అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయ‌స్ చేయ‌లేనిది..జ‌గ‌న్ చేయ‌గ‌ల‌రా: అదేనా చంద్ర‌బాబు ధైర్యం..కానీ : దెబ్బ‌కు దెబ్బ తీయాల్సిందేనా..

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ల‌క్ష్యం ఏంటి. చంద్రబాబు విష‌యంలో ఆయ‌న ఏం చేయ‌బోతున్నారు. ఢిల్లీ లీడ‌ర్స్ ఆ విష‌యంలో ఎటువంటి ఆలోచ‌న‌తో ఉన్నారు. నాడు వైయ‌స్ సైతం ఇదే ర‌కంగా చంద్ర‌బాబును వెంటాడారు. కానీ అనుకున్న‌ది సాధించ‌లేదు. మ‌రి..ఇప్పుడు జ‌గ‌న్ మాత్రం చేయ‌గ‌ల‌రా. ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న నాటి నుండి జ‌గ‌న్ నాటి ప్ర‌భుత్వ అవినీతిని ల‌క్ష్యంగా చేసుకున్నారు. పాద‌యాత్ర‌..ఎన్నిక‌ల స‌భ ప్ర‌తీ చోటా చంద్ర‌బాబు అవీనీతినే ప్ర‌ధానం గా ప్ర‌స్తావించారు. ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అదే ప్ర‌ధాన అంశంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మ‌రి..జ‌గ‌న్ అమలు చేస్తున్న వ్యూహం స‌రైన‌దేనా..రాజ‌కీయంగా సీఎంకు అది మేలు చేస్తుందా..

Recommended Video

చంద్రబాబు భద్రతను తగ్గిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ
వైయ‌స్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో..

వైయ‌స్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో..

ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న స‌మ‌యం నుండి జ‌గ‌న్ ల‌క్ష్యం ఒక్క‌టే. త‌న మీద అక్ర‌మంగా కేసులు న‌మోదు చేసి..త‌న‌ను అవీనీతి ప‌రుడుగా ముద్ర వేసి..16 నెల‌లు జైల్లో ఉండ‌టానికి చంద్ర‌బాబు సైతం ఒక కార‌ణం. అటువంటి చంద్ర‌బాబు మీద దాదాపు తొమ్మిదేళ్లు అనేక క‌ష్టాల మ‌ధ్య రాజ‌కీయంగా పోరాటం చేసి ఎట్ట‌కేల‌కు ముఖ్య‌మంత్రి అయ్యారు. త‌న తండ్రికి ఇదే చంద్ర‌బాబు..కాంగ్రెస్ నేత‌ల రాజ‌కీయాన్ని ఎదుర్కొని ముఖ్య‌మంత్రి అవ్వ‌టానికి 25 ఏళ్లు ప‌డితే.. జ‌గ‌న్ కు 9ఏళ్ల స‌మ‌యం ప‌ట్టింది. అయితే, స‌మైక్య రాష్ట్రంలో చంద్రబాబు అవినీతి పాల్ప‌డ్డార‌ని నాటి వైయ‌స్ ప్ర‌భుత్వం దానిని వెలికి తీసేందుకు అనేక క‌మిటీలు ఏర్పాటు చేసింది. అందులో స‌భా సంఘాలు 14, నాలుగు అంశాల్లో న్యాయ విచార‌ణ‌, మూడు మంత్రివ‌ర్గ ఉప సంఘాలు, నాలుగు అంశాల్లో న‌లుగురు సీనియ‌ర్ ఐఏయ‌స్ అధికారులు, కోన‌సీమ విద్యుత్ ప్రాజెక్టులో అవినీతి పైన సీబీసీఐడి విచార‌ణ‌కు అదేశించారు. కానీ, ఏ ఒక్క‌టి చంద్ర‌బాబు మీద అవినీతిని రుజువు చేయ‌లేదు.

చంద్ర‌బాబు ధైర్యం అదేనా..

చంద్ర‌బాబు ధైర్యం అదేనా..

