3.70 లక్షల మంది రూ. 264 కోట్లు: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం: సీఎం జగన్ హామీ..!

పాదయాత్రలో ఇచ్చిన హామీకి అనుగుణంగా అగ్రి గోల్డ్ బాధితులకు తొలి సాయం అందిస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు. తొలి విడతలో భాగంగ దాదాపుగా 3.70లక్షల మంది బాధితులకు న్యాయం చేస్తున్నాం. రూ. 10వేలలోపు డిపాజిట్లు ఉన్న బాధితులను ఆదుకునేందుకు రూ. 264 కోట్లు విడుదల చేశాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్‌లోనే అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు కేటాయింపులు చేశాం... ఐదు నెలల్లోపే బాధితులకు న్యాయం చేయగలుగుతున్నందుకు ఆనందంగా ఉందని చెబుతూ భవిష్యత్తులో మరింత మందికి న్యాయం చేస్తాం. త్వరలోనే రూ. 20వేలలోపు డిపాజిట్‌ చేసినవారికి డబ్బులు అందజేస్తామని జగన్ ప్రకటించారు.

గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది..

గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది..

గత ప్రభుత్వ హయాంలో హయాంలో అగ్రిగోల్డ్‌ స్కామ్‌ జరిగిన బాధితులకు న్యాయం జరగలేదని గుర్తుచేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అగ్రిగోల్డ్‌ బాధితుల తరఫున పోరాటం చేశామని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి అండగా నిలబడుతున్నామని సీఎం జగన్ చెప్పారు. ఈ ఐదు నెలల్లోనే నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా లక్ష 30వేల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చామని... 2.25 లక్షల మంది ఆటో కార్మికులకు.. వైఎస్సార్‌ వాహన మిత్ర అందించామని చెప్పుకొచ్చారు.

13,500కు పెంచామని

13,500కు పెంచామని

పాదయాత్రలో చెప్పిన విధంగా ప్రతి రైతన్నకు రైతు భరోసా అందించామని... అప్పుడు రూ. 12,500 రైతులకు ఇస్తామని చెప్పిన.. దానిని రూ. 13,500కు పెంచామని వివరించారు. అదే విధంగా పెన్షన్‌ల కోసం రూ. 1350 కోట్లు మంజూరు చేశామన్నారు. గత ప్రభుత్వం కంటే మూడు రెట్లు అధికంగా పించన్‌ ఇస్తున్నాం. 65 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా కంటి వెలుగు అందిస్తున్నాం. 4.5 లక్షల మంది విద్యార్థులక శస్త్ర చికిత్సల చేయించడం, కంటి అద్దాలు అందిస్తున్నామన్నారు.

స్థానికులకు 75 శాతం రిజర్వేషన్..

ప్రైవేటు రంగంలో నిరుద్యోగ యువతకు మేలు జరగాలని.. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ చట్టం తీసుకొచ్చామని చెప్పారు. ఏడాదికి రూ. 10 వేలు ఇస్తూ ఆటో కార్మికులను ఆదుకుంటున్నామని..మొట్టమొదటిసారిగా జూడిషియల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశామంటూ ముఖ్యమంత్రి వివరించారు. దేశంలో ఎవరు చేయని విధంగా రివర్స్‌ టెండరింగ్‌ తీసుకొచ్చామని... పోలవరంలో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ. 800 కోట్లు ఆదా చేసామన్నారు. అవినీత రహితంగా, పారదర్శకంగ పాలన కొసాగిస్తున్నాం.

50 శాతం రిజర్వేషన్లు

50 శాతం రిజర్వేషన్లు

ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు నామినేటేడ్‌ పదవుల్లో, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. ఇప్పటివరకు తమ పేరు నమోదు చేసుకోని అర్హులైన అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు సీఎం వైఎస్‌ జగన్‌ మరో అవకాశం కల్పించారు. అలాంటి వారు.. నెల రోజుల్లోగా జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సంస్థ ద్వారా దరఖాస్తు చేసుకోవచ‍్చని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. కలెక్టరేట్‌, ఎమ్మార్వో, గ్రామ సచివాలయాల్లో కూడా నమోదు చేసుకోవచ‍్చని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+