అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జగన్ అభయహస్తం: మండలి రద్దయినా పిల్లి, మోపిదేవికి అండగా ఉంటా, సీఎం భరోసాతో..

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ బిల్లు పెద్దల సభ శాసనమండలిలో బ్రేక్ పడటంతో సభనే రద్దు చేయాలని ప్రభుత్వం అనుకొంటుంది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకొన్నది. శాసనసభలో మండలి రద్దు చర్చను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించి.. సభలో ఆమోదింపజేసుకొంటారు. తర్వాత తీర్మానాన్ని కేంద్రానికి పంపించి.. మండలి రద్దు ప్రక్రియను కొనసాగిస్తారు. అయితే మండలి రద్దుతో ప్రభుత్వంలో ఇద్దరు కీలక నేతలు పదవీ కోల్పోయే అవకాశం ఉంది.

పిల్లి సుభాష్ చంద్రబోస్..

పిల్లి సుభాష్ చంద్రబోస్..

డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణ.. వీరిద్దరూ ఇప్పుడు మండలి సభ్యులుగా కొనసాగుతున్నారు. మండలి రద్దైతే వీరు క్యాబినెట్ బెర్త్ ఆరునెలల వరకే కొనసాగే అవకాశం ఉంది. తర్వాత ఎన్నికలు జరగవు కాబట్టి.. మంత్రి పదవీ వదులుకొవాల్సి ఉంటోంది.

జగన్ భరోసా

జగన్ భరోసా

మండలి రద్దు అంశంపై సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపివేది వెంకటరమణకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. అయితే వారి పదవీ ఎలా భర్తీ చేస్తారనే అంశంపై క్లారిటీ లేదు. మంత్రి పదవీ లేనందుకు క్యాబినెట్ ర్యాంకు గల నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారా అనే అంశం చర్చకు దారితీసింది.

ఎమ్మెల్సీ పదవీ..

ఎమ్మెల్సీ పదవీ..

పిల్లి సుభాష్ చంద్రబోస్ రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో ఓడిపోవడంతో... ఆయనకు ఎమ్మెల్సీ పదవీ ఇచ్చి, డిప్యూటీ సీఎంగా సీఎం జగన్ నియమించారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ 1950 ఆగస్ట్ 8వ తేదీన తూర్పుగోదావరి జిల్లా హసన్‌బాద్‌లో జన్మించారు. 1970లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2004లో కాంగ్రెస్ సపోర్ట్‌తో ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి మూడోసారి ఎన్నికయ్యారు.

వైఎస్ఆర్, రోశయ్య మంత్రివర్గంలో

వైఎస్ఆర్, రోశయ్య మంత్రివర్గంలో


వైఎస్ఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. తర్వాత జగన్‌ వర్గంలో చేరి మంత్రి పదవీకి రాజీనామా చేశారు. వైఎస్ఆర్ క్యాబినెట్‌లో రెండుసార్లు, రోశయ్య క్యాబినెట్‌లో ఒకసారి పనిచేశారు. ఏపీ డిప్యూటీ సీఎంతోపాటు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపులు మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.

మోపిదేవి వెంకటరమణ

మోపిదేవి వెంకటరమణ

మరో మంత్రి మోపిదేవి వెంకటరమణ గత ఎన్నికల్లో రేపల్లె నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో సీఎం జగన్ మండలికి పంపించి మంత్రి పదవీ కట్టబెట్టారు. మండలి రద్దుచేయడంతో మోపిదేవి కూడా మంత్రి పదవీ కోల్పోనున్నారు. మోపిదేవి వెంకటరమణ కాంగ్రెస్ పార్టీ నుంచి తన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రేపల్లె, బాపట్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.

Recommended Video

Abolish Of AP Legislative Council Resolution In Assembly After AP Cabinet Passes || Oneindia Telugu
మంత్రిగా..

మంత్రిగా..

వైఎస్ఆర్, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. 1989, 1994లో కుచినపుడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009, 2004లో మాత్రం విజయం సాధించారు. 2014లో రేపల్లి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కానీ తర్వాత ఎన్నికల్లో ఓడిపోవడంతో.. పెద్దల సభకు వెళ్లడం అనివార్యమైంది.

English summary
andhra pradesh cm jagan mohan reddy assure to pilli subash chandra bose, mopidevi venkata ramana on mlc seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X