వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయనను ఫాలో అవ్వండి: ఆ ఇద్దరూ డిసైడ్ చేస్తారు: పార్టీ ఎంపీలకు సీఎం జగన్ ఆదేశం..!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ సొంత పార్టీ ఎంపీలకు కీలక సూచనలు చేసారు. ఎంపీలు వ్యక్తిగత అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని.. టీవీ చర్చల్లో పాల్గొనే ముందు పార్టీ వైఖరి ఏంటనేది స్పష్టత తీసుకొని మాట్లాడా లని సూచించారు. కొందరు ఎంపీలు పార్టీకి సమాచారం లేకుండానే ప్రధాని..కేంద్ర మంత్రుల వద్దకు వెళ్తున్నట్లు తెలిసందని..ఇది సరి కాదంటూ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ లో పార్టీ లీడర్లుగా ఉన్న వారిని సంప్రదించి వారి మార్గదర్శకంలోనూ ముందుకు నడవాలని స్పష్టం చేసారు. అదే సమయంలో ప్రతిపక్షాలు ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నారని..వాటిని తిప్పి కొట్టాలని సీఎం సూచించారు. ఇక, పోలవరం..రెవిన్యూ లోటు అంశాల్లో కేంద్రం పైన ఒత్తిడి తేవాలని..లోక్ సభలో నాలుగో అతి పెద్ద పార్టీగా వైసీపీ ఆ స్థాయికి తగినట్లుగా వ్యవహరించాల్సిన బాధ్యత ఎంపీలపైనే ఉందన్నారు. ఎవరైనా..సొంత నిర్ణయాలతో వ్యవహరించే ప్రయత్నం చేయవద్దని సీఎం ఒకింత గట్టిగా చెప్పినట్లుగా సమాచారం.

జగన్ పై ఢిల్లీ అభిప్రాయం ఇదీ: ఢిల్లీలో బాణం ఎక్కుపెట్టిన జనసేనాని పవన్జగన్ పై ఢిల్లీ అభిప్రాయం ఇదీ: ఢిల్లీలో బాణం ఎక్కుపెట్టిన జనసేనాని పవన్

సాయిరెడ్డి మార్గదర్శకంలో నడవాలి..

సాయిరెడ్డి మార్గదర్శకంలో నడవాలి..

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న సమయంలో పార్టీ ఎంపీలతో ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఢిల్లీలో కొందరు ఎంపీలు వ్యక్తిగతంగా కేంద్ర మంత్రులను కలవటం..ప్రధాని అప్పాయింట్ మెంట్ లను కోరటం పైన చర్చకు వచ్చినట్లు సమాచారం. దీని పైన ముఖ్యమంత్రి ఎవరైనా ప్రధాని వద్దకు..కేంద్ర మంత్రికి వెళ్లాలంటే కలిసి ఒకే అభిప్రాయంతో వెళ్లాలని సూచించారు. ప్రధానిని కలిసే సమయంలో పార్టీ..రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి, ఎంపీ మి థున్‌ రెడ్డిలను సంప్రదించి..వారి సూచనల మేరకు నడుచుకోవాలని స్పష్టం చేసినట్లు సమాచారం. వారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకున్నాకే కేంద్ర మంత్రులను.. ప్రధానిని కలవాలని సీఎం నిర్ధేశించినట్లు తెలుస్తోంది.

చర్చల్లో వ్యక్తిగత అభిప్రాయాలు సరికాదు..

చర్చల్లో వ్యక్తిగత అభిప్రాయాలు సరికాదు..

కొందరు ఎంపీలు పార్టీ ప్రతినిధులుగా టీవీ చర్చల్లో పాల్గొని..వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చేస్తన్నట్లు తెలిసిందని..ఇది సరి కాదని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. చర్చల్లో పాల్గొనే వారు ఖచ్చితంగా పార్టీ వాయిస్ ను మాత్రమే స్పష్టం చేయాలని నిర్దేశించారు. ఢిల్లీలో సైతం ఎంపీలు విజయ సాయిరెడ్డి లేకుండా ప్రధాని..కేంద్ర మంత్రులను కలవద్దని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో రాష్ట్ర సమస్యల మీద ఎంపీలందరూ పూర్తి అవగాహనతో ఉండాలని స్పష్టం చేసారు. పార్లమెంట్ లో రాష్ట్రం కోసం ప్రస్తావించాల్సిన అంశాల పైన ఎంపీలు టీంలుగా డిసైడ్ చేసుకొని.. చర్చలకు సిద్దం కావాలని సూచించారు. ఎంపీలంతా వ్యక్తిగత అంశాల కంటే..పార్టీ..రాష్ట్ర అంశాల పైనే ఎక్కువగా సమయం కేటాయించాలని ఆదేశించారు.

పోలవరం నిధుల కోసం..పోరాడండి..

పోలవరం నిధుల కోసం..పోరాడండి..

పోలవరంపై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.11,800 కోట్లు ఖర్చు చేయగా కేంద్రం రూ 8,577 కోట్లు విడుదల చేసిందని, గత వారం రూ 1,850 కోట్లు ఇచ్చిందని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రం చేసిన ఖర్చులో ఇంకా రూ.3,222 కోట్లు రావాల్సి ఉందన్నారు. సవరించిన అంచనాల ప్రకారం రూ.55,549.87 కోట్లకు ఆమోదం తెలపాల్సి ఉందని చెప్పారు. ప్రాజెక్టు పనులు సరైన ప్రణాళిక లేకుండా చేయడంతో నాలుగు నెలలుగా చేపట్టలేకపోయామన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని తాను ప్రధాని..హోం మంత్రికి వివరించానని..మరోసారి కేంద్రంతో సంప్రదింపులు చేసి ఆ నిధులు విడుదయ్యేలాగా చూడాలని ఆదేశించారు. ఇక,
విభజన నాటికి కాగ్‌ లెక్కల ప్రకారం రూ 22,948.76 కోట్ల ఆర్థిక లోటు ఉన్నట్లు తేలగా ఇప్పటివరకూ రూ 3,979 కోట్లు ఇచ్చారని మిగిలిన రూ 18,969 కోట్ల విడుదల కోసం కృషి చేయాలన్నారు.

English summary
Cm Jagan directed party Mp's to follow Vijaya Sai Reddy direction in Delhi while meet central ministers. All MP's to be fight for implement central assurances to wards AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X