• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రోజాకు జ‌గ‌న్ మ‌రో కీల‌క హామీ: అలా చేస్తే ఆయ‌న మంత్రిగా ఉండ‌రు: ముఖ్య‌మంత్రి చెప్పిందేంటి..!

|

వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఇచ్చే ప్రాధాన్య‌త ఏంటో స్ప‌ష్టం చేసారు. మంత్రి ప‌ద‌వి రాలేద‌నే బాధ‌తో ఉన్న రోజాతో సీఎం జ‌గ‌న్ అనేక అంశాలు చ‌ర్చించారు. సామాజిక స‌మీక‌ర‌ణాల వ‌ల‌నే మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని సీఎం చెబుతూనే..ప్ర‌భుత్వంలో రోజా బాధ్య‌త‌లు వివ‌రించారు. కీల‌క‌మైన ఏపీఐఐసీ ఛైర్ ప‌ర్స‌న్ పోస్టును రోజాకు ఇస్తున్నట్లుగా చెప్పిన జ‌గ‌న్ అదే స‌మ‌యంలో రోజా అనుమానాల‌ను నివృత్తి చేసారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఆ మంత్రి జోక్యం ఉంటే త‌న‌కు విలువ ఉండ‌ద‌ని రోజా..సీఎం దృష్టికి తెచ్చారు. దీనికి ముఖ్య‌మంత్రి సైతం ఘాటుగానే స‌మాధానం ఇచ్చారు.

జ‌గ‌న్ ఎదుట రోజా ఆవేద‌న‌..

జ‌గ‌న్ ఎదుట రోజా ఆవేద‌న‌..

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఎదుట రోజా త‌న ఆవేద‌న మొత్తం ఒక్క‌సారిగా చెప్పుకున్నారు. రాజ‌కీయంగా ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్నా..మిమ్మ‌ల్నే న‌మ్ముకున్నానంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు జిల్లాలో ఇద్ద‌రికి మంత్రి ప‌ద‌వులు ఉన్నాయ‌ని .. త‌న‌కు ఏ ప‌ద‌వి లేకుంటే కార్య‌క‌ర్త‌ల‌కు స‌మాధానం చెప్పుకోలేని ప‌రిస్థితి వ‌స్తుంద‌ని వివ‌రించారు. దీనికి స్పంద‌న‌గా జ‌గ‌న్ సైతం జిల్లాలో సామాజిక స‌మీక‌ర‌ణాల కార‌ణంగా మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేక‌పోయినా..రోజాకు పార్టీలో- ప్ర‌భుత్వంలో ఇచ్చే ప్రాధాన్య‌త త‌గ్గ‌ద‌ని స్ప‌ష్టం చేసారు. ఇదే స‌మ‌యంలో కీల‌క నామినేటెడ్ ప‌ద‌వి ఇస్తున్నట్లు జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ప‌ద‌వి ఏది ఇచ్చినా పర‌వాలేద‌ని రోజా సైతం అంగీక‌రించారు. అదే స‌మ‌యంలో మంత్రి ప‌ద‌వులు ఆశించి ద‌క్క‌ని వారికి సైతం కీల‌క ప‌ద‌వులు ఇవ్వ‌నున్న‌ట్లు జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. ఏ ఒక్క‌రినీ ప‌క్క‌న పెట్టే ఉద్దేశం లేద‌ని.. కేవ‌లం స‌మీక‌ర‌ణాల కోణంలోనే అవ‌కాశం ఇవ్వలేక పోయాన‌ని జ‌గ‌న్ వివ‌రించారు.

  మేము వాళ్లలా కాదు.. -ఆర్కే రోజా
  జిల్లా మంత్రుల గురించీ చ‌ర్చ‌..

  జిల్లా మంత్రుల గురించీ చ‌ర్చ‌..

