వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శత్రువులు ఏకమయ్యారు.. పోరాటం కొనసాగిస్తా: జగన్ భావోద్వేగం!

|
Google Oneindia TeluguNews

Recommended Video

YS Jagan Emotional Speech || ఇంగ్లీషు మీడియం వ్యతిరేకిస్తే నిలదీయండి || Oneindia Telugu

ముఖ్యమంత్రి జగన్ మరోసారి ఇంగ్లీషు మీడియ పాఠశాలల ఏర్పాటు పైన మాట్లాడారు. వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకెళ్లటమే లక్ష్యంగా తాను ప్రయత్నాలు చేస్తున్నానని వివరించారు. అది తప్పు అన్నట్లుగా తన పైన అపనిందలు వేస్తూ..దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ఇంగ్లీషు మీడియం చదువులు వ్యతిరేకిస్తున్న నేతలు..పత్రికాధిపతులను ప్రశ్నించాలని సూచించారు. వారి పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటే..మా పిల్లలు చదువుకోకూడదా అని నిలదీయాలని పిలుపునిచ్చారు. మీ బిడ్డగా చేయగలిగినదంతా చేస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

ఆ ఎంపీపై సీఎం జగన్ ఆగ్రహం వెనుక: పార్టీలో కొనసాగరా..బీజేపీ వైపేనా : ప్రధాని పలకరింపుతో..మారిన సీన్.ఆ ఎంపీపై సీఎం జగన్ ఆగ్రహం వెనుక: పార్టీలో కొనసాగరా..బీజేపీ వైపేనా : ప్రధాని పలకరింపుతో..మారిన సీన్.

సీఎం జగన్ భావోద్వేగం..పోరాటం కొనసాగిస్తా

సీఎం జగన్ భావోద్వేగం..పోరాటం కొనసాగిస్తా

ముఖ్యమంత్రి జగన్ కొద్ది రోజులుగా విపక్షాలు తన పైన చేస్తున్న ఆరోపణలను..విమర్శలను ప్రస్తావించారు. తనకు శత్రువలు ఎక్కువని గతంలో వ్యాఖ్యానించిన జగన్ ఇప్పుడు ...శత్రవులంతా ఏకమయ్యారని వారు తన పైన అపనిందలు వేసి..దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పటి వరకు వెనుకబడి ఉన్న వారిని పైకి తీసుకొచ్చేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నానని.. మీ బిడ్డకు అండగా నిలవాలని అభ్యర్దించారు. ప్రజలను మభ్య పెట్టేలా దుష్ప్రచారం చేస్తూ.. తాను తప్పు చేస్తున్నట్లుగా చిత్రీకిరంచే ప్రయత్నం కొనసాగిస్తున్నారంటూ మండిపడ్డారు. ఎవరు ఏం చేసినా..వారితో తాను పోరాటం కొనసాగిస్తానని ప్రజలు అండగా నిలవాలని కోరారు.

ఇంగ్లీషు మీడియం వద్దన్న వారిని నిలదీయండి..

ఇంగ్లీషు మీడియం వద్దన్న వారిని నిలదీయండి..

ప్రభుత్వం వెనుకబడిన వర్గాల పిల్లలను డెవలప్ చేసే ఉద్దేశంతో ఇంగ్లీషు మీడియం స్కూళ్లను తీసుకొస్తొందని ముఖ్యమంత్రి వివరించారు. కొందరు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని..పేదల పిల్లలు ఇంగ్లీషు మీడియం లో చదవకూడదా అని ప్రశ్నించారు. ఎవరైతే ఇంగ్లీషు మీడియంకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారిని నిలదీయాని జగన్ పిలుపునిచ్చారు. వారి పిల్లలు మాత్రమే ఇంగ్లీషు మీడియం లో చదవాలా అని ప్రశ్నించాలని సూచించారు. పేదల పిల్లలు భవిష్యత్ లో డ్రైవర్లుగానో..కూలీలుగానే మిగిలి పోకూడదని..ప్రతీ ఇంట్లో పిల్లలు డాక్టర్లు..లేదా ఇంజనీర్లుగా ఎదిగేలా సహకరించాలనేదే తన లక్ష్యమని సీఎం స్పష్టం చేసారు. ఇంగ్లీషు మీడియం పైన తప్పుగా మాట్లాడుతున్నవారిని నిలదీయాల్సింది మీరేనంటూ సూచించారు.

ఆరు నెలల కాలంలోనే చెప్పిన ప్రతీదీ..

ఆరు నెలల కాలంలోనే చెప్పిన ప్రతీదీ..

తాను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే చెప్పిన అంశాలతో పాటుగా..చెప్పనవి కూడా చేస్తూ వచ్చానని ముఖ్యమంత్రి వివరించారు. ఆరు నెలల కాలంలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసానని చెప్పుకొచ్చారు ఆర్డికంగా ఇబ్బందులు ఉన్నా 46 లక్షల కుటుంబాలకు రైతు సబ్సిడీ అందించామన్నారు. డ్రైవర్లకు పది వేల చొప్పున ఇచ్చాని..అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలిచామన్నారు. ఎస్సీ..ఎస్టీ..బీసీ.. మైనార్టీలకు ప్రభుత్వ పదవుల్లోనూ..పనుల్లోనూ 50 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నామని చెప్పారు. అందునా..మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు అవుతుందని చెప్పుకొచ్చారు.

పాఠశాలలు..ఆస్పత్రులల్లో కొత్తగా

పాఠశాలలు..ఆస్పత్రులల్లో కొత్తగా

తమ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు..ఆస్పత్రుల డెవలప్ మెంట్ కోసం ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తోందని సీఎం జగన్ వివరించారు. కనీస వసతులు లేని ప్రభుత్వ పాఠశాలల్లో నాడు ..నేడు పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించి పూర్తి స్థాయిలో పాఠశాలలను నవీకరిస్తామని స్పష్టం చేసారు. అదే విధంగా ప్రతీ ప్రభుత్వ ఆస్పత్రిని సైతం పేదలకు అందుబాటులో ఉండే విధంగా తీర్చి దిద్దుతామని సీఎం జగన్ వెల్లడించారు. గతంలో ఉన్న పాఠశాలలు..ఆస్పత్రుల ఫొటోలను చూపిస్తూ..వచ్చే ఏడాదికి జరిగే మార్పులతో మరోసారి ఫొటోలు తీసి ప్రజల ముందు ఉంచుతామని వివరించారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న మీ బిడ్డను ఆశీర్వదించండి అంటూ ముఖ్యమంత్రి కోరారు.

English summary
CM Jagan became emotional in public meeting in east godavari. CM says his enemies target him and doing negative propoganda. He says, Still he will fight against them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X