• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జడ్జిలపై జగన్ ఫిర్యాదు: నారా లోకేశ్ తీవ్ర స్పందన - ‘ఆంధ్ర ఎస్కోబార్’ అంటూ టీడీపీ ఫైర్

|

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వాన్ని అస్థరపర్చేలా ప్రతిపక్ష నేత చద్రబాబుకు అనుకూలంగా ఏపీ హైకోర్టు జడ్జిలు కొందరు, సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి ఒకరు వ్యవహారాలు నడుపుతున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ఫిర్యాదు సంచలనం రేపింది. సిట్టింగ్ జడ్జిలపై ఒక సీఎం ఈ తరహా ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కావడంతో దేశమంతా దీనిపైనే చర్చించుకుంటున్నది. అయితే రోజులు గడుస్తున్నా, ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు మౌనంగా ఉండిపోవడం అందరినీ విస్మయ పర్చింది. అంతలోనే సైలెన్స్ కు ఫుల్ స్టాప్ పెడుతూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు.

జగన్ ఆమె దుస్తులు విప్పేస్తున్నారు - సీఎంగా 3.5ఏళ్లు కష్టం - కాపాడేది ఆయనొక్కడే: ఎంపీ రఘురామ

ఎంతసేపూ ఢిల్లీలో చక్కర్లేనా?

ఎంతసేపూ ఢిల్లీలో చక్కర్లేనా?

వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటలుగా విస్తారమైన వర్షాలు కురుస్తుండటం, అన్ని చోట్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావడం తెలిసిందే. జనం కష్టాలు పడుతుంటే ముఖ్యమంత్రికి పట్టడంలేదని దుయ్యబట్టిన లోకేశ్.. సీఎం జగన్ రాష్ట్రాన్ని గాలికొదిలేసి.. ఢిల్లీ చుట్టు చక్కర్లు కొట్టడంలో, న్యాయమూర్తులపై ఫిర్యాదులు చేయడంలో బిజీగా గడుపుతున్నారని విమర్శించారు.

జగన్‌పై సునీల్ పోరు అద్భుతం - బట్టలు విప్పేసి రమ్మంటారా? అడ్వైజర్ల అతి వల్లే: రఘురామ ఫైర్

బురదంటే అసహ్యమా?

బురదంటే అసహ్యమా?

‘‘భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్నాయి. పంటలు మునిగి పోయాయి. రోడ్లు చెరువులయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాత్రం ఢిల్లీ చుట్టూ తిరిగి జడ్జీలపై కంప్లయింట్లు పెట్టడం తప్ప రాష్ట్రం పట్టదా? ఒక్క రోజన్నా కాలు బయట పెట్టి బాధితుల గోడు విన్నారా? వరదలు, బురదలు అంత అసహ్యం కలిగిస్తున్నాయా?'' అని లోకేశ్ ఫైరయ్యారు.

ఆంధ్రా ఎస్కోబార్..

ఆంధ్రా ఎస్కోబార్..

హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలపై ఏపీ సీఎం జగన్ ఫిర్యాదు చేయడాన్ని న్యాయవ్యవస్థపై దాడిగా టీడీపీ అభివర్ణించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘తాను చేసిన నేరాలకు పడే శిక్షలనుండి తప్పించుకునేందుకు నాడు కొలంబియా డ్రగ్ మాఫియా కింగ్ పాబ్లో ఎస్కోబార్ కొలంబియా సుప్రీమ్ కోర్టుపై మారణాయుధాలతో దాడి చేయగా,దానిని స్ఫూర్తిగా తీసుకున్న నేటి మన"ఆంధ్ర ఎస్కోబార్"జగన్ తన కేసులనుండి తప్పించుకునేందుకు న్యాయ వ్యవస్థపై చేస్తున్న హేయమైన దాడి'' అని వ్యాఖ్యానించారు.

English summary
TDP leader Nara Lokesh slams andhra pradesh Chief Minister YS Jagan for not caring people at heavy rains, he said cm is busy with delhi tours and complaining on judges. when heavy rains and floods were inundating the state, cm jagan Did not take any measures, he added
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X