వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మండలిలో జ‌గ‌న్..లోకేశ్..తొలిసారిగా : ప‌్ర‌తిప‌క్షనేత‌ల వ‌ద్దకు వెళ్లి: అక్క‌డేం జ‌రిగింది...!

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌రువాత తొలి సారి జ‌గ‌న్ శాస‌న‌మండ‌లికి వెళ్లారు. శాస‌న‌స‌భ‌లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాల తీర్మానం పైన చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో టీ బ్రేక్ ఇచ్చారు. దీంతో..జ‌గ‌న్ అప్ప‌టికే ప్రారంభ‌మైన మండ‌లికి వెళ్లారు. తొలి సారిగా మండ‌లిలో సీఎం హోదాలో ప్ర‌వేశించిన జ‌గ‌న్‌కు అక్క‌డ ఉన్న మంత్రుల‌తో స‌హా స‌భ్యులంద‌రికీ జ‌గ‌న్ అభివాదం చేసారు. ప్ర‌తిప‌క్ష స‌భ్యుల బెంల్‌ల వ‌ద్ద‌కు వెళ్లి మ‌రీ వారిని ప‌ల‌క‌రించారు. అదే స‌మ‌యంలో మండ‌లి స‌భ్యుడిగా ఉన్న లోకేశ్ సైతం అక్కడే ఉన్నారు.

మండ‌లిలో సీఎంగా తొలిసారి..
ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తొలిసారి శాస‌న‌మండ‌లిలోకి వ‌చ్చారు. శాస‌న‌స‌భ విరామ స‌మ‌యంలో సీఎం మండ‌లికి వెళ్లారు. ఆ స‌మ‌యంలో టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర‌ప్ర‌సాద్ ఏపీకీ ప్ర‌త్యేక హోదా పైన మాట్లాడుతున్నారు. ఇదే స‌మ‌యంలో మండ‌లిలో అడుగు పెట్టిన సీఎం జ‌గ‌న్ అంద‌రికీ అభివాదం చేసుకుంటూ స‌భ్యుల వ‌ద్ద‌కు వెళ్లారు. శాస‌న‌స‌భ‌లో స‌భ్యుడిగా ప్ర‌మాణం చేసిన త‌రువాత సాధార‌ణంగా ప్ర‌తిపక్ష నేత వ‌ద్ద‌కు వెళ్లి క‌ర‌చాల‌నం చేయటం సాధార‌ణం.

CM Jagan First time entered in Legilsative council as CM. All members in council given grand welcome

అయితే, శాస‌న‌స‌భ‌లో ప్ర‌తిపక్ష నేత వ‌ద్ద‌కు వెళ్ల‌ని సీఎం..ఇప్పుడు మండ‌లిలో మాత్రం త‌న పార్టీకి చెందిన వారితో పాటుగా అన్ని పార్టీల వారికి అభివాదం చేసారు. నేరుగా మండ‌లిలో ప్ర‌తిప‌క్షనేత‌గా ఉన్న య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు తో పాటుగా టీడీపీ స‌భ్యులు సైతం లేచి నిల‌బ‌డి సీఎంకు అభివాదం చేసారు. మండ‌లిలో టీడీపీ ఉప నేత డొక్కా మాణిక్య వర ప్ర‌సాద్ జ‌గ‌న్ వ‌ద్ద‌కు వ‌చ్చి క‌ర‌చాల‌నం చేసారు. అభినంద‌న‌లు తెలిపారు.

జ‌గ‌న్‌..లోకేశ్ ఫేస్ టు ఫేస్..
గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో లోకేశ్ మండ‌లి స‌భ్యుడిగా వ్య‌వ‌హ‌రించారు. ఆయ‌న మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన స‌మ‌యం నుండి వైసీపీ శాస‌న‌స‌భా సమావేశాల‌ను బ‌హిష్క‌రించింది. దీంతో..వారిద్ద‌రూ స‌భ‌లో ఎద‌రుప‌డ‌లేదు. మంత్రిగా స‌భ‌లో లోకేశ్‌ను చూడ‌లేదు. ఇక‌, ఇప్పుడు ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ను మాత్ర లోకేశ్ చూడ‌క తప్ప‌లేదు.

జ‌గ‌న్ శాస‌న‌మండ‌లిలో ప్ర‌తిప‌క్ష స‌భ్యుల వ‌ద్ద‌కు వ‌చ్చే స‌మ‌యంలో అందరి దృష్టి లోకేశ్ వైపుకు మ‌ళ్లింది. మూడో వ‌రుస‌లో లోకేశ్ ఉన్నారు. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి హోదాలో రాగానే ఆయ‌న అంద‌రితో పాటుగా లోకేశ్ సైతం నిల‌బ‌డి అభివాదం చేసారు. జ‌గ‌న్ తిరిగి వెళ్లే స‌మ‌యంలోనూ లోకేశ్ వైపు ఆస‌క్తిగా గ‌మ‌నించారు. అయితే, లోకేశ్ మాత్రం అలాగే నిల‌బ‌డి ఉన్నారు. టీడీపీ స‌భ్యుడు డొక్కా మాణిక్య వ‌ర ప్ర‌సాద్ ప్ర‌త్యేక హోదా కోసం నీతి అయోగ్ స‌మావేశం లో ధైర్యంగా మాట్లాడార‌ని..ఆయ‌న రావాలి జ‌గ‌న్‌..కావాలి జ‌గ‌న్ అనే నినాదం స్పూర్తితో రావాలి హోదా..కావాలి హోదా అనే ల‌క్ష్యంతో ప‌ని చేయాల‌ని సూచించారు.

English summary
AP CM Jagan First time entered in Legilsative council as CM. All members in council given grand welcome for him IN house Jagan and Lokesh became center of attraction.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X