• search
  • Live TV
ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కేన్సర్ వ్యాధులకు ఉచిత వైద్యం..కొత్తగా వెయ్యి జబ్బులకు: రాజధానిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..!

|

ఏపీలో ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ సేవల కింద అందుబాటులో ఉన్న 1059 వ్యాధుల సేవలను 2059 వ్యాధులకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి జగన్ ఏలూరులో పైలెట్ ప్రాజెక్టు కింద దీనిని ప్రారంభించారు. ఏప్రిల్ నుండి నెలకో జిల్లా చొప్పున ఈ మొత్తాన్ని విస్తరిస్తామని సీఎం ప్రకటించారు. ఎలాంటి కేన్సర్ రోగానