వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్‌కు కాపు కాక‌: కాపు నేత‌ల‌తో భేటీ..బాబు కేంద్రానికి చెప్పిందిదీ : ముగ్గురు స‌భ్యుల‌తో క‌మిటీ

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు కాపు రిజ‌ర్వేష‌న్ల కాక తాకింది. తాజాగా ఏపీ ప్ర‌భుత్వం గ‌త ప్ర‌భుత్వం జారీ చేసిన విధంగా కాపు ల‌కు కేంద్రం ప్ర‌తిపాదించిన ఈడబ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్ల‌లో అయిదు శాతం కాపుల‌కు వ‌ర్తించ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. దీని మీద టీడీపీ కాపు నేత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేసారు. కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ సైతం సీఎంకు లేఖ రాసారు. దీంతో ..పార్టీలోని కాపు నేత‌లతో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌మావేశ‌మ‌య్యారు. చంద్ర‌బాబు - కేంద్రం మ‌ధ్య ఇదే అంశం మీద చోటు చేసుకున్న లేఖ‌ల‌ను బ‌య‌ట పెట్టారు. ఇదే స‌మ‌యంలో ఈ అంశం అధ్య‌య‌నం కోసం ముగ్గ‌రు సీనియ‌ర్ల‌తో క‌మిటీ ఏర్పాటు చేస్తూ ముఖ్య‌మంత్రి నిర్ణ‌యం తీసుకున్నారు.

Recommended Video

అబద్దాలతో సభలో టీడీపీ రాద్ధాంతం - వైఎస్ జగన్ ఆగ్రహం
కాపు నేత‌ల‌తో ముఖ్య‌మంత్రి స‌మావేశం..

కాపు నేత‌ల‌తో ముఖ్య‌మంత్రి స‌మావేశం..

సీఎం జ‌గ‌న్ కాపు నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. రెండు రోజుల క్రితం ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం పైన చ‌ర్చ సాగింది. దీని ద్వారా ఈడబ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్ల‌లో అయిదు శాతం కాపుల‌కు వ‌ర్తించ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. కాపు రిజర్వేష న్ల అంశంపై తాజా పరిణామాలను నేత‌లు ముఖ్య‌మంత్రికి వివ‌రించారు. స్వార్థరాజకీయాలకోసం, ఓటు బ్యాంకు రాజకీ యాలకోసం కాపుల రిజర్వేషన్ల అంశాన్ని వాడుకోవడానికి టీడీపీ ప్రయత్నిస్తోంద‌ని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు తీసుకున్న చర్యల వల్ల ఇవాళ కాపులు బీసీలా? ఓసీలా? అన్న పరిస్థితి తలెత్తిందని చెప్పుకొచ్చారు. కాపులను బీసీల్లో చేరుస్తూ 2017లో కేంద్రానికి ఒక బిల్లు పంపారు, తర్వాత ఇప్పుడు ఈబీపీల్లో కాపులకు 5శాతం రిజర్వేషన్లు ఇస్తూ మరొక టి పంపార‌ని సీఎం వివ‌రించారు.కులాల పరంగా విభజించే హక్కులేదని తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శ కాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఎలా ఇచ్చారంటూ జ‌గ‌న్ ప్ర‌శ్నించారు.

కేంద్రం అడిగినా..చంద్ర‌బాబు స్పందించ‌లేదు..

కేంద్రం అడిగినా..చంద్ర‌బాబు స్పందించ‌లేదు..

అసలు కాపులను బీసీల్లో చేరుస్తూ ఇంతకుముందు పంపిన బిల్లు పరిశీలనలో ఉంచదలుచుకున్నారా అంటూ కేంద్ర ప్ర‌శ్నించింద‌ని సీఎం వివ‌రించారు. ఇదే స‌మ‌యంలో దానికి కట్టుబడి ఉన్నారా.. లేక ఉసంహరించాలనుకుంటున్నా రా .. దీనిపై వెంటనే సమాధానం ఇవ్వాలని కేంద్రం కోరిందని ఆ లేఖ‌ను జ‌గ‌న్ కాపు నేత‌ల‌కు చూపించారు. కేంద్రం
ఏప్రిల్‌ 4, 2019 రాసిన లేఖకు చంద్రబాబు సమాధానం పంపలేదని జ‌గ‌న్ వివ‌రించారు. పేదరికం ప్రాతిపదికగా ఓసీల్లో పేదలకు ఈ 10శాతం రిజర్వేషన్లు ఇచ్చారుని.. దాంట్లో కులాన్ని ప్రాతిపదికగా తీసుకునే అవకాశమే లేదంటూ జ‌గ‌న్ స్ప‌ష్టం చేసారు. చంద్రబాబు కాపులను బీసీల్లో చేర్చడంపైనా, ఈబీసీల్లో ఇచ్చిన 5శాతం కోటాలపైన న్యాయస్థానాల్లో కేసులు ఉన్నాయ‌న్నారు. ఈ నేపథ్యంలో అడుగు ముందుకు వేస్తే, ఈ కోటా కింద సీట్లు, ఉద్యోగాలు పొందిన వారి పరిస్థితి ఏమవుతుందని ప్ర‌శ్నించారు. ఈబీసీ కోటాలో తానిచ్చిన కాపులకు తాను ఇచ్చిన 5శాతం రిజర్వేషన్లు వాస్తవమే అయితే ఈ ఏడాది వైద్య, పీజీ సీట్లలో చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని జ‌గ‌న్ వివ‌రించారు.

ముగ్గురు స‌భ్యుల‌తో క‌మిటీ ఏర్పాటు..

ముగ్గురు స‌భ్యుల‌తో క‌మిటీ ఏర్పాటు..

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో కూడా ఇదే పేర్కొన్నారు కదా అని జ‌గ‌న్ పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమైతే ఎవరు బాధ్యత వహిస్తారని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ఓసీల జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే.. అందులో కాపుల జనాభా యాభైశాతం కన్నా ఎక్కువే ఉంది కదా అంటూ జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.అలాంటప్పుడు దీన్ని 5శాతానికే కట్టడి చేస్తే.. వారికి అన్యాయం జరగదా అని సీఎం వ్యాఖ్యానించారు.ఈబీసీలకు కేంద్రం ఇచ్చిన కోటాలో 5శాతం రిజర్వేషన్లు ఇస్తాననడం ద్వారా.. ఇంతకుముందు బీసీల్లో చేర్చే అవకాశం ఉందన్న కాపులకు కల్పించిన ఆశలమీద కూడా చంద్ర బాబే నీళ్లు జల్లార‌ని జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. కాపుల రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ఎప్పుడూ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేసారు. ఇదే స‌మ‌యంలో ఈ అంశం అధ్య‌య‌నం కోసం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, మంత్రి కన్నబాబుతో ముఖ్య‌మంత్రి క‌మిటీ ఏర్పాటు చేసారు.

English summary
CM Jagan constituted Three men committee to study and for report on Kapu Reservations. Minister Kanna Babu, Ummareddy and Ambati Rambabu will be the members in this committee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X