• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మానవీయకోణంలో స్పందించండి- రాష్ట్ర ప్రభుత్వ చర్యలు బేష్ : సీఎం జగన్ తో కేంద్ర బృందం భేటీ...!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం ముఖ్యమంత్రి జగన్ తో సమావేవమైంది. వరద బాధిత ప్రాంతాల్లో తాము పరిశీలించిన అంశాలను కేంద్ర బృందం సీఎంకు వివరించింది. కేంద్ర హోంమంత్రిత్వశాఖ అధికారి కునాల్‌ సత్యార్థి కేంద్ర బృందం తరఫున వివరాలు అందించారు. వీలైనన్ని గ్రామాలను, వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలనూ పరిశీలించామని చెప్పారు. కడప జిల్లాకు భారీ నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. మౌళిక సదుపాయాలు బాగా దెబ్బ తిన్నాయని వివరించారు.

అధికారులు బాగా పని చేసారు

అధికారులు బాగా పని చేసారు

అంకిత భావంతో పనిచేసే అధికారులు మీకు ఉన్నారని.. వీరంతా మాకు మంచి సహకారాన్ని అందించారని సీఎం తో చెప్పారు. విపత్తు సమయంలో అద్భుతంగా పనిచేశారని అభినందించారు. సంప్రదాయంగా వరదలు వచ్చే ప్రాంతం కాదని..అలాంటి ప్రాంతంలో ఊహించని రీతిలో వర్షాలు పడ్డాయని చెప్పారు. కడప జిల్లాలో వరదల వల్ల నష్టం అధికంగా ఉందన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన చోట... నష్టం అపారంగా ఉందని వివరించారు. చిత్తూరులో జిల్లాలో కొంత భాగం, నెల్లూరులో కూడా వరదల ప్రభావం అధికంగా ఉందని చెప్పారు.

కడప జిల్లాలో భారీ నష్టం జరిగింది

కడప జిల్లాలో భారీ నష్టం జరిగింది

కడప జిల్లాలో మౌలికసదుపాయాల నిర్మాణాలు దారుణంగా దెబ్బతిన్నాయి, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పుకొచ్చారు. బ్రిడ్జిలు, రోడ్లు తెగిపోవడం వల్ల చాలా గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయన్నారు. అత్యవసర సర్వీసులను వెంటనే పునరుద్ధరించడంలో అధికారులు చాలా బాగా పనిచేశాశారంటూ ప్రశంసించారు. సహాయక శిబిరాలను తెరిచి ముంపు బాధితులను ఆదుకున్నారన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు తీసుకున్న ఈ చర్యలన్నీ ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు.

మౌళిక వసతులు దెబ్బ తిన్నాయి

మౌళిక వసతులు దెబ్బ తిన్నాయి

వరదల వల్ల జరిగిన నష్టంలో 40శాతం రోడ్లు, భవనాల్లాంటి రూపేణా జరిగింది. 32 శాతం నష్టం వ్యవసాయం, అనుబంధ రంగాల్లో జరిగింది, ఇగిగేషన్‌ స్కీంల రూపేణా 16శాతం మేర జరిగిందని చెప్పుకొచ్చారు. వీలైనంత మేర ఆదుకోవడానికి మావంతు సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి విపత్తు హృదయవిదారకరమని సీఎం జగన్ సెంట్రల్ టీంతో చెప్పారు. ఉదారంగా, మానవతా పరంగా స్పందించాలని సీఎం జగన్ అధికారులను కోరారు. రాష్ట్రం పంపించిన నష్టం వివరాల్లో ఎలాంటి పెంపూ లేదని స్పష్టం చేసారు.

వెంటనే అడహాక్‌ ప్రాతిపదికన నిధులు

వెంటనే అడహాక్‌ ప్రాతిపదికన నిధులు

నష్టం అంచనాల తయారీకి క్షేత్రస్థాయిలో మాకు సమర్థవంతమైన వ్యవస్థఉందని వారితో చెప్పారు. నష్టంపోయిన పంటలకు సంబంధించి కచ్చితమైన, నిర్దారించబడ్డ లెక్కలు ఉన్నాయన్నారు.కోవిడ్‌ నియంత్రణా చర్యలకోసం వినియోగించినందువల్ల ఎస్టీఆర్‌ఎఫ్‌ నిధులు నిండుకున్నాయని మా ఆర్థిక శాఖ కార్యదర్శి వివరించిన అంశాన్ని గుర్తు చేసారు. పనులు చేయాలంటే నిధులు అవసరం, వెంటనే అడహాక్‌ ప్రాతిపదికన నిధులు ఇవ్వాలని సీఎం కోరారు. కేంద్ర బృందం చేసిన సూచనలనూ పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు.

తక్షణ సాయంగా వెయ్యి కోట్లు ఇవ్వాలని

తక్షణ సాయంగా వెయ్యి కోట్లు ఇవ్వాలని


దీర్ఘకాలంలో ఇలాంటి విపత్తులను నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు. వరదనీటిని తరలించడానికి ఇప్పుడున్న కాల్వల సామర్థ్యాన్ని పెంచేలా ఇటీవలే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నామని చెప్పారు. వీలైనంత త్వరగా పెద్దమొత్తంలో నీటిని తరలించే అవకాశం ఏర్పడుతుందన్నారు.

ఈకార్యక్రమంలో భాగంగా ఇప్పుడున్న రిజర్వాయర్లు, డ్యాంలపై పరిశీలన చేసి తగిన చర్యలు చేపడతామని సీఎం జగన్ వివరించారు. ఇప్పటికే ప్రధాని..అమిత్ షా కు లేఖలు రాసిన సీఎం తక్షణ సాయంగా వెయ్యి కోట్లు ఇవ్వాలని కోరారు. ఇక, ఇప్పుడు సెంట్రల్ టీం క్షేత్ర స్థాయి పర్యటనలు పూర్తి చేయటంతో..వారిచ్చే నివేదిక ఆధారంగా కేంద్రం స్పందించే అవకాశం కనిపిస్తోంది.

English summary
CM Jagan asked the officials of the central team to respond generously and humanely as huge damage had been caused due to the floods.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X