నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాధ్యం చేయగలిగాం - మూడోసారి నంబర్‌వన్‌ : సీఎం జగన్..!!

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఇండస్ట్రీ ఫెండ్లీ ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అన్ని విధాలా ప్రభుత్వ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఏపీలో పారిశ్రా వృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తోందన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందని సగర్వంగా చెప్పేందుకు రామ్‌కో సిమెంట్‌ పరిశ్రమ స్థాపనే ఒక ఉదాహరణ అన్నారు. రామ్‌కో పరిశ్రమతో 1000 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు.

రామ్‌కో ప్రాజెక్టు 2019లో మన ప్రభుత్వం వచ్చిన కొద్ది నెలల కాలంలో స్టార్ట్‌ అవ్వడం, 30 నెలల్లోనే సిమెంట్‌ ఉత్పత్తికి రెడీ అవ్వడం గొప్ప మార్పునకు చిహ్నమని సీఎం అన్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాలలో నెలకొల్పిన రామ్‌కో కంపెనీ సిమెంట్‌ పరిశ్రమను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

పరిశ్రమలకు ఫ్రెండ్లీ ప్రభుత్వం

సభలో పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. మనకు లైమ్‌స్టోన్‌ మైన్స్‌ ఉండి కూడా గతంలో ఎటువంటి పరిశ్రమలు రాని పరిస్థితులను చూశామని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం వచ్చాక దాదాపు 2 మిలియన్‌ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేసే రామ్‌కో పరిశ్రమను స్థాపించగలిగామని వివరించారు.

రాబోయే రోజుల్లో ఈ ప్లాంట్‌ ఫేస్‌-1 కింద తయారై.. ఆర్గానిక్‌ గ్రోత్‌లో పెరుగుతూ పోతుందని చెప్పారు. విస్తరణ జరిగే కొద్దీ ఇంకా మెరుగైన మౌలిక సదుపాయాలు వస్తాయన్నారు. పరిశ్రమ విస్తరణ జరిగే కొద్దీ 75 శాతం స్థానికులకు ఉద్యోగాలు కచ్చితం ఇవ్వాలని చట్టం చేయటంతో.. ఉద్యోగ అవకాశాలు మన పిల్లలకు మెరుగవుతాయని ముఖ్యమంత్రి చెప్పారు.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నంబర్‌ వన్‌ స్థానం

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నంబర్‌ వన్‌ స్థానం

రాయలసీమ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, రైతులకు మంచి జరగాలన్నా.. గ్రీన్‌ ఎనర్జీ ద్వారా సాధ్యపడుతుందని మన ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇందులో భాగంగానే గ్రీన్‌కో, ఇండోసాల్, ఆర్సిలర్‌ మిట్టల్, అరవిందో, అదానీలకు ఈ మధ్యకాలంలో రూ.72,188 కోట్లకు సంబంధించి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం జరిగిందని వివరించారు.

దాదాపు 3-4 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా దాదాపు 20 వేల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. పారిశ్రామిక వేత్తలు ప్రభుత్వం ఇస్తున్న సపోర్టు.. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈ సెగ్మెంట్లను ఏ రకంగా అడుగులు ముందుకు వేయిస్తుందనే అన్ని అంశాలను కలిపి.. పరిశ్రమలు పెట్టిన వారు ఏపీ బ్రహ్మాండంగా సపోర్టు చేస్తుందని చెప్పిన నేపథ్యంలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మనకు నంబర్‌ వన్‌ స్థానం వచ్చిందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

రానున్న రోజుల్లో మరింత వేగంగా

రానున్న రోజుల్లో మరింత వేగంగా

మరో 9 ఫిషింగ్‌ హార్బర్లను, ప్రతీ 50 కిలోమీటర్లకు ఫిషింగ్‌ హార్బర్, పోర్టు ఉండేలా.. దాని వల్ల రాష్ట్రంలో ఎక్స్‌పోర్ట్స్‌ పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. మరో 9 ఫిషింగ్‌ హార్బర్లను, ప్రతీ 50 కిలోమీటర్లకు ఫిషింగ్‌ హార్బర్, పోర్టు ఉండేలా.. దాని వల్ల రాష్ట్రంలో ఎక్స్‌పోర్ట్స్‌ పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం జగన్ వెల్లడించారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా రాష్ట్రంలో 3 ఇండస్ట్రీయల్‌ కారిడార్లు విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు, హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్ల అభివృద్ధి పనులు వేగంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు.

English summary
CM Jagan inauguarate the Ramco Cement industry in Nandayala area, explained the govt industrial policy
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X