వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

15 రోజుల్లో స్కాముల‌న్నీ బ‌య‌ట‌కు: ఏ ఒక్క‌రినీ వ‌దిలేది లేదు

AP Assembly, Sessions, CM jagan, Polavaram, Scam, investigations, Action, Reverse tendering, ఏపీ అసెంబ్లీ, స‌మావేశాలు, సీఎం జ‌గ‌న్‌, పోల‌వ‌రం, స్కాం, విచార‌ణ‌, చ‌ర్య‌లు, రివ‌ర్స్ టెండ‌రింగ్

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ శాస‌న‌స‌భ‌లో కీల‌క ప్ర‌క‌ట‌న చేసారు. పోల‌వ‌రం ప్రాజెక్టు గురించి టీడీపీ ప్ర‌శ్నోత్త‌రాల స‌మయంలో చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌ట్టారు. దీనికి మంత్రి అనిల్ స‌మాధానం ఇచ్చారు. అయినా..టీడీపీ చ‌ర్చ‌ను కొన‌సాగించే ప్ర‌య‌త్నాన్ని స్పీక‌ర్ అడ్డుకున్నారు. ఆ స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి జోక్యం చేసుకొని పోల‌వ‌రం గురించి వివ‌ర‌ణ ఇచ్చారు. తాము అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత పోల‌వ‌రం ప్రాజెక్టు పైన ప్ర‌త్యేక దృష్టి పెట్టామ‌న్నారు. 2021 నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి నీటిని విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నామ‌న్నారు. అదే విధంగా నిపుణుల క‌మిటీతో పోల‌వ‌రం పైన అధ్య‌య‌నం చేస్తు న్నామ‌ని..అనేక అవినీతి అంశాలు వెలుగులోకి వ‌స్తున్నాయ‌ని..15 రోజుల్లో పూర్తి స‌మాచారం ప్ర‌జ‌ల ముందు ఉంచుతా మ‌ని ముఖ్య‌మంత్రి ప్ర‌క‌టించారు.

పోల‌వ‌రంలో అడ్డ‌గోలుగా వ్య‌వ‌హ‌రించారు..
పోల‌వ‌రం నిర్మాణంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అక్ర‌మాల‌కు పాల్ప‌డింద‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆరోపించారు. ప్రాజె క్టు విష‌యంలో నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రించి..త‌మ అనుయాయుల‌కు కోట్లాది రూపాయాలు క‌ట్ట‌బెట్టార‌ని వివ‌రించారు. పోల‌వ‌రం ప్రాజెక్టును నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోందన్నారు. పోలవరం నిర్మాణంలో డబ్బు ఆదా చేసే చర్యలు చేపట్టామని వెల్లడించారు. నవంబర్‌ 1 నుంచి పోలవరం పనులు మొదలు పెట్టాలని, నాలుగు నెలలుగా పనులు ఆగడానికి చంద్రబాబే కారణమని జగన్‌ దుయ్యబట్టారు. స్పిల్‌వే పూర్తి కాకుండా కాపర్‌డ్యామ్‌ చేపట్టడంతో నష్టం జరిగిందని, జూన్‌ 2021 నాటికి నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామ‌ని సీఎం స్ప‌ష్టం చేసారు. కాఫర్‌ డ్యామ్‌ వల్ల గోదావరి వెడల్పు 70 శాతం తగ్గిపోయింది. మిగిలిన కొద్ది భాగం నుంచే వరద నీరు వెళ్లాల్సిన పరిస్థితి. జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు వరదలు వస్తాయని వివ‌రించారు.

CM Jagan announced with in 15 days govt will reveal the scam in Polavaram payments in Chandra babu tenure

15 రోజుల్లో నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి..
పదిహేను రోజుల్లో తెలుగుదేశం పార్టీ స్కాములు అన్నీ బయటకు వస్తాయని ముఖ్యమంత్రి జగన్ సంచలన ప్రకటన చేశారు. ప్రజలకు ఆ వివరాలను అన్నిటిని తెలియచేస్తామని ఆయన అన్నారు.మొదటిసారిగా పోలవరంపై రివర్స్ టెండర్ లకు వెళుతున్నామని ఆయన అన్నారు. పోలవరానికి రీటెండరింగ్‌ చేస్తే రూ.1500 కోట్ల వరకు మిగులుతాయ ని ముఖ్య‌మంత్రి వివ‌రించారు. గత ప్రభుత్వం సబ్‌ కాంట్రాక్టర్ల ముసుగులో నచ్చిన వారిని తీసుకొచ్చి నామినేషన్‌ పద్ధతిలో వర్క్స్‌ ఇచ్చారని విమర్శించారు. యనమల వియ్యంకుడు పోలవరం సబ్‌ కాంట్రాక్టర్‌గా ఉన్నారని గుర్తు చేసారు. ప్రాజెక్టులో ఇటుక కూడా పడని చోట రూ.724 కోట్ల మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌లు ఇచ్చారని ఆరోపించారు. ఏ స్థాయిలో దోచుకున్నారో మరో 15 రోజుల్లో తేలిపోతుందని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. తమ స్వార్దం కోసం చం్రబాబు సభను వాడుకుంటున్నారని ఆయన అన్నారు.

English summary
AP Cm jagan sesational statement in Assembly. CM announced with in 15 days govt will reveal the scam in Polavaram payments in Chandra babu tenure.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X