వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిరూపిస్తా.. రాజీనామా చేస్తావా? సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్: శవ రాజకీయాలంటూ ఫైర్

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Assembly Winter Sessions 2019:బుగ్గన వేసిన పంచ్ కి నవ్వులే నవ్వులు | Buggana Punch To Chandrababu

ఏపీ శాసనసభలో ఉల్లి కొరత మీద స్వల్ప కాలిక చర్చ జరిగింది. ఆ సమయంలో టీడీపీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టింది. మంత్రి కన్నబాబు సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రైతు కొరత తీర్చేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఆ సమయంలో గుడివాడకు చెందిన వ్యక్తి ఉల్లి కోసం వెళ్లి మరణంచారంటూ టీడీపీ చేసిన విమర్శల మీద మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు.

తాజాగా గుడివాడకు చెందిన ఒక వ్యక్తి గుండెపోటుతో మరణించారని కుటుంబ సభ్యులు చెబుతుంటే..టీడీపీ మాత్రం ఉల్లి కోసం వెళ్లి మరణించారని చెప్పటం పైన ఫైర్ అయ్యారు. మీరు అలా చెబితే ఎక్స్ గ్రేషియా వస్తుందని..చంద్రబాబు వచ్చి పరామర్శిస్తారని టీడీపీ నేతలు వారికి చెప్పారంటూ కొడాలి నాని వివరించారు. అయితే, చంద్రబాబుకు గుడివాడ రావాలంటే భయమని..అక్కడ కొడాలి నాని ఉంటాడని బాబు భయపడుతున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ..టీడీపీ నేతలు శవాల కోసం ఎదురు చూస్తూ..శవ రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

CM Jagan Assured improve the onion supply from coming friday..

సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్..
ఉల్లి ధర మీద చర్చకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రమే కిలో ఉల్లి రూ 25కే అందిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. ఇప్పటి వరకు రైతు బజార్ల ద్వారా మాత్రమే ఉల్లి అందిస్తున్నామని..వచ్చే శుక్రవారం నుండి మార్కెట్ యార్డుల్లోనూ ఇదే తరహాలో విక్రయాలు చేస్తామని సభలో ప్రకటించారు. చంద్రబాబు కు శవ రాజకీయం వినహా..ప్రజలకు సేవ చేయటం తెలియదని సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు 37 వేల క్వింటాళ్లకు పైగా సబ్సిడీ ధరలకు ఉల్లి అందచేసామని వివరించారు. మరిన్ని ప్రాంతాల నుండి ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నామని సీఎం చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ లో మాత్రం కిలో ఉల్లి రూ 200 కు అమ్ముతున్నారంటూ జగన్ వ్యాఖ్యానించారు. దీనికి స్పందిస్తూ ప్రతిపక్ష నేత చంద్రబాబు తాను నిన్ననే సభలో చెప్పానని..తనకు హెరిటేజ్ ఫ్రెష్ తో సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని..లేకుంటే సీఎం రాజీనామా చేస్తారా అని సవాల్ చేసారు.

స్పందించిన మంత్రి బుగ్గన..
చంద్రబాబు సవాల్ పైన మంత్రి బుగ్గన స్పందించారు. చంద్రబాబు విషయాన్ని డైవర్ట్ చేయటానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఉల్లి ధరలకు..సవాల్ కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. హెరిటేజ్ లో చంద్రబాబుకు షేర్ ఉందంటూ బిజినెస్ ఛార్టెర్డ్ పత్రికలో వచ్చిన కధనాన్ని సభలో మంత్రి బుగ్గన ప్రస్తావించారు. అది పేరున్న పత్రికలో వచ్చిన కధనమని..ఇప్పుడు చంద్రబాబు రాజీనామా చేస్తారా అని నిలదీసారు. ఇంతలో స్పీకర్ జోక్యం చేసుకొని..రైతు భరోసా అంశం మీద స్వల్ప కాలిక చర్చ మొదలు పెట్టాలని సూచించారు. దీంతో..ఆ సవాల్ అంశం ముగిసింది.

English summary
TDP Chief Chandra Babu challenge to CM Jagan on his involvement in Heritage Fresh.GOvt assured to increase the onion supply form coming friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X