వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్ర‌ధాని స‌మావేశానికి జ‌గ‌న్‌..కేటీఆర్‌: విదేశాల‌కు చంద్ర‌బాబు : ప‌వ‌న్ క‌ళ్యాన్‌కు ఆహ్వానం లేదు..!

|
Google Oneindia TeluguNews

కీలక అంశాల పైన ప్ర‌ధాని మోదీ స‌మావేశం ఏర్పాటు చేసారు. ఈ స‌మావేశంలో పాల్గొనేందుకు ఏపీ ముఖ్య‌మంత్రి.. వైసీపీ అధినేత జ‌గ‌న్ ఢిల్లీ వెళ్తున్నారు. టీఆర్‌య‌స్ నుండి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజ‌ర‌వుతున్నారు. ఇదే స‌మావేశానికి ఆహ్వ‌నం అందినా..చంద్ర‌బాబు విదేశాల‌కు వెళ్తున్నారు. దీని మీద అనేక త‌ర్జ‌న భ‌ర్జ‌న‌ల త‌రువాత పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌ను పంపాల‌ని నిర్ణ‌యించారు. అదే స‌మ‌యంలో జ‌న‌సేన అధినేత‌కు మాత్ర ఆహ్వానం అంద‌లేద‌ని స‌మాచారం. ఇంత‌కీ..ప్ర‌ధాని ప్ర‌తిపాద‌న‌ల పైన తెలుగు పార్టీల‌ నేత‌లు ఏం చెప్ప‌బోతున్నారు..

ప్ర‌ధాని ఆహ్వానం..కీల‌క స‌మావేశం
ప్ర‌ధాని మోదీ ఢిల్లీలో 19న కీల‌క స‌మావేశం ఏర్పాటు చేసారు. ఈ స‌మావేశంలో పాల్గొనాల‌ని అన్ని పార్టీల అధినేత‌ల కు పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖా మంత్రి ప్రహ్లాద్‌ జోషి లేఖ‌లు రాసారు. ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా జ‌మిలి ఎన్నిక ల అంశం పైన చ‌ర్చించున్నారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలోనే దీని పైన ప్ర‌తిపాద‌న‌లు రాగా..కొన్ని పార్టీలు అప్పుడే మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. మ‌రి కొన్ని పార్టీలు అభ్యంత‌రం వ్య‌క్తం చేసాయి. అయితే, తుది నిర్ణ‌యం మాత్రం తీసుకోలేక పోయారు. తిరిగి ఇప్పుడు అధికారంలోకి రావటంతో ముందుగానే దీని పైన ఏకాభిప్రాయ సాధ‌న కోసం ప్ర‌య‌త్నాలు మొద‌లు పెడుతున్నారు. ఒక దేశం..ఒకేసారి ఎన్నిక‌లు అనే నినాదం పైన అన్ని పార్టీల అధినేత‌ల‌తో చ‌ర్చలు జ‌ర‌పా ల‌ని ప్ర‌ధాని నిర్ణ‌యించారు. దీంతో..ఏపీ-తెలంగాణ‌ల్లో ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అన్ని పార్టీల‌కు లేఖ‌లు రాసారు.

Cm jagan attending PrimeMinister Modi arranged meet on One nation one election with all political parties.

ఢిల్లీకి జ‌గ‌న్‌..కేటీఆర్‌..విదేశాల‌కు చంద్ర‌బాబు
ప్ర‌ధాని అధ్య‌క్ష‌త‌న జ‌రిగే అన్ని పార్టీల అధినేతల స‌మావేశంలో పాల్గొనేందుకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఢిల్లీ వెళ్తున్నారు . అదే విధంగా టీఆర్‌య‌స్ నుండి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజ‌ర‌వ్వాల‌ని నిర్ణ‌యించారు. ఇదే స‌మ‌యంలో నాటి ఎన్డీఏ భాగ‌స్వామిగా ఉన్న టీడీపీకి లేఖ రాసారు. అయితే ,దీని పైన పార్టీ నేత‌ల‌తో టీడీపీ అధినేత చంద్ర‌బాబు సుదీర్ఘంగా చ‌ర్చించారు. కీల‌క‌మైన అంశం కావ‌టంతో తాను హాజ‌ర‌వ్వ‌లా లేక పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌ను పంపించాలా అనే అంశం మీద చ‌ర్చించారు. అయితే, చంద్రబాబు కుటుంబ స‌భ్యుల‌తో విదేశాల‌కు వెళ్తున్నారు. దీంతో.. టీడీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌ను పంపిస్తున్నట్లు స‌మాచారం అందించారు. ఇక‌, జ‌నసేన అధినేత‌కు ప్ర‌ధాని వ‌ద్ద నుండి లేఖ అంద‌లేద‌ని స‌మాచారం. దీంతో..ఆయ‌న హాజ‌రు కావ‌టం లేదు. దీని పైన వివ‌ర‌ణ తీసుకొనే ప్ర‌య‌త్నం చేయ‌గా.. అన్ని పార్టీలు అంటే లోక్‌స‌భ‌లో ప్రాతినిధ్యం ఉన్నా పార్టీలకే ఆహ్వానం పంపామ‌ని కేంద్రం చెబుతోంది. దీంతో.. ఇక ఇప్పుడు వైసీపీ..టీడీపీ..టీఆర్‌యస్ నేత‌లు ప్ర‌ధాని ప్ర‌తిపాద‌న‌కు ఎటువంటి స్పంద‌న వ్య‌క్తం చేస్తారో చూడాలి.

English summary
AP Cm jagan attending PrimeMinister Modi arranged meet on One nation one election with all political parties. TDP Chief Chandra Babu not attending this meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X