వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ స్పీక‌ర్‌గా త‌మ్మినేని సీతారాం: చ‌ంద్ర‌బాబుకు ధీటుగా: జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా..!

|
Google Oneindia TeluguNews

ఏపీ శాస‌న‌స‌భ నూత‌న స్పీక‌ర్ ఖ‌రారయ్యారు. ఉత్త‌రాంధ్ర‌కు చెందిన సీనియ‌ర్ బీసీ నేత‌కు స్పీక‌ర్ ప‌ద‌వి ఇవ్వాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. వైసీపీ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశం ముగిసిన త‌రువాత జ‌గ‌న్ ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. జ‌గ‌న్ త‌న ప్ర‌భుత్వంలో బీసీ-ఎస్సీ-ఎస్టీల‌కు ప్రాధాన్య‌త ఉంటుంద‌ని తొలి నుండి చెబుతూ వ‌స్తున్నారు. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన త‌మ్మినేని సీతారాం ఆరు సార్లు ఎమ్మెల్యేగా.. తొమ్మిదేళ్లు మంత్రిగా ప‌ని చేసిన అనుభ‌వం త‌మ్మినేనికి ఉంది. దీంతో..ఆయ‌న‌ను స్పీక‌ర్‌గా జ‌గ‌న్ ఖ‌రారు చేసారు.

స్పీక‌ర్‌గా త‌మ్మినేని సీతారాం..
ఉత్త‌రాంధ్ర నుండి సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్తానం క‌లిగిన నేత‌గా..గుర్తింపు ఉన్న బీసీ వ‌ర్గానికి చెందిన త‌మ్మినేని సీతారాం ఏపీ శాస‌న‌స‌భ నూత‌న స్పీక‌ర్‌గా నియ‌మితులు కానున్నారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. బీసీ వర్గానికి స్పీక‌ర్ ప‌ద‌వి ఇవ్వాల‌ని జ‌గ‌న్ భావించారు. సీతారాం క‌ళింగ క‌మ్యూనిటీకి చెందిన వారు. అయితే శ్రీకాకుళం జిల్లాకు ఆ ప‌ద‌వి ఇవ్వ‌టం ద్వారా ఉత్త‌రాంధ్ర‌లో సానుకూల‌త ఉంటుంద‌ని అంచ‌నా వేసారు.

Cm Jagan decided to give speaker post for BC leader from North coastal Tammineni Sitaram

దీంతో..1983 నుండి రాజ‌కీయాల్లో ఉండటంతో పాటుగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ హ‌యాంలో తొమ్మిదేళ్లు మంత్రిగా ప‌ని చేసారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు తో విభేదాలు రావ‌టంతో టీడీపీని వీడి ప్ర‌జారాజ్యంలో చేరారు. 2009లో ఆముదాలవ‌ల‌స నుండి ప్ర‌జారాజ్యం అభ్య‌ర్దిగా పోటీ చేసి ఓడిపోయారు 2014లో వైసీపీ నుండి పోటీ చేసి ఓడిన సీతారాం..తాజా ఎన్నిక‌ల్లో ఆయ‌న స‌మీప బంధువు.. టీడీపీ అభ్య‌ర్ది కూన ర‌వి కుమార్‌ను 14వేల ఓట్ల‌తో ఓడించారు.

చంద్ర‌బాబుకు ధీటుగా...
ఏపీ శాస‌న‌స‌భ‌లో ప్ర‌స్తుతం అధికార ప‌క్షం వైసీపీ బ‌లం 151 కాగా..ప్ర‌తిప‌క్ష టీడీపీ బ‌లం కేవ‌లం 23 స్థానాలు మాత్ర‌మే. అయితే, జ‌గ‌న్ స్పీక‌ర్‌గా త‌మ్మినేని ఎంపిక వెనుక అనేక వ్యూహాలు ఉన్నాయి. టీడీపీలో అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి..దాదాపు తొమ్మిదేళ్లుగా మంత్రిగా ప‌ని చేసిన సీతారాం..చంద్ర‌బాబు తో విబేధాల కార‌ణంగా పార్టీని వీడారు. ఆయ‌న వైసీపీలో చేరిన నాటి నుండి చంద్ర‌బాబు ల‌క్ష్యంగా అనేక ఆరోప‌ణ‌లు..విమ‌ర్శ‌లు గుప్పించారు.

గ‌తంలో అనేక శాఖ‌లు నిర్వ‌హించిన అనుభవంతో పాటుగా న్యాయ శాఖ నిర్వ‌హించటం ఇప్పుడు స్పీక‌ర్‌గా క‌లిసి వ‌చ్చింది. టీడీపీతో త‌మ్మినేని స‌మ‌ర్ధ‌వంతంగా వ్య‌వ‌హ‌రించ‌గ‌ల‌రే న‌మ్మ‌కంతో జ‌గ‌న్ ఆయ‌న వైపు మొగ్గు చూపారు. సౌమ్యుడిగా ఉండే త‌మ్మినేని రాజ‌కీయంగా అనేక ఒడిదుడికుల‌ను ఎదుర్కొన్నారు. ఇక‌, ఇప్పుడు ఉత్త‌రాంధ్ర‌కు స్పీక‌ర్ ప‌ద‌వి ఇవ్వ‌టంతో రాయ‌ల‌సీమ ప్రాం

English summary
AP Cm Jagan decided to give speaker post for BC leader from North coastal Tammineni Sitaram who was woked in TDP for two decades. In a strategical vies Jagan selected him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X