వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గత ప్రభుత్వానికీ ఇప్పటికీ తేడా కనిపించాల్సిందే: 60 రోజులే మీకు సమయం : సీఎం జగన్

|
Google Oneindia TeluguNews

ఏపీలో గత ప్రభుత్వానికి..ఇప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ తేడా కనిపించాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకూడదని ఆదేశించారు. అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తూనే..వచ్చే 60 రోజుల్లో ఖచ్చింగా మార్పు రావాలని నిర్దేశించారు. ఇసుక రవాణా చేస్తామంటూ ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జీకు ఎవరు ముందుకు వచ్చినా వారిని ఆ బాధ్యతను అప్పగించాలన్నారు. కిలోమీటర్‌కు రూ.4.90 ల చొప్పున ఎవరు ముందుకు వచ్చినా రవాణా కోసం వారి వాహనాలను ఎంపిక చేసుకోవాలని సీఎం సూచించారు. కానీ దీనిని అదునుగా తీసుకుని ఇసుక అక్రమ రవాణా జరగడానికి అవకాశం ఇవ్వద్దని స్పష్టం చేసారు.

జగన్.. తిరుగుబాటు పొంచి ఉంది: ఎమ్మెల్యేలతో జాగ్రత్త: ఉండవల్లి సంచలనం..!జగన్.. తిరుగుబాటు పొంచి ఉంది: ఎమ్మెల్యేలతో జాగ్రత్త: ఉండవల్లి సంచలనం..!

అధికారులకు సీఎం చురకలు..
ఏపీలో స్పందన కార్యక్రమం పైన ముఖ్యమంత్రి జగన్ వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. వరదలు తగ్గినా ఇసుక కొరత తగ్గటం లేదని జగన్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో మాదిరి వ్యవహరించే వారిని ఉపేక్షించవద్దని స్పష్టం చేసారు. ఇదే సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. అధికారులకు గత ప్రభుత్వం కంటే మార్పు తెచ్చే బాధ్యత అప్పగిస్తున్నానని..అదే సమయంలో స్వేచ్ఛ ఇస్తున్నానని చెప్పుకొచ్చారు. 60 రోజుల సమయంలో ఖచ్చితంగా ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని నిర్దేశించారు.

CM Jagan Directed officials to take all steps for improve sand supply

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాల గురించి ఆరా తీసారు. ఆటో..క్యాబ్ డ్రైవర్లకు అందిస్తున్న సాయం ఈ నెల 4న ఏలూరులో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెలాఖరులోగా గ్రామ సచివాలయాలకు మౌళిక వసతులు పూర్తగా అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ నెల 15 తరువాత వాలంటీర్లు ఖాళీగా ఉన్న చోట్ల నియామకం పూర్తి చేయాలని స్పష్టం చేసారు.

రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్‌లను ఓపెన్‌ చేయండి.
ఇసుక రీచ్ లు ఓపెన్ చేయాలని జగన్ ఆదేవించారు. జిల్లాలో ఇసుక సరఫరా, రవాణా బాధ్యతలను జేసీ స్థాయి అధికారికి అప్పగించాలని... ఆ అధికారి కేవలం ఇసుక సరఫరా, రవాణాలను మాత్రమే చూడాలని నిర్దేశించారు. వరదలు తగ్గాయి, ఇసుక లభ్యత ఉంది.. తక్కువ రేట్లకు అందించాలని ఆదేశించారు. వచ్చే 60 రోజుల్లో కచ్చితంగా మార్పు రావాలన్నారు. ప్రతి జిల్లాలోని 2 వేలమంది నిరుద్యోగులైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన యువకులు ఆయా కార్పొరేషన్ల ద్వారా, కాపు కార్పొరేషన్‌ కలుపుకుని వాహనాలు కొనుగోలు చేసేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. వారికి ఇసుక రవాణా కాంట్రాక్టు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

దీనిపై మార్గదర్శకాలు తయారు చేయాలని... ఇదే సమయంలో ఇసుక అక్రమ రవాణా జరక్కుండా చూడాలని స్పష్టం చేసారు. కలెక్టర్లు, ఎస్పీలు దీనిపై దృష్టిపెట్టాలన్నారు. రాజకీయ జోక్యాన్ని ఎక్కడా కూడా అనునమతించరాదని గట్టిగా చెప్పారు. ఇసుక మాఫియా ఎట్టి పరిస్థితుల్లోనూ కనిపించకూడదని..మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు ఇసుక సరఫరా ఉండకూడదని స్పష్టం చేసారు. చెక్‌పోస్టుల్లో గట్టి నిఘాను పెంచాలని సీఎం జగన్ ఆదేశించారు.

English summary
CM Jagan Directed officials to take all steps for improve sand supply. CM says giving total freedom to control political interference in this issue at all stages. CM fixed 60 days time for officers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X