అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి పేరెత్తకుండా...పర్యవరణం పై జగన్ కీలక వ్యాఖ్యలు : అందరూ కలిసి రావాలి...!!

|
Google Oneindia TeluguNews

రాజధాని మీద రగడ సాగుతున్నా..ముఖ్యమంత్రి అమరావతి గురించి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా జగన్ మాత్రం నోరు విప్పటం లేదు. రెండు రోజులు క్రితం రాజధాని పైన సమీక్ష తరువాత సీఎం జగన్ స్పష్టత ఇస్తారని భావించారు. కానీ, జరగలేదు. ఇక...వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎక్కడా అమరావతి పేరెత్తలేదు. కానీ పర్యవరణం పరిరక్షణకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసారు. మంత్రి బొత్సా కొద్ది రోజులుగా అమరావతిలో ముంపు ప్రాంతాలు..నిర్మాణాల ఖర్చు..పర్యావరణం గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పేర్కొన్నారు. దశల వారిగా 10 వేల ఎలక్ట్రిక్‌ బస్సులను తీసుకొస్తామని సీఎం ప్రకటించారు.

అందరూ కలిసి రావాలి..

అందరూ కలిసి రావాలి..

పర్యావరణ రక్షణ కోసం ప్రభుత్వంతో పాటు అదరూ కలిసి రావాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు. నీరు.. నేల.. నింగి.. గాలి వీటంన్నిటిని కూడా కాలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి మీద ఉందన్నారు. . విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని కోరారు. అడవుల సంఖ్య ఏటేటా తగ్గిపోతుందని, వీటిని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పేర్కొన్నారు. వన మహోత్సవం కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. విద్యార్థులలతో కలిసి మొక్కలు మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ పాలుపంచుకొని ప్రభుత్వానికి తోడుగా నిలవాలని కోరారు. రాష్ట్ర భూభాగంలో 37,258 చదరపు కిలోమీటర్లు ఉంటే ఇందులో 23 శాతం మాత్రమే అడువులు ఉన్నాయి. ఇందులో 13 శాంక్షరీలు, మూడు నేషనల్‌ పార్కులు, రెండు జులాజికల్‌ పార్కులు.. ఒక టైగర్‌ రిజర్వ్‌.. ఒక ఎనుగు రిజర్వ్‌ అడవులు మన రాష్ట్రంలో ఉన్నాయని చెప్పుకొచ్చారు.

25 కోట్ల మొక్కలు నాటేందుకు శ్రీకారం..

25 కోట్ల మొక్కలు నాటేందుకు శ్రీకారం..

పర్యావరణం బాగుంటేనే మనమంతా కూడా బాగుంటామని సీఎం స్పష్టం చేసార. వీటిని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన రాష్ట్రంలో 2351 వృక్షజాతులు, 1461 జంతు జాతులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో కొన్ని జంతువులు, మొక్కలు అంతరించి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. పులుల సంఖ్య రాష్ట్రంలో కేవలం 48 మాత్రమే ఉన్నాయన్నారు. ఈ ఏడాది ఆరు పెరిగాయని సంబరాలు చేసుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. వీటిని గురించి మనం పట్టించుకోవడం మానేస్తే పులులు, సింహాలు ఏవి కూడా ఉండవు. మన రాష్ట్రాన్ని కాపాడుకునే దిశగా అడుగులు వేస్తూ..రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నామని.. ఇప్పటిదాకా నాలుగు కోట్ల మొక్కలు నాటామన్న సీఎం.. ఈ ఒక్క రోజు కోటి మొక్కలు నాటుతున్నట్లు ప్రకటించారు. చేయాలి. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డును ప్రక్షళన చేయబోతున్నట్లు ప్రకటించారు. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నట్లు స్పష్టం చేసారు. ఈ ఏడాది అక్షరాల ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో 100 ఎలక్ట్రసిటీ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని.. దశల వారిగా 10 వేల ఎలక్ట్రిక్‌ బస్సులను తీసుకొస్తామని ప్రకటించారు.

అమరావతి పేరెత్తకుండానే...

అమరావతి పేరెత్తకుండానే...

అమరావతి గురించి ముఖ్యమంత్రి స్పందన కోసం రాష్ట్రం మొత్తం నిరీక్షిస్తోంది. రాజధాని గురించి తలెత్తిన అపోహలను తొలిగించాలని టీడీపీ..బీజేపీ..జనసేన డిమాండ్ చేస్తున్నాయి. కానీ, ముఖ్యమంత్రి ఇంత వరకు స్పందించలేదు. అయితే, ఆయన పర్యావరణ పరిరక్షణ గురించి పరోక్షంగా అమరావతి గురించి చెప్పారనే విశ్లేషణలు మొదలయ్యాయి. అమరావతిలో ముంపు ప్రాంతాల గురించి..పర్యావరణం గురించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో నాటి ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ను ఇప్పటికే ముఖ్యమంత్రి కేంద్రానికి నివేదించారు. మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా తన ప్రసంగానానికి ముఖ్యమంత్రి తక్కువ సమయం కేటాయించారు. అమెరికా పర్యటన తరువాత తొలి సారి బహిరంగ సభలో మాట్లాడుతుండటంతో..కీలక అంశాల పైన క్లారిటీ ఇస్తారని అందరూ ఆశించారు. కానీ, ముఖ్యమంత్రి మాత్రం తాను చెప్పదలచుకున్నది మాత్రమే చెప్పారు.

English summary
CM Jagan called for co operation from evry one to protest environment with planting plants as social responsibility. CM announced Govt shortly introduced electrical buses all over state. And also concentrating on strengthen the Pollution control board.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X