినాన్ని పార్టీ శ్రేణులు పండుగలా నిర్వహిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబుకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్ డే చంద్రబాబు గారు అంటూ ట్వీట్ చేసారు. ఇక, పార్టీకి చెందిన పలువురు ప్రముఖుల సైతం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ చంద్రబాబు హాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. ఇక, మెగాస్టార్ చిరంజీవి...తాను చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయన్ను కలిసిన సందర్భంలోని ఫొటోను జత చేస్తూ ట్వీట్ చేసారు.

చిరంజీవి ట్వీట్ లో ఇలా..
చంద్రబాబుకు శుభాకాంక్షలు చెబుతూ.. ఆయన కలకాలం సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, అలా ఆశీర్వదించమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని చిరంజీవి ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక, జనసేన అధినేత పవన్ సైతం.. చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ..ఆయనకు ఆయరారోగ్యాలు..భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.
చంద్రబాబు తనయుడు..పార్టీ ఎమ్మెల్సీ లోకేష్ తన తండ్రి జన్మదినం విషెస్ చెప్పారు. ఇక తెలుగువారికి ఆయనంటే ఒక భరోసా.లక్షలాది తెలుగుదేశం సైనికులకు ఆయనే ఒక ధైర్యం. ఈ రకంగా కోట్లాది మందికి తండ్రి అయ్యారు ఆయన అని పేర్కొన్నారు.
నా సూపర్ స్టార్ అంటూ
సొంత కుటుంబం కోసం కాకుండా, తెలుగు జాతినే కుటుంబం చేసుకుని, ఆ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆయనే నా సూపర్ స్టార్... ఆయనే మా నాన్న చంద్రబాబు గారు...అంటూ ట్వీట్ చేసారు. దీనికి కొనసాగింపుగా.. తెదేపా అధినేత చంద్రబాబుకు ఆయన తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు దార్శనిక పాలన ద్వారా ఎంతో మంది పేదలు కూడా ఉన్నత చదువులు చదవగలిగారని.. లక్షల ఉద్యోగాలిచ్చి కోట్లాది మందికి అన్నదాత అయ్యారని పేర్కొన్నారు.

పార్టీ శ్రేణుల సంబరాలు
సొంత కుటుంబం కోసం కాకుండా, తెలుగు జాతినే కుటుంబం చేసుకుని, ఆ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసిన సూపర్ స్టార్ చంద్రబాబుకు.. జన్మదిన శుభాకాంక్షలు అని లోకేష్ పేర్కొన్నారు. జన్మదినం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రికి వెళ్లిన చంద్రబాబు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. పార్టీ నేతలకు అందుబాటులో ఉన్నారు. పలువురు పార్టీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక, సాయంత్రంగా ఆయన నూజివీడు లో జన్మదిన వేడుకల్లో పాల్గొననున్నారు.