వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ ధైర్యం అదేనా : ప‌ధ‌కాల‌కు నిధుల మాటేంటి..మ‌ంత్రుల్లోనే అనుమానం: సీఎం ఏం చెప్పారు..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

జ‌గ‌న్ ధైర్యం అదేనా...!! ఇన్ని ప‌ధ‌కాల‌కు నిధుల ఎక్కడివి..?? || Oneindia Telugu

ఏపీ ఇప్పటికీ ఓవ‌ర్ డ్రాఫ్ట్‌లో ఉంది. ముఖ్య‌మంత్రి జ‌గన్ హామీలు గుప్పిస్తున్నారు. ఆర్దికంగా ప‌రిస్థితి స‌హ‌క‌రించ‌టం లేదు. అయినా..త‌న ప‌ధ‌కాల అమ‌లుకు ముహూర్తాల‌ను ఫిక్స్ చేస్తున్నారు. ఇంత‌కీ జ‌గ‌న్ దైర్యం ఏంటి. నిధులు ఎలా స‌మ‌కూరుస్తారు. ఏ ఒక్క‌టి తేడా వ‌చ్చినా..రాజ‌కీయంగా భారీ న‌ష్టం త‌ప్ప‌దు. మ‌రి..ఇవ‌న్నీ తెలిసిన జ‌గ‌న్ ఆర్దిక స్థితి ఎలా నియంత్రిస్తారు. ప్ర‌జ‌ల పైన భారం లేకుండా ప‌ధ‌కాల అమ‌లు సాద్య‌మేనా. అస‌లు జ‌గ‌న్ హామీలు పూర్తి స్థాయి లో అమ‌లు కావాలంటే ఎంత కావాలో తెలుసా..

మాట త‌ప్ప‌ను..అమ‌లు చేస్తాను..

మాట త‌ప్ప‌ను..అమ‌లు చేస్తాను..

తాను అధికారంలోకి వ‌స్తే చెప్పిన ప్ర‌తీ మాట అమ‌లు చేస్తాన‌ని జ‌గ‌న్ చెబుతున్నారు. అందుకు అయిదేళ్ల స‌మ‌యం కాకుండా.. అధికారంలోకి వ‌చ్చిన తొలి రోజు నుండే నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. ప్ర‌తీ రైతుకు రూ.12,500. అదే విధంగా అంగ‌న్ వాడీ..ఆశా..పారిశుద్ద కార్మికుల జీతాల పెంపు. ఉద్యోగుల‌కు 27 శాతం మ‌ధ్యంత భృతి. జ‌న‌వ‌రి 26న అమ్మ ఒడి కింద ప్ర‌తీ ఒక్క‌రికి 15 వేల న‌గ‌దు. దీనికి తోడు రైతుల‌కు సంబందించి స‌బ్సిడీలు..స్థినీక‌ర‌ణ నిధి వంటి వాటి కోసం నిధులు. ఇదే స‌మ‌యంలో డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రుణ మాఫీ కింద పెద్ద మొత్తంలో నిధులు విడుద‌ల చేయాల్సి ఉంది. వీటితో పాటుగా పెరిగిన మ‌ధ్యంత‌ర భృతి కార‌ణంగా ఉద్యోగులు..పెన్ష‌న‌ర్ల కోసం 900 కోట్ల ఖ‌ర్చు. ఇక‌, సామాజిక పెన్ష‌న్ల‌ను ప్ర‌తీ ఏటా 250 చొప్పున పెంచుకుంటూ మూడు వేలు చేస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌. అదే స‌మ‌యంలో పెన్ష‌న్ వ‌య‌సు 65 నుండి 60కి త‌గ్గించ‌టం ద్వారా ల‌బ్ది దారుల సంఖ్య పెర‌టంతో మ‌రిం భారం. మ‌రి వీట‌న్నింటికీ జ‌గ‌న్ నిధులు ఎలా సమీక‌రిస్తారు. ఎలా స‌ర్దుబాటు చేస్తారు.

డ్వాక్రా రుణ మాఫీ కోస‌మే 27,451 కోట్లు..