  జిల్లాలో ఇద్ద‌రు మంత్రులు ఉన్నార‌ని..త‌న‌కు జిల్లాలో ప్రాధాన్య‌త ఉండ‌ద‌నే అభిప్రాయం రోజా వ్య‌క్తం చేసారు. దీంతో .. రోజాతో పాటుగా చెవిరెడ్డి అదే విధంగా భూమ‌న క‌రుణాక‌ర రెడ్డికి ఖ‌చ్చితంగా ప్రాధాన్య‌త ఉంటుంద‌ని..ఎటువంటి అనుమానాలు అవ‌స‌రం లేద‌ని సీఎం స్ప‌ష్టం చేసారు. ఇప్ప‌టికే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డికి విప్ ప‌ద‌వితో పాటుగా తుడా ఛైర్మ‌న్ ప‌ద‌విని క‌ట్ట‌బెట్టిన విష‌యం చెప్పుకొచ్చారు. అదే స‌మ‌యంలో జిల్లాలో ఇద్దరు మంత్రుల్లో పెద్దిరెడ్డి రామ‌చం ద్రా రెడ్డితో ఎటువంటి స‌మ‌స్య ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేసారు. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం వ‌ర‌కూ రోజా సూచ‌న‌ల మేర‌కే అన్ని నిర్ణ‌యాలు ఉంటాయ‌ని సీఎం జ‌గన్ తేల్చి చెప్పారు. జిల్లాలో తాజాగా ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్న నేత సైతం న‌గ‌రి వ్య‌వ‌హారాల్లో జోక్యం చేసుకోవ‌ద్ద‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేస్తాన‌ని హామీ ఇచ్చిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఒక వేళ ఆయ‌న న‌గ‌రి వ్య‌వ‌హారాల్లో వేలు పెడితే ఆయ‌న మంత్రి ప‌ద‌వి పైన పున‌రాలోచ‌న చేస్తానంటూ ముఖ్య‌మంత్రి హోదాలో జ‌గ‌న్...ఎమ్మెల్యే రోజాకు హామీ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

  కీల‌క పద‌వి ఇస్తున్నా..స‌మ‌ర్ధ‌త గుర్తించే..

  కీల‌క పద‌వి ఇస్తున్నా..స‌మ‌ర్ధ‌త గుర్తించే..

  ప్ర‌భుత్వంలో కీల‌కమైన నామినేటెడ్ ప‌ద‌వి ఇవ్వాల‌నుకుంటున్న‌ట్లు రోజాకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స్ప‌ష్టం చేసారు. ఏపీ లో ఇప్ప‌టి దాకా మ‌హిళ‌కు కేటాయించని ఏపీ పారిశ్రామిక‌..మౌళిక వ‌స‌తుల కార్పోరేష‌న్ ఛైర్ ప‌ర్స‌న్‌గా రోజాకు అవ కాశం ఇస్తున్నట్లుగా జ‌గ‌న్ హామీ ఇచ్చారు. ఇదే స‌మ‌యంలో ఇత‌ర ముఖ్య నేత‌ల‌కు ఇవ్వాల్సిన కీల‌క ప‌ద‌వుల పైన
  నిర్ణ‌యం తీసుకున్నాక‌..అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. ఇందులో భాగంగా.. భూమ‌న .. అనంత వెంక‌ట్రామిరెడ్డి..పార్ధ సార‌ధి.. బాల‌రాజు.. అంబటి రాంబాబు..ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి లాంటి వారికి ముఖ్య‌మైన నామినేటెడ్ ప‌ద‌వులు ద‌క్క‌నున్నాయి. అసెంబ్లీ స‌మావేశాలు పూర్తయ్యే లోగా వారి నియామ‌కాల‌కు సంబంధించి సీఎం కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్నారు.

  English summary
  Cm Jagan given another assurance to YCP key leader Roja. CM assured no one involve in Nagari constituency issues with out Roja permission. If any Minister ignore will loose ministry.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X