కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా శ్రీనాధరెడ్డి: సీఎం జగన్ నిర్ణయం..!

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా దేవిరెడ్డి శ్రీనాధరెడ్డి నియమితులు కానున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మీడియా సంబంధిత వ్యవహారాల్లో తమ సొంత మీడియా గ్రూపులో పని చేసిన వారికి..అందునా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి పదవులు కట్టబెడుతున్నారనే విమర్శల నడుమ ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా ముఖ్యమంత్రి ఎంపిక చేసిన దేవిరెడ్డి శ్రీనాధరెడ్డి కడప జిల్లా పులివెందుల మండలం కోరుగుంటపల్లెకు చెందిన వారు. 28 ఏళ్లుగా ఆయన జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. వివిధ పత్రికల్లో పని చేసిన అనుభవం ఉంది. అదే విధంగా 2014 నుండి సాక్షి పొలిటికల్ సెల్ సలహాదారుడిగా పని చేసారు. దీంతో..ఇప్పుడు శ్రీనాధరెడ్డికి ఈ పదవి కట్టబెట్టాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు.

CM jagan decided to appoint Devireddy Srinath reddy as AP press academy chairman

ఉమ్మడి ఏపీలో ఆయన ఏపీడబ్ల్యూలో అనేక హోదాల్లో పని చేసారు. కడప జిల్లాకు చెందిన శ్రీనాధరెడ్డి జర్నలిస్టుగా పని చేస్తూనే రాయలసీమ హక్కుల కోసం పోరాడారు. వైయస్సార్ తో సహా మైసూరారెడ్డి.. జేసీ దివాకర రెడ్డి.. మైసూరా రెడ్డితో కలిసి పని చేసారు. రాష్ట్ర విభజన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీనియర్ జర్నలిస్టు వాసుదేవ దీక్షితులుకు ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా అవకాశం ఇచ్చారు. ఆయన ఆ తరువాత మరణించారు. ఇక, జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ పదవి కోసం పోటీ ఏర్పడింది.

ఇప్పటికే ముఖ్యమంత్రి మీడియా సలహాదారుడిగా పదవితో పాటుగా సీపీఆర్వో.. అదే విధంగా జాతీయ స్థాయిలో మీడియా రిలేషన్స్ బాధ్యతలు..ఇక పబ్లిక్ పాలసీ సలహాదారుడి హోదా వంటివి తమ సొంత మీడియా సంస్థలో పని చేసిన వారికి కట్టబెట్టారని పెద్ద ఎత్తు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో..దీనిని నియంత్రించేందుకు వెంటనే రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తికి ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రెస అకాడమీ ద్వారా జర్నలిస్టులకు సంబంధించిన అంశాల పైన ఎక్కువగా ఫోకస్ చేయనున్నారు.

English summary
CM jagan decided to appoint Devireddy Srinath reddy as AP press academy chairman. Srinath reddy from pulivendula and he worked for Rayalaseema rights along with YSR and local leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X