వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సన్నబియ్యం ఇస్తానని చెప్పలేదు.. సాక్షి తప్పుగా రాసింది.. వైఎస్ జగన్ క్లారిటీ

|
Google Oneindia TeluguNews

Recommended Video

AP Assembly Winter Sessions 2019 : సాక్షిలో తప్పు రాసారు అని ఒప్పుకున్న సీఎం జగన్..!

ఏపీ శాసనసభలో సన్నబియ్యం వ్యవహారం అధికార..ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చకు కారణమైంది. ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ అధికారంలోకి వస్తే సన్నబియ్యం ఇస్తామని హామీ ఇచ్చి తప్పిందని.. టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు..రామానాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆ సమయంలో మంత్రి కొడాలి నాని సమాధానం ఇచ్చే సమయంలో అచ్చెన్నతో వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి కొడాలి నాని సైతం తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.

ఆ పాపంలో నేనూ భాగస్వామినే: అందుకే 15 ఏళ్లు అధికారానికి దూరమయ్యా: సభలో స్పీకర్ సెన్సేషన్..!ఆ పాపంలో నేనూ భాగస్వామినే: అందుకే 15 ఏళ్లు అధికారానికి దూరమయ్యా: సభలో స్పీకర్ సెన్సేషన్..!

ఆ తరువాత మంత్రి రంగనాధ రాజు బియ్యం సరఫరా తీరును వివరించారు. టీడీపీ సభ్యులు శాంతించకపోవటంతో ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని వివరణ ఇచ్చారు. తాము బియ్యం గురించి ఎక్కడా మేనిఫెస్టోలో చెప్పకపోయినా..అమలు చేస్తున్నామని వివరించారు. దీని పైనే సాక్షిలో వచ్చిన వార్తను టీడీపీ నేతలు ప్రస్తావించగా..వారు కూడా మీ లాగానే పొరపాటు పడి తప్పు రాసారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రూ 1400 కోట్లతో నాణ్యమైన బియ్యం పధకాన్ని ఏప్రిల్ నుండి అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

కొడాలి నాని వర్సెస్ టీడీపీ

కొడాలి నాని వర్సెస్ టీడీపీ

కొద్ది రోజుల క్రితం మాజీ మంత్రి దేవినేని ఉమా..ప్రస్తుత మంత్రి కొడాలి నాని మధ్య తీవ్ర మాటల యుద్దానికి దారి తీసిన సన్న బియ్యం వ్యవహారం మరోసారి అసెంబ్లీలో దుమారం రేపింది. టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు..రామానాయుడు సభలో ప్రస్తావించారు. దీనికి మంత్రి కొడాలి నాని సమాధానం ఇచ్చారు. తాము ఎప్పుడూ సన్నబియ్యం ఇస్తామని చెప్పలేదని..కేవలం నాణ్యమైన బియ్యం ఇస్తామని మాత్రమే చెప్పానని వివరించారు. దీనికి టీడీపీ సభ్యులు అడ్డు చెప్పారు. దీనికి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. పరుష పదజాలం వినియోగించారు. వీళ్లను చూస్తే భయపడిపోవాలా అని ప్రశ్నించారు. దీంతో.. సీఎం జోక్యం చేసుకొని సమాధానం ఇచ్చారు. ఆ తరువాత మంత్రి వాడిన పదజాలాన్ని స్పీకర్ రికార్డుల నుండి తొలిగించారు.

మేనిఫెస్టోలో చెప్పకున్నా అమలు..

మేనిఫెస్టోలో చెప్పకున్నా అమలు..

తాము మేనిఫెస్టోలో ఎక్కడా చెప్పుకపోయినా నాణ్యమైన బియ్యం అందించే ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ వివరణ ఇచ్చారు. అసలు సన్న బియ్యం అనే పదం లేదని..స్వర్ణ రకం బియ్యాన్నే అలా పిలుస్తారని చెప్పుకొచ్చారు. కళ్ల అద్దాలు సరిచేసుకొని తమ మేనిఫెస్టో చూడాలని సూచించారు. తాము శ్రీకాకుళం లో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నామని..వచ్చే ఏప్రిల్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన బియ్యం అందించాలని నిర్ణయించామన్నారు. ఇందు కోసం గత ప్రభుత్వం కంటే ఎక్కువగా రూ 1400 కోట్లు కేటాయించామని స్పష్టం చేసారు. గతంలో చంద్రబాబు హాయంలో ఇచ్చిన బియ్యం రీసైక్లింగ్ అయి తిరిగి రేషన్ డీలర్లు..వ్యాపారులు వద్దకే చేరి పాలిష్ చేసి తిరిగి అమ్మకాలు సాగేవన్నారు. తాము గతంలో కంటే భిన్నంగా..మెరుగ్గా నాణ్యమైన బియ్యం అందిస్తున్నామని సీఎం వివరించారు.

సాక్షిలో తప్పు రాసారు..

సాక్షిలో తప్పు రాసారు..

ముఖ్యమంత్రి జగన్ పౌర సరఫరాల సమీక్షలో సన్న బియ్యం అందించాలని ఆదేశించారని..ఈ వార్త వైసీపీ ప్రభుత్వ అధికారిక గజెట్ సాక్షి పత్రికలో వచ్చిందని టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు సభలో ప్రస్తావించారు. ముఖ్యమంత్రి తన సమాధానంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. సాక్షిలో తప్పు రాసారాని అంగీకరించారు. అది మీ లాగానే తప్పుగా అర్దం చేసుకొని రాసారాని..అదే రోజున మీకు నచ్చే పత్రికల్లో ఏ రకమైన వార్త వచ్చిందో చూడాలని సూచించారు. అయితే, సభలోనే తాను శ్రీకాకుళం జిల్లాలో నాణ్యమైన బియ్యం ప్రారంభించే సమయంలో చెప్పిన విషయాలను సభలో స్క్రీన్ మీద ప్రదర్శించి ముఖ్యమంత్రి సభ్యులకు చూపించారు. అయితే, పాదయాత్ర సమయంలో చెప్పిన మాటలను ప్రదర్శించాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేసారు.

English summary
CM Jagan Clarified that govt assured only for supply of qulaity rice. They will implement this programme over all state from coming april onwards.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X