వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వర్షిత హత్యపై స్పందించిన సీఎం జగన్‌మోహన్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

చిత్తూరు జిల్లాలో ఐదేళ్ల చిన్నారి వర్షితపై అత్యాచారం, హత్య ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. చిన్నారిపై అమానుష ఘటన తీవ్రంగా కలచివేసిందని సీఎం అన్నారు. హంతకుడిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దారుణ ఘటనకు పాల్పడ్డ వ్యక్తికి కఠిన శిక్ష పడేలా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇదిలాఉండగా.. కురబలకోట మండలం చేనేతనగర్‌లోని కల్యాణ మండపం సమీపంలో జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ముదివేడు పోలీసులు శనివారం పోస్టుమార్టం రిపోర్టు వివరాలు వెల్లడించారు. చిన్నారిపై అత్యాచారం చేసి, ఆపై ఊపిరాడకుండా చేయడం వల్లే మృతి చెందిందని ధృవీకరించారు.చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన వర్షితపై గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేసి అనంతరం హత్య చేసిన సంఘటన శనివారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.

cm jagan condemned murder of varshita

తల్లిదండ్రలతో పెళ్లికి వెళ్లిన వర్షిణి కిడ్పాప్‌కు గురైంది. దీంతో విషయాన్ని పోలీసులకు తెలిపి విచారణ జరిపేలోపే వర్షిణి శవమై తేలింది. బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు తెల్లవారుజామున పెళ్లిజరిగిన కళ్యాణమండపం వద్ద హత్య చేసి అక్కడే పడేసి వెళ్లిపోయారు. కాగా దీంతో అసంఘటనకు సంబంధించిన డెత్ రిపోర్ట్‌ను పోలీసులు బయటపెట్టారు. బాలికను అత్యాచారం చేసి ఊపిరి ఆడకుండా చేయడం వల్లే చిన్నారి మృతిచెందిందని నివేదికలో పేర్కోన్నారు.

English summary
Chief Minister YS Jaganmohan Reddy has condemned On the rape and murder of a five-year-old child in Chittoor district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X