వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

13 జిల్లాలకు వైసీపీ జెడ్పీ ఛైర్మన్లు వీరే-నేడే అధికారికంగా ఎన్నిక :ప్రతీ జిల్లాకు ఇద్దరు ఉపాధ్యక్షులు-ఖరారు..!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీలో 13 జిల్లా జెడ్పీ ఛైర్మన్ల ఈ రోజు జరగనుంది. 13 జిల్లాల్లోనూ వైసీపీ జెడ్పీ ఛైర్మన్లే కొలువు తీరనున్నారు. ఇప్పటికే 13 జిల్లాలకు సంబంధించి ఛైర్మన్లను ఖరారు చేసిన వైసీపీ..ఆ మేరు భీ ఫారాలు పంపింది. ఈ రోజు జిరగే ఎన్నికలకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారులుగా వ్యవహరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 660 జెడ్పీటీసీ స్థానాలకు గాను 640 స్థానాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. కొత్తగా ఎన్నికైన సభ్యులు చేతులు ఎత్తే విధానంలో ఆయా జిల్లాల జెడ్పీ చైర్మన్లను ఎన్నుకోనున్నారు. అన్ని జిల్లాల్లో నేటి ఉదయం 10 గంటలకే ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతుంది.

13 జిల్లాలకు వైసీపీ భీ-ఫారంలు

13 జిల్లాలకు వైసీపీ భీ-ఫారంలు

మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రిసైడింగ్‌ అధికారి.. కొత్తగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం ఒక్కో జిల్లాలో ఇద్దరు కో ఆప్టెడ్‌ సభ్యుల ఎన్నిక, మధ్యాహ్నం 3 గంటలకు జెడ్పీ చైర్మన్, జిల్లాకు ఇద్దరు చొప్పున వైస్‌ చైర్మన్ల ఎన్నికను నిర్వహించనున్నారు. జిల్లా రిజర్వేషన్లకు అనుగుణంగా వైసీపీ కొత్త జెడ్పీ ఛైర్మన్లను ఎంపిక చేసింది. వీరితో పాటుగా ప్రతీ జిల్లాకు ఇద్దరు ఉపాధ్యక్షులు ఉండనున్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ రిజర్వేషన్ ఆధరంగా..ఇతరులకు ఆ రెండు పోస్టులు ఖరారు చేస్తూ ఆ జాబితాను వైసీపీ అధినాయకత్వం జిల్లాలకు పంపింది.

ప్రతీ జిల్లాలో ఇద్దరు డిప్యూటీ ఛైర్మన్లు

ప్రతీ జిల్లాలో ఇద్దరు డిప్యూటీ ఛైర్మన్లు

ఛైర్మన్ తో పాటుగా వైస్ ఛైర్మన్ ను జెడ్పీటీసీలు పరోక్ష పద్దతిలో ఎన్నుకుంటారు. జిల్లా పరిషత్ లలో ఇద్దరు కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక పూర్తవుతూనే ఛైర్మన్ -వైస్ ఛైర్మన్ ఎన్నిక ప్రారంభం అవుతుంది. ఇద్దరు వైస్ ఛైర్మన్ల ఎంపిక కోసం పంచాయితీ రాజ్ చట్టం సవరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసారు. అదే విధంగా మండల పరిషత్ లోనూ ఇద్దరు వైస్ ఛైర్మన్లకు అవకాశం ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచనగా ఉంది. త్వరలోనే దీనికి సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం ఉంది. ఇక, జిల్లా పరిషత్ ఛైర్మన్లను సీఎం జగన్ అధికారికంగా ఆమోదించారు.

13 జిల్లాల జెడ్పీ ఛైర్మన్లు వీరే

13 జిల్లాల జెడ్పీ ఛైర్మన్లు వీరే

విజయనగరం - మజ్జి శ్రీనివాస రావు, శ్రీకాకుళం - పిరియా విజయ, విశాఖ- అరబీరు సుభద్ర, తూర్పు గోదావరి -విప్పర్తి వేణు గోపాల రావు, పశ్చిమ గోదావరి - కవురి శ్రీనివాస్, క్రిష్ణా- ఉప్పాళ్ల హారిక, గుంటూరు - కత్తెర హెనిక్రిస్టినా, ప్రకాశం- బూచేపల్లి వెంకాయమ్మ, నెల్లూరు - ఆనం అరుణ, కర్నూలు - మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, అనంతపురం - గిరిజ, కడప -ఆకేపాటి అమర్నాధరెడ్డి, చిత్తూరు - శ్రీనివాసులు నూతన జెడ్పీ ఛైర్మన్లుగా ఎన్నిక కానున్నారు. ఇక, దీని ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసినట్లే.

Recommended Video

భారత్ బంద్ కు పిలుపెనిచ్చిన కాంగ్రెస్ పై మండిపడ్డ బీజేపి నేత పొంగులేటి!! || Oneindia Telugu
స్థానిక సంస్థలు అన్నింటా వైసీపీ జెండా

స్థానిక సంస్థలు అన్నింటా వైసీపీ జెండా

అన్ని జిల్లాల్లోని జెడ్పీలు - కార్పోరేషన్లు - ఒక్కటి మినహా మిగిలిన మున్సిపాల్టీల్లో అన్నింటా వైసీపీ నేతలే ఛైర్మన్లుగా ఉన్నారు. స్థానికంగా పార్టీ బలోపేతం కోసం ఇది మేలు చేస్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఇది మరింతగా ఉపయోగపడుతుందనేది పార్టీ నేతల వాదన. అయితే, ఎంపీపీ ఎన్నికల వేళ కొన్ని ప్రాంతాల్లో పార్టీ డిసైడ్ చేసిన అభ్యర్జుల విషయంలో రగడ చోటు చేసుకుంది. దీంతో, జెడ్పీ ఛైర్మన్ల విషయంలో మాత్రం అటువంటి వాటికి ఆస్కారం ఇవ్వద్దంటూ పార్టీ అధినాయకత్వం జిల్లా బాధ్యులను ఆదేశించింది. ఈ సాయంత్రానికి ఈ ఎన్నిక ప్రక్రియ అన్ని జిల్లాల్లోనూ పూర్తి కానుంది.

English summary
ZP Chairmen election will be held to day in all districts. All Chairmen will be from YSRCP. As per reservations party decided chairmen candidates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X