డ్వాక్రా రుణ మాఫీ కోస‌మే 27,451 కోట్లు..

జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌లో ఇచ్చిన హామీ మేర‌కు డ్వాక్రా మ‌హిళ‌ల రుణ మాఫీ కోస‌మే 27,451 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనికి తోడు 2016 నుండి రుణాలపై వ‌డ్డీ బ‌కాయి మ‌రో 2,303 కోట్లు మేర ఉంది. వ‌చ్చే ఏడాది నుండి ప్ర‌తీ ఏటా 25 శాతం చొప్పున మ‌హిళ‌లకే ఈ రుణం మొత్తం చెల్లించేలా జ‌గ‌న్ నిర్ణ‌యించారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీ వ‌ర‌కు తీసుకున్న రుణా విలువ మొత్తంగా 27,451 కోట్లుగా నిర్ధారించారు. ఈ రుణాలను మహిళలు ముందుగా బ్యాంకులకు చెల్లిస్తే... వచ్చే ఏడాది నుంచి ఏటా 25 శాతం చొప్పున నాలుగేళ్లలో ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందిస్తుంది.2016 ఆగ స్టు వరకు వడ్డీ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఆ తరువాత నుంచి పెండింగ్‌లో ఉంది. ఆ మొత్తం ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి రూ.2,303 కోట్లుగా తేలింది. దీనిని వెంటనే చెల్లించాలని ముఖ్యమంత్రి జగన్‌ భావిస్తున్నారు. ఈ మొత్తాన్ని జులైలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో చూపే అవకాశముంది. దీంతో పాటు ద‌శ‌ల వారీగా మ‌ద్యపాన నిషేధం ద్వారా ఖ‌జానాకు మ‌రింత న‌ష్టం రానుంది.

జ‌గ‌న్ ధైర్యం అదేనా..

జ‌గ‌న్ ధైర్యం అదేనా..

ఏపీలో ఆర్దిక ప‌రిస్థితి దారుణంగా ఉంది. ఇదే స‌మ‌యంలో హామీల అమ‌లు భారంగా మారుతోంది. దీంతో..వీటిని ఎలా అధిగ‌మిస్తామ‌ని మంత్రుల‌కు సందేహాలు ఉన్నాయి. ఇదే విష‌యం పైన ఇద్ద‌రు సీనియ‌ర్ మంత్రులు చొర‌వ తీసుకొని జ‌గ‌న్‌ను ప్ర‌శ్నించారు. దీనికి జ‌గ‌న్ అది నాకు వ‌దిలేయండి. నేను చూసుకుంటాను అని హామీ ఇచ్చారు. మ‌న‌కు నిధుల గురించి బాధ లేద‌ని..ఆ ధైర్యం లేక‌పోతే ప‌ధ‌కాల అమ‌లు గురించి తేదీలు..ముహూర్తాల‌తో ఎలా ప్ర‌క‌టిస్తామ‌ని జ‌గ‌న్ ఎదురు ప్ర‌శ్నించారు. అయితే, జ‌గ‌న్ చెబుతున్న దాని ప్ర‌కారం గ‌త ప్ర‌భుత్వంలో వ‌లే దుబారాను నియంత్రిస్తే భారీగా ఖ‌ర్చు మిగిలుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అదే స‌మ‌యంలో ప్రాజెక్టుల కోసం భారీగా కాంట్రాక్ట‌ర్ల‌కు నిధులు కేటాయించార‌ని..వీటిని ప్ర‌క్షాళ‌న చేస్తే నిధులు మిగులుయాని చెబుతున్నారు. ఇక కేంద్రంతో స‌ఖ్య‌త‌గా ఉండ‌టం ద్వారా కేంద్ర నిధుల‌ను స‌కాలంలో తెచ్చుకోగ‌లిగితే పెద్ద స‌మ‌స్య కాద‌న్న‌ది జ‌గ‌న్ వాద‌న‌.

English summary
AP Cm Jagan Announcing implementation of his promises with fixed dates. Now some minister doubting about funds problem for these schemes. But, Jagan assured them that he will take care of Funds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X