సీఎం జగన్కు, పౌరులకు సీఆర్పీసీ ఒక్కటే, కౌంటర్ పిటిషన్లో సీబీఐ..
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు వ్యక్తిగత మినహాయింపు పిటిషన్లో సీబీఐ కీలక అంశాలను ప్రస్తావించింది. హాజరు మినహాయింపు కోసం జగన్ పిటిషన్లు విచారణకు అర్హత లేదని తేల్చిచెప్పింది. బెయిల్ షరతులను జగన్ ఉల్లంఘిస్తున్నారని తెలియజేసింది. అక్రమాస్తుల కేసులో కోర్టు హాజరు నుంచి బయటపడేందుకు ఏదో ఒక కారణం చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలియజేసింది.

అధికారంతో..
ఆస్తుల కేసులో తన అర్ధ, అంగ బలాన్ని ఉపయోగించి సాక్షులను ప్రభావితం చేస్తారని తెలిపింది. ఈ కేసులో మొదటి చార్జీ షీట్ దాఖలై.. ఎనిమిదేళ్లవుతోన్నా.. ఇప్పటికీ విచారణ ప్రారంభం కాలేదని పేర్కొన్నది. ఇందుకు గల కారణం జగన్, ఇతరులు విచారణ ప్రక్రియను జాప్యం చేస్తున్నారని తెలిపింది. జాప్యం జరుగుతోందని చెబుతోన్న జగనే.. మినహాయింపు కోరడం సరికాదన్నారు.

16 చార్జీషీట్లు..
ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన ఒక్కసారి మాత్రమే జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారని వివరించింది. ఒకసారి మినహాయింపు ఇస్తే.. జగన్ మినహాయింపు తీసుకుంటూనే ఉంటారని పేర్కొన్నది. ఎందుకు మినహాయింపు కావాలో సరైన కారణం వివరించకుండానే జగన్ మళ్లీ పిటిషన్ వేశారని ప్రస్తావించారు. ఈ కేసులో జగన్ హోదా మారిందనే కారణంతో మినహాయింపు ఇవ్వొద్దని సూచించారు. సీబీఐ, ఈడీ వేసిన 16 చార్జీషీట్లలో జగన్ నిందితుడిగా ఉన్నారని పేర్కొన్నది.

అందరూ ఒక్కటే..
ఏదైనా కేసులో నేర విచారణ నిందితుల సమక్షంలో జరగాలని సీఆర్పీసీ చెబుతోంది.. కానీ చట్టం రూపొందించే వారు చట్టానికి లోబడి ఉండాలనే విషయాన్ని మాత్రం నేతలు మరుస్తున్నారు. అక్రమ ఆస్తుల కేసు నమోదైనప్పటి నుంచి జగన్ రాజకీయాల్లోనే ఉన్నారని పేర్కొన్నారు. అయితే ఆయన ముఖ్యమంత్రి అయినంత మాత్రానా పరిస్థితులు మారవని పేర్కొన్నారు.

ఆర్టికల్ 14కు విరుద్ధం
హోదాను బట్టి హాజరు మినహాయింపు కోరడం నిందితుల హక్కు కాదని, కోర్టు విచక్షణ పరిధిలోకి వస్తోందని కోరడం ఆర్టికల్ 14కు విరుధ్దమని తెలిపింది. చట్టం ముందు సీఎం జగన్ సహా పౌరులంతా సమానమేనని తెలియజేసింది. మరోవైపు జగన్ వేసిన పిటిషన్లపై ఏప్రిల్ 9వ తేదీన విచారిస్తామని సీబీఐ కోర్టు తెలిపింది.