• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కరకట్ట ఇళ్లపైన జగన్ తేల్చేసారు: పేదల విషయంలో మాత్రం ఉదారంగా: ఆ బాధ్యత మనపై ఉంది..!

|

కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కరకట్ట..కాల్వగట్ల మీద నిర్మాణల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దీని పైన ముఖ్యమంత్రి తన విధానం స్పష్టం చేసారు. కృష్ణానది కట్టమీద, కరకట్టలోపల, కాల్వ గట్ల మీద ఉంటున్న వారికి ఇళ్ల నిర్మాణంపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన సీఎం జగన్..వారి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ, నదీ చట్టాలను పటిష్టంగా అమలుచేయడంతోపాటు వీటికారణంగా పేదలు, సామాన్యులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని స్పష్టం చేసారు. దీని ద్వారా ఖచ్చితంగా అక్కడ అక్రమ నిర్మాణాలను తొలిగించాలనే సంకేతాలను ముఖ్యమంత్రి ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. అక్కడ ఇళ్లు తొలిగించిన పేదలకు ఇప్పుడు ఇస్తున్న సెంటున్నర కాకుండా కనీసం 2 సెంట్ల విస్తీర్ణంలో వీరికి ఇళ్లు కట్టించి ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు.

నదీ చట్టాలను అమలు చేయాల్సిందే..

నదీ చట్టాలను అమలు చేయాల్సిందే..

మున్సిపల్..సీఆర్ఢీఏ అధికారులతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అందులో పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. కృష్ణానది కట్టమీద, కరకట్టలోపల, కాల్వ గట్ల మీద ఉంటున్న వారికి ఇళ్ల నిర్మాణంపై సూచనలు చేసారు. నదీ చట్టాలను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసారు. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండాల్సిదేనని తేల్చి చెప్పారు.

దీని ద్వారా కరకట్ట మీద అక్రమంగా నిర్మించిన భవనాల విషయంలో ముఖ్యమంత్రి పరోక్షంగా క్లియర్ ఆదేశాలు ఇచ్చినట్లు అర్దం అవుతోంది. అయితే పేదల విషయంలో మాత్రం జగన్ ఉదారంగా ఉండాలని సూచించారు. ఇళ్ల నిర్మాణం కింద ఇప్పుడు ఇస్తున్న సెంటున్నర కాకుండా వారికి కనీసం 2 సెంట్ల విస్తీర్ణంలో వీరికి ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఆదేశించారు. ఎక్కడో దూరంగా కాకుండా వారు కోరుకున్న ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం చేసి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణ, నదీ చట్టాలను పటిష్టంగా అమలుచేయడంతోపాటు వీటికారణంగా పేదలు, సామాన్యులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి. ఉగాది నాటికి పట్టాలు ఇవ్వడమే కాకుండా మంచి డిజైన్లలో వారికి ఉచితంగా ఇళ్లు కట్టి ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

 వదిలేస్తే సమస్య కొని తెచ్చుకున్నట్లే..

వదిలేస్తే సమస్య కొని తెచ్చుకున్నట్లే..

వర్షాకాలంలో ముంబై, చెన్నై లాంటి నగరాల్లో ఏం జరుగుతుందో మనం చూస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు. కొద్దిపాటి వర్షానికే ప్రజలు నరకయాతన పడుతున్నారన్నారు. అలాంటి పరిస్థితిని తెచ్చుకోకూడదని సూచించారు. వరదనీరు ప్రవహించే మార్గాల్లో నిర్మాణాల కారణంగా పరిస్థితులు దుర్భరంగా మారుతాయని విశ్లేషించారు. కాల్వలు, ప్రవాహాలకు అడ్డంగా నిర్మాణాలతో మనం సమస్యలను కొనితెచ్చుకున్నట్టేనని వ్యాఖ్యానించారు.

పైగా వాటికి చట్టబద్ధత ఉండదూ, ఎప్పటికీ పట్టా కూడా రాదు, చట్టాలు దీనికి అంగీకరించవని చెప్పుకొచ్చారు. అందుకే నదీపరీవాహక ప్రాంతాలకు భంగం కాకుండా.. చూడాల్సిన బాధ్యత మనపై ఉందని మంత్రులు..అధికారుకు స్పష్టం చేసారు. పేదలు, సామాన్యుల పట్ల ఉదారంగా వ్యవహిరించి, వారికి కావాల్సిన రీతిలో ఇళ్ల నిర్మాణం చేయండి, అవగాహన కలిగించండని సూచనలు చేస్తూనే..ఇవికాకుండా ప్రభుత్వ భూముల్లో సుదీర్ఘకాలం ఇళ్లుకట్టి ఉంటున్నవారికి పట్టాలు మంజూరుచేయాలని కూడా సీఎం ఆదేశించారు.

ఆదర్శ మున్సిపాల్టీలుగా తాడేపల్లి, మంగళగిరి..

ఆదర్శ మున్సిపాల్టీలుగా తాడేపల్లి, మంగళగిరి..

తాడేపల్లి, మంగళగిరి మోడల్‌ మున్సిపాల్టీలుగా తయారు చేయడంపై సమావేశంలో జరిగింది. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, తాగునీటి వసతి, రోడ్ల అభివృద్ధికోసం ప్రతిపాదనలపైనా..అదే విధంగా

స్తుతం ఉన్న వసతులు, పెంచాల్సిన సదుపాయాలపై చర్చ చేసారు. తాడేపల్లి, మంగళగిరిల్లో ఇళ్లులేని వారందరికీ ఇళ్లు ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

తాడేపల్లిలో కనీసం 15వేల ఇళ్లు ఇవ్వాలని సీఎం సూచించారు. కట్టే ఇళ్ల సముదాయాల వద్ద కనీస మౌలికసదుపాయాలకూ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని అధికారులకు సీఎం జగన్ స్పష్టం చేసారు. ఉగాది నాటికి అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీఎం నిర్ధేశించారు. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, రోడ్లు, కరెంటు, వీధిలైట్లు.. ఇలా కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని సీఎం సూచించారు. తాడేపల్లి మున్సిపాల్టీలో 100 పడకల ఆస్పత్రికి ప్రతిపాదనలు సిద్ధంచేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. మున్సిపాల్టీల్లో అవినీతి నివారణకు తీసుకోవాల్సిన చర్యల పైన అధికారులకు సూచనలు చేసారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP Cm Jagan directed muncipal and crda officials to main tain reserve conservation act and protect environment in capital area. Cm decided to up grade two muncipalities in capital area as model corporations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more