వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ భావోద్వేగం...ఎమ్మెల్యేల‌ క‌న్నీరు: ఏ ఒక్క‌రినీ వ‌దులుకోను: అవ‌న్నీ..చేదు జ్ఞాప‌కాలు..!

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌రువాత జ‌గ‌న్ తొలి సారి పార్టీ ఎమ్మెల్యేల‌తో స‌మావేశ‌మ‌య్యారు. త‌న పాల‌నా ప్రాధాన్య‌త‌లు..త‌న ల‌క్ష్యాల‌ను వివ‌రిస్తూనే..త‌న రాజకీయ జీవితంలో ఎదురైన చేదు జ్క్షాప‌కాల‌ను గుర్తు చేసుకున్నారు. అదే స‌మ‌యంలో తాను క‌ష్ట‌కాలంలో ఉన్న‌ప్పుడు అండ‌గా ఉన్నారంటూ భావోద్వేగానికి గుర‌య్యారు. జ‌గ‌న్ ప్ర‌సంగం వింటూనే..ఆయన భావోద్వేగానికి గుర‌వ్వటం చూసి రోజా..బొత్సా తో స‌హా మ‌రికొంద‌రు క‌న్నీరు కార్చారు. త‌న‌ను న‌మ్ముకున్న ఏ ఒక్క‌రికీ అన్యాయం చేయ‌న‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యేల‌కు దిశా నిర్ధేశం..

ఎమ్మెల్యేల‌కు దిశా నిర్ధేశం..

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ త‌న పార్టీ ఎమ్మెల్యేల‌కు దిశా నిర్ధేశం చేసారు. ఎమ్మెల్యేలు ఏ ర‌కంగా వ్య‌వ‌హ‌రించాలో ఏ ర‌కంగా ముందుకు వెళ్లాలో సూచించారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌తో స‌హా..2024 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా ప‌ని చేయాల‌ని స్ప‌ష్టం చేసారు. తొలి విడ‌త‌ల‌లో 25 మందితో కేబినెట్ ఏర్పాటు చేస్తున్నాన‌ని..రెండున్నార సంవ‌త్స‌రాల్లో మ‌రో 20 మందికి అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌తీ సామాజిక వ‌ర్గానికి గుర్తింపు ఇచ్చేలా పాల‌న చేద్దామ‌ని తెలిపారు. ఇదే స‌మ‌యంలో..జ‌గ‌న్ త‌న పాల‌న గురించి ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేక‌రించారు. పూర్తి అవినీతి ర‌హిత‌..పాద‌ర్శ‌క పాల‌న తీసుకొస్తామ‌ని స్ప‌ష్టం చేసారు. అయిదుగురు ఉప ముఖ్య‌మంత్రుల ప్ర‌క‌ట‌న చేయ‌గానే స‌భ్యులంగా క‌ర‌తాళ ధ్వ‌నుల‌తో హ‌ర్షం వ్యక్తం చేసారు. దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా పాల‌న ఉంటుంద‌ని జ‌గ‌న్ భ‌రోసా ఇచ్చారు.

ఎవ‌రినీ వ‌దులుకోను..జ‌గ‌న్ భావోద్వేగం..

ఎవ‌రినీ వ‌దులుకోను..జ‌గ‌న్ భావోద్వేగం..

జ‌గ‌న్ ఇక రాజ‌కీయ అంశాల పైనా మాట్లాడారు. కేబినెట్ సంఖ్య త‌క్కువ‌గా ఉండి..ఆశావాహుల సంఖ్య ఎక్కువ‌గా ఉంద‌ని చెప్పుకొచ్చారు. అన్ని సమీక‌ర‌ణాల‌ను దృష్టిలో ఉంచుకొని నిర్ణ‌యాలు ఉంటాయ‌న్నారు. తాను హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిని కలిసి జుడిషియ‌ల్ క‌మిష‌న్ ఏర్పాటు చేయాల‌ని కోరాన‌ని వివ‌రించారు. తాను తొమ్మ‌దేళ్ల కాలంలో ఎన్నో క‌ష్టాలు ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌ని..నాకు తోడుగా నిలిచిన ప్ర‌తీ ఒక్క‌రికి మేలు చేస్తానంటూ జ‌గ‌న్ భావోద్వేగానికి గుర‌య్యారు. జ‌గ‌న్ ప్ర‌సంగం వింటూ..ఆయ‌న భావోద్వేగానికి గురైన స‌మ‌యంలో..రోజా, బొత్సా తో స‌హా ప‌లువురు సీనియ‌ర్లు సైతం కంట త‌డి పెట్టారు.

ఎవ‌రినీ వ‌దులుకోను..జ‌గ‌న్ భావోద్వేగం..

ఎవ‌రినీ వ‌దులుకోను..జ‌గ‌న్ భావోద్వేగం..

ప్ర‌తీ ఒక్క‌రు పార్టీనీ..ప్ర‌భుత్వాన్ని రెండు క‌ళ్లుగా చూడాల‌ని జ‌గ‌న్ సూచించారు. పార్టీ ఉంటేనే ప్ర‌భుత్వం ఉంటుంద‌ని .. ప్ర‌భుత్వం నిల‌బెట్టుకుంటేనే పార్టీకి ఆద‌ర‌ణ ఉంటుంద‌ని జ‌గ‌న్ విశ్లేషించారు. పాల‌న‌లో కొత్త‌గా రీ టెండ‌రింగ్ విధానం అమ‌లు చేస్తామ‌ని..ప్ర‌తీ టెండ‌ర్‌కు సంబంధించి కాంట్రాక్ట్ వివ‌రాలు ఆన్‌లైన్ ద్వారా ప‌బ్లిక్ డొమైన్‌లో వారం రోజుల పాటు ఉంచుతామ‌ని స్ప‌ష్టం చేసారు. పూర్తిగా ఉద్విగ్న పూరిత వాతావ‌ర‌ణంలో జ‌గ‌న్ ప్ర‌సంగం సాగింది.

English summary
AP Cm jagan emotional in party legislature meeting in amaravati. Jagan remembered his previous struggles in his entry in politics. He assured Mla's that he will take care of all party workers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X