వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిమ్మగడ్డకు సీఎం జగన్ చెక్: ఆయన అధికారాలకు కత్తెర వేసేలా..: కొత్త వ్యూహంతో ముందుకిలా..!

|
Google Oneindia TeluguNews

అమరావతి:ఏపీలో ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల సంఘంగా మారిన వివాదం కొత్త మలుపు తీసుకుంటుంది. ప్రభుత్వానికి సమచారం లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వాయిదా వేయటం పైన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైన ముఖ్యమంత్రి తో సహా ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. తాజాగా ఎన్నికల కమిషనర్ రాసినట్లుగా వైరల్ అయిన లేఖలో ఏపీ ప్రభుత్వాన్ని డామేజ్ చేసే విధంగా వ్యాఖ్యలు ఉండటంతో..దీని పైన ముఖ్యమంత్రి ఆరా తీస్తున్నారు. నేరుగా డీజీపీ..నిఘా చీఫ్ తో అసలు ఈ లేఖ తాను రాయలేదని నిమ్మగడ్డ స్పష్టం చేయటంతో..ఎక్కడి నుండి ఈ లేఖ వచ్చింది...ఎవరు ప్రచారంలోకి తెచ్చారనే అంశం పైన చర్చిస్తున్నారు. ఇక, ఇదే సమయంలో ఎన్నికల కమిషనర్ పేరుతో తనకున్న విచక్షణాధికారాలకు కత్తెర వేసేలా ముఖ్యమంత్రి కొత్త వ్యూహం అమలుకు సిద్దమయ్యారు.

కొత్త వ్యూహంపై సీఎం మంతనాలు..

కొత్త వ్యూహంపై సీఎం మంతనాలు..

ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పూర్తిగా చంద్రబాబుకు మేలు చేసేందుకే ప్రయత్నిస్తున్నారని ఓపెన్ గానే విమర్శించారు. ఆయన పైన చర్యలు తీసుకొనే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేక పోవటంతో..కమిషనర్ గా ఆయన అధికారాలకు చెక్ పెట్టేందుకు నిపుణులతో కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ గా పని చేసిన మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డితోనూ జగన్ సమావేశమయ్యారు. ఆ సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘంలో ఒకరే కమిషనర్ ఉండటంతో..మరో ఇద్దరు సభ్యుల నియామకానికి అవకాశం ఉంటుందని..ఈ విధంగా చట్ట సవరణ చేసి కొత్త సభ్యులను నియమించిటం ద్వారా ఒకే కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ అధికారాలకు చెక్ పెట్టవచ్చనే అభిప్రాయం వ్యక్తం అయినట్లు తెలుస్తోంది.

సభ్యులపై కసరత్తు

సభ్యులపై కసరత్తు


అయితే, నిమ్మగడ్డ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా ఉండటంతో.. చట్ట సవరణ ద్వారా మరో ఇద్దరు కమిషనర్లు నియమించటం..ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ముగ్గురు సభ్యుల్లో మెజార్టీ అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే సమయంలో కమిషనర్ గా నిమ్మగడ్డను కొనసాగిస్తేనే..నియమించే ఇద్దరు సభ్యుల్లో ఒకరిని చీఫ్ కమిషనర్ గా నియమించే అవకాశాల పైనా కసరత్తు జరుగుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం

 ఏపీపీఎస్సీ లోనూ గతంలో ఇదే తరహాలో..

ఏపీపీఎస్సీ లోనూ గతంలో ఇదే తరహాలో..

ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఉదయ్ భాస్కర్ ను నియమించారు. అయితే, జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయన్ను తొలిగించాలని భావించినా చట్ట పరంగా అవకాశం లేకపోవటంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల పైన ఫోకస్ చేసింది. దీంతో..గతంలో ఎన్నడూ లేని విధంగా ఐపీఎస్ అధికారిని కార్యదర్శిగా నియమించి ఆయన ద్వారా కార్యకలాపాలు కొనసాగిస్తు న్నారు. సంస్థకు సంబంధించిన ప్రకటనలు..పాలనా వ్యవహారాలు మొత్తంగా కార్యదర్శి పేరుతోనే కొనసాగుతున్నాయి.

Recommended Video

AP Local Body Polls: No Elections In AP, Supreme court Supports Election Commission!
త్వరలోనే ఉత్తర్వులు

త్వరలోనే ఉత్తర్వులు

ప్రభుత్వ ఉద్దేశం అర్దం అయినా..ఛైర్మన్ తన విధులకే పరిమితం అవుతున్నారు. ఇప్పుడు ఎన్నికల సంఘంలోనూ కొత్త నియామకాల పైన..ప్రభుత్వానికి ఉన్న అధికారాల పైనా ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం తరహాలో సీఈసీ..అదే విధంగా కమిషనర్లను ఏపీ ఎన్నికల సంఘంలోనూ నియమించే విధంగా అడుగులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

English summary
After the Supreme court upheld the decision of SEC over local body polls, CM Jagan had taken another step to counter elections officer Ramesh Kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X