కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సుగాలి ప్రీతి కేసును సీబీఐ కి అప్పగించిన సీఎం జగన్ .. ఉత్తర్వులు జారీ

|
Google Oneindia TeluguNews

సుగాలి ప్రీతి కేసును ఏపీ ప్రభుత్వం సీబీఐకు అప్పగించింది. సీఎం జగన్ సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ మేరకు జగన్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సుగాలి ప్రీతీ కేసును సీబీఐ కి అప్పగించింది .

2017 నాటి సుగాలి ప్రీతి కేసులో కీలక నిర్ణయం

2017 నాటి సుగాలి ప్రీతి కేసులో కీలక నిర్ణయం

2017 నాటి సుగాలి ప్రీతి కేసులో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. కర్నూలులోని ఒక ప్రైవేట్ స్కూల్ లో చదువుతోన్న పార్వతి, రాజు నాయక్ కుమార్తె సుగాలి ప్రీతి 2017 ఆగస్టు 19న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇక ఆమె మృతిపై తల్లిదండ్రులు అత్యాచారం చేసి హత్యా చేశారని ఆరోపించారు. వారి అనుమానమే నిజం అయ్యింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ప్రీతిపై అత్యాచారం జరిగిందని తేలింది. ఈ ఘటనపై విచారణకు నియమించిన కమిటీ కూడా ప్రీతిని హత్యాచారం చేశారని నివేదిక ఇచ్చింది.దీంతో పోలీసులు ఆ స్కూల్ యజమాని అతని కుమారుడిపై కేసు నమోదు చేశారు .

సీబీఐ కి అప్పగించాలని డిమాండ్ చేసిన పవన్

సీబీఐ కి అప్పగించాలని డిమాండ్ చేసిన పవన్

నిందితులపై పోలీసులు పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇక కొద్ది రోజులకే వారికి బెయిల్ రావటంతో అప్పటి నుండి ప్రీతి తల్లిదండ్రులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ కూడా కర్నూలు లో పర్యటించి సుగాలి ప్రీతీ తల్లిదనృలకు న్యాయం చెయ్యాలని కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు .

Recommended Video

AP CM YS Jagan Mohan Reddy Launches SOS Application @ Nannayya University In Rajahmundry
సీబీఐ కి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ

సీబీఐ కి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ

ఇక ఇటీవల కంటి వెలుగు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా కర్నూల్‌కు వెళ్లిన సీఎం జగన్‌ను ప్రీతి తల్లిదండ్రులు కలిశారు . ఈ సందర్భంగా ప్రీతి కేసును సీబీఐకు రిఫర్ చేస్తామని జగన్ వారికి భరోసా ఇచ్చారు. అంతేకాదు ఈ విషయంపై మరోసారి కూలంకషంగా మాట్లాడేందుకు, తన వద్దకు రావాలని కూడా సూచించారు. ఈ క్రమంలో తాజాగా ఈ కేసును సీబీఐకు అప్పగించారు. ఇచ్చినమాట ప్రకారం సీఎం జగన్ సుగాలి ప్రీతీ కేసును సీబీఐ కి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సర్కార్ అందుకు ఉతర్వులు జారీ చేసింది.

English summary
The AP government handed over the Sugali Preethi case to the CBI. CM Jagan retained his promise given to Sugali Preethi's parents. To this extent the Jagan government has issued fresh orders. Sugali Preeti's case has been handed over to the CBI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X