వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కామెంట్స్..ప్రగతి భవన్ లో వైబ్రేషన్స్..! సీఎంకు ఆ సమాచారం ఇచ్చిందెవరు: ఆ వ్యాఖ్యల వెనుక..!

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాలతో పాటుగా..జాతీయ స్థాయిలో సంచలనంగా మారిన దిశ అత్యాచారం..రేపు అదే విధంగా నిందితుల ఎన్ కౌంటర్ పైన ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఏపీలో మహిళా భద్రత గురించి చర్చ తరువాత ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. ఏపీలో మహిళా భద్రతకు సంబంధించి కొత్త చట్టం తీసుకురానున్నట్లు ప్రకటించారు. అయితే, జాతీయ స్థాయిలో కలకలానికి కారణమైన దిశ వ్యవహారంలో సీఎం చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు కారణమయ్యాయి.

ముఖ్యమంత్రి మహిళల భద్రత మీద ఉద్వేగంగా మాట్లాడారు. ఆ ఘటన పైన తాను ఎంతగా బాధ పడిందీ వివరించారు. అంత వరకు బాగానే ఉండి. అయితే, దిశ ఘటనకు సంబంధించి ..అదే విధంగా ఎన్ కౌంటర్ విషయంలో కేసీఆర్..తెలంగాణ పోలీసులను సభా వేదికగా..పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ అభినందించటం ఇప్పుడు ఈ చర్చకు కారణమైంది. వారు పోలీసుల మీద తిరగబడితే ఆత్మరక్షణ కోసం కాల్చామంటూ పోలీసులు చెబుతున్న సమయంలో..ముఖ్యమంత్రి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

నాకు ఒక్క భార్యే: కొందరికి ముగ్గురు కూడా సరిపోక: శాసనసభలో జగన్ పంచ్ లు..!నాకు ఒక్క భార్యే: కొందరికి ముగ్గురు కూడా సరిపోక: శాసనసభలో జగన్ పంచ్ లు..!

టోల్ కట్టడానికి వెళితే...

టోల్ కట్టడానికి వెళితే...

దిశ హత్యకేసులో ముఖ్యమంత్రి జగన్ ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఆయన మాటల్లో ఆవేదన స్పష్టంగా కనిపించింది. తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని...ఒక సోదరి ఉందని చెప్పుకొచ్చారు. అంతకు ముందు వైసీపీ మహిళా సభ్యులు సైతం దిశ ఘటన మీద ఆవేదన వ్యక్తం చేసారు. ముఖ్యమంత్రి జగన్ ఏపీలో మహిళలకు సంబంధించి కొత్త చట్టం తీసుకొస్తున్నట్లుగా ప్రకటించారు. అదే సమయంలో దిశ ఘటన పైన ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసారు. దిశ బైక్ దిగి టోల్ కట్టడానికి వెళితే పంక్చర్ చేసి అత్యాచారం చేసారని సీఎం చెప్పుకొచ్చారు. అయితే, టోల్ కట్టడానికి దిశ వెళ్లిందంటూ ముఖ్యమంత్రి చెప్పటం ద్వారా.. ఆయనకు అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారా..లేక ముఖ్యమంత్రి పొరపాటుగా చెప్పారా అనేదే ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చకు కారణమైంది.

కేసీఆర్ కు హాట్సాఫ్ అంటూ..

కేసీఆర్ కు హాట్సాఫ్ అంటూ..

దిశ నిందితుల విషయంలోనూ జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. జాతీయ మానవ హక్కుల సంఘం పైనా తీవ్రంగా స్పందించారు. దిశ హత్య కేసు నిందితులను ఎన్ కౌంటర్ చేయటం పైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ పోలీసులకు ముఖ్యమంత్రి జగన్ సభా వేదికగా హాట్సాఫ్ చెప్పారు. నిందితులను సీన్ రీ కన్స్రట్రక్షన్ లో భాగంగా తీసుకెళ్లగా..వారు తుపాకీలు లాక్కొని..తమ పైన దాడికి ప్రయత్నించగా..జరిగిన కాల్పుల్లో నిందితులు మరణించారని పోలీసులు చెప్పుకొచ్చారు. దీని పైన ఇప్పటికే జాతీయ మానవ హక్కుల సంఘం విచారణ ప్రారంభించింది. అదే విధంగా న్యాయ స్థానంలో పిటీషన్లు దాఖలయ్యాయి. ఇక, జగన్ ముఖ్యమంత్రి హోదాలో ఎన్ కౌంటర్ ను సమర్ధించేలా చేసిన వ్యాఖ్యలు సైతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రజలు కోరుకున్నదే జరిగిందని అందరూ చెబుతున్నా.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సమయంలో తమ నాయకుడు కొంత సంయమనంతో మాట్లాడితే బాగుందనే అభిప్రాయం సొంత పార్టీ ఎమ్మెల్యేల నుండే వ్యక్తం అవుతోంది.

సీరియస్ అంశంలో పెళ్లాల వ్యవహారం..

సీరియస్ అంశంలో పెళ్లాల వ్యవహారం..

ఇక, మహిళల భద్రత అంశంలో ఉద్వేగంగా మాట్లాడిన జగన్..తాను ఈ అంశంలో ఎంత సీరియస్ గా ఉంటానో వివరించారు. అదే సమయంలో కొత్త చట్టాలు అవసరమని స్పష్టం చేసారు. అయితే, అదే సమయంలో తనకు ఒక్క భార్యే అంటూ చెప్పటం..అదే విధంగా కొందరికి ఇద్దరు..ముగ్గురు భార్యలు ఉన్నా నాలుగో భార్య కోసం ముందుకు వస్తున్నారని వ్యాఖ్యానించటం పైన సొంత పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలే అంతర్గత చర్చల్లో సరి కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పరోక్షంగా పవన్ కళ్యాన్ ను టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేసినా..ఇటువంటి సీరియస్ అంశాల సమయంలో ఆ వ్యాఖ్యల ద్వారా మొత్తం చర్చ పక్క దోవ పట్టే అవకాశం ఏర్పడుతుందని వారి అభిప్రాయపడుతున్నారు.

English summary
CM Jagan comments on Disha episode in AP Assembly became hot topic in Telangana administration. Some of hte ycp leaders also discussing the same matter in assembly lobbies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X