వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ ధైర్యం ఇదే..మంత్రులు షాక్‌ : నిధుల స‌మీక‌ర‌ణ గురించి ఏం చెప్పారు: ప‌్ర‌ధాని ఏమన్నారంటే..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కేబినెట్ స‌మావేశంలో కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. తొలి కేబినెట్ స‌మావేశంలోనే జ‌గ‌న్ గ‌త సీఎంల కంటే భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు. కేబినెట్ స‌మావేశంలోని ప్ర‌తీ మినిట్ తానే స్వ‌యంగా రికార్డు చేసారు. ఏపీలో ప‌ధ‌కాల అమ‌లు కోసం డ‌బ్బులు ఎక్క‌డ నుండి తెస్తున్నారంటూ ప్ర‌శ్నిస్తున్నార‌నే చ‌ర్చ స‌మ‌యంలో జ‌గ‌న్ చెప్పిన స‌మాధానం తో ఒక్క సారిగా మంత్రులు షాక‌య్యారు. అదే ప్రధానితో ఢిల్లీలో స‌మావేశ‌మైన‌ప్పుడు..తిరుప‌తి వ‌చ్చిన స‌మ‌యంలో ఏం చెప్పార‌నేది జ‌గ‌న్ వివ‌రించారు. ఇంత‌కీ జ‌గ‌న్ ఏం చెప్పారు...

డ‌బ్బులు ఎలా తేవాలో తెలుసు..

డ‌బ్బులు ఎలా తేవాలో తెలుసు..

త‌న పాద‌యాత్ర‌..పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాల‌ను ఖ‌చ్చితంగా అమ‌లు చేయాల్సిందేన‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తొలి కేబినెట్ స‌మావేశంలో స్ప‌ష్టం చేసారు. అదే స‌మ‌యంలో అంద‌రూ ఈ ప‌ధ‌కాల అమ‌లు కోసం డ‌బ్బులు ఎక్క‌డ నుండి తెస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నార‌నే విష‌యం జ‌గ‌న్ ప్ర‌స్తావించారు. నిధులు ఎలా తేవాలో త‌న‌కు బాగా తెలుసంటూ జ‌గ‌న్ స‌మాధానం ఇచ్చారు. గ‌త ప్ర‌భుత్వంలో ప్ర‌తీ విభాగంలో అవినీతి చోటు చేసుకుంద‌ని..ఈ ప్ర‌భుత్వంలో అవినీతికి తావు లేకుండా పాల‌న ఉండాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసారు. తాను ఏపీలో ఆదాయం..ఖ‌ర్చుల గురించి పూర్తి స్థాయిలో లోతుగా అధ్య‌య‌నం చేసాన‌ని.. మ‌న‌సు ఉంటే మార్గం ఉంటుంద‌ని వివ‌రించారు. త్వ‌ర‌లోనే ఏపీలో ఆర్దిక క్ర‌మ‌శిక్ష‌ణ ఎలా ఉంటుందో చూస్తార‌ని వ్యాఖ్యానించారు.

అదీ జ‌గ‌న్ ధైర్యం...మంత్రులు షాక్

అదీ జ‌గ‌న్ ధైర్యం...మంత్రులు షాక్

జ‌గ‌న్ ప్ర‌భుత్వం కొలువు తీరిన త‌రువాత జ‌రిగిన తొలి కేబినెట్ స‌మావేశంలోనే అనేక ప‌ధ‌కాల అమ‌లుకు సంబంధిం చిన నిర్ణ‌యాల‌ను ప్ర‌క‌టించంది. ఇదే స‌మ‌యంలో మంత్రుల‌కు అవినీతికి సంబంధించి హెచ్చ‌రిక‌లు చేసిన జ‌గ‌న్ .. సీరియ‌స్‌గా ఉన్న మంత్రుల‌తో న‌వ్వండి అన్నా అంటూ అనే స‌రికి ఒక్క సారిగా న‌వ్వులు పూసాయి. ఇక, మంత్రి పేర్ని నాని ఇవ‌న్నీ ప్ర‌క‌ట‌న‌లేనా..అమ‌లువుతాయా అనే చ‌ర్చ కార‌ణంగా ప్ర‌జ‌ల్లో అనుమానాలకు అవ‌కాశం ఉంటుంని ప్ర‌స్తావించారు. అయితే, జ‌గ‌న్ స్పందిస్తూ ఏ నిర్ణ‌యం తీసుకోవాల‌న్నా..అమ‌లు చేయాల‌న్నా.. ధైర్యం ఉండాల‌ని సీఎం వ్యాఖ్యానించారు. మ‌నం ప‌ధ‌కాలు మాత్ర‌మే కాదు.. వాటి అమ‌లు చేసే తేదీల‌ను ప్ర‌క‌టిస్తున్నాం.. అదీ మ‌న మీద మ‌న‌కున్న న‌మ్మ‌కం..మ‌నం చేయ‌గ‌ల‌మనే ధైర్యం అంటూ..జ‌గ‌న్ చెప్పిన మాట‌లు విని ఒక్క‌సారిగా మంత్రులు షాక్ అయ్యారు.

ప్ర‌ధాని ఏం చెప్పారంటే..

ప్ర‌ధాని ఏం చెప్పారంటే..

తాను ప్ర‌ధాని మోదీతో రెండు సార్లు స‌మావేశ‌మ‌య్యాన‌ని ఆయ‌న మ‌న మీద సానుకూలంగా ఉన్నార‌ని జ‌గ‌న్ చెప్పిన‌ట్లుగా సమాచారం. ఏపీలో పవ‌ర్ ప్రాజెక్టు ఒప్పందాల విష‌యంలో గ‌త ప్ర‌భుత్వంలో జ‌రిగిన వాటిలో అవినీతి జ‌రిగింద‌నే కార‌ణంగా వాటిని స‌మీక్షించాల‌ని నిర్ణ‌యించామ‌ని..అయితే, కేంద్ర అధికారి వాటిని స‌మీక్షిస్తే ఇబ్బందులు వ‌స్తాయ‌ని లేఖ రాసార‌ని జ‌గ‌న్ వివ‌రించారు. దీంతో.. ఇదే విష‌యాన్ని తాను ప్రధాని దృష్టికి తీసుకెళ్లాన‌న్నారు. ప్ర‌ధాని కి ఒప్పందాల్లో జ‌రిగిన అవినీతి గురించి చెప్ప‌గా..ఆయ‌న సైతం త‌ప్పు జ‌రిగితితే స‌మీక్షించాల్సిందేన‌ని అభిప్రాయం వ్యక్తం చేసార‌ని..దీంతో.. పీపీఏ విచార‌ణ విష‌యంలో ముందుకే వెళ్తాన‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేసారు. అదే విధంగా కేంద్ర మంత్రుల‌తో సంబంధిత రాష్ట్ర మంత్రులు ట‌చ్‌లో ఉండాల‌ని..ఏపీకి ఏ శాఖ నుండి నిధులు రావాల్సి ఉంటుందో వాటి పైన ఫాలో అప్ చేసుకోవాల‌ని సూచించారు.

English summary
AP Cm Jagan Confident on getting funds to implement his promises and Manifesto in his administration. jagan said with ministers that He know how to create revenue for schemes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X