నాడు స‌మైక్య రాష్ట్రంలో..నేడు విభ‌జించిన ఏపీలో ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన చంద్ర‌బాబు మీద అవినీతి ఆరోప‌ణ‌లు
ఉన్నా..ఎన్నో క‌మిటీలు వేసినా ఎక్క‌డా చంద్ర‌బాబు అవినీతి ఆన‌వాళ్లు దొర‌క‌లేదు. అయితే, ఆన‌వాళ్లు లేకుండా అవి నీతికి పాల్ప‌డ్డారా..లేక ఇవ‌న్నీ ఉత్తుత్తి ఆరోప‌ణ‌లేనా అంటే ఎవ‌రూ స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇక‌, రాజ‌కీయంగా నూ నాడు వైయ‌స్ వేసిన విచార‌ణ‌లు చంద్రబాబుకు సానుభూతిని పెంచాయి. అయితే వైయ‌స్ ప్ర‌జాకర్ష‌ణ ముందు అది చంద్ర‌బాబుకు ఉప‌యోగ‌ప‌డ‌లేదు. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ సైతం చంద్ర‌బాబు మీద రాజ‌కీయంగా ఆగ్ర‌హంగా ఉన్నారు. త‌న‌ను ప్ర‌జ‌ల దృష్టిలో అవినీతి ప‌రుడుగా ముద్ర వేసి డామేజ్ చేసార‌నేది జ‌గ‌న్ ఆగ్ర‌హానికి కార‌ణం. అయితే తన పాల‌న‌లో వేధింపులు..క‌క్ష్య‌సాధింపుల‌కు అవ‌కాశం లేద‌ని చెబుత‌న్న జ‌గ‌న్‌..అవీనీతి చేసిన వారిని మాత్రం వ‌దిలేది లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. ఇదే క్ర‌మంలో మంత్ర‌వ‌ర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి విద్యుత్ ఒప్పందాలు..గ‌త ప్ర‌భుత్వ నిర్ణ‌యాల్లో అవినీతిని వెలికి తీయాల‌ని ఆదేశించారు. అయితే, జ‌గ‌న్ ఎన్ని క‌మిటీలు వేసినా త‌న‌కు ఎటువంటి న‌ష్టం లేద‌ని చంద్ర‌బాబు ఇప్ప‌టికీ ధీమాగా ఉన్నారు.

జ‌గ‌న్‌కు ప్ల‌స్..బాబుకు మైన‌స్

జ‌గ‌న్‌కు ప్ల‌స్..బాబుకు మైన‌స్

గ‌తంలో జ‌గ‌న్ మీద కేసులు న‌మోదు చేసిన స‌మ‌యంలో కాంగ్రెస్‌తో జ‌గ‌న్ విబేధించి ఉన్నారు. చంద్ర‌బాబు ఆలోచ‌న లు కాంగ్రెస్ ఆలోచ‌న‌లు క‌లిసి జ‌గ‌న్ మీద కేసుల న‌మోదుకు దోహ‌దం చేసాయి. టీడీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్నా సీఎంగా ఉన్న కిర‌ణ్‌కు అనుకూలంగానే ఉండేవారు. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో జరిగిన అవినీతిని బ‌య‌ట పెట్టి చంద్ర‌బాబు చేసిన త‌ప్పుల‌ను నిరూపించ‌టం పెద్ద క‌ష్టం కాద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. రాజ‌ధాని వ్య‌వ‌హారంలోనే పూర్తిగా దొరికిపోయార‌ని ప్రభుత్వ పెద్ద‌ల్లో జ‌రుగుతున్న ప్ర‌చారం. అయితే, ఇదే స‌మ‌యంలో నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్‌..ఏపీలో ఉన్న ముఖ్య‌మంత్రి..ప్ర‌తిప‌క్షానికి స‌హ‌క‌రించి జ‌గ‌న్‌ను బుక్ చేసిన‌ట్లుగా..ఇప్పుడు జ‌గ‌న్‌కు కేంద్రం లో చంద్ర‌బాబు విష‌యంలో స‌హ‌కారం ల‌భించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. అయినా..జ‌గ‌న్ ఏపీలో ఉన్న రాజకీయ ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకొని అడుగులు వేయాల‌ని భావిస్తున్నారు. దీంతో..రానున్న రోజుల్లో చంద్ర‌బాబు అవినీతి విష‌యంలో జ‌గ‌న్ ఏ ర‌కంగా వ్య‌వ‌హ‌రిస్తార‌నేది ఆస‌క్తి కరంగా మారింది.

English summary
CM jagan focus on corruption in Chandra Babu tenure. Jagan want to expose Babu corruption in capital and PPA's. Now central govt also waiting for Jagan decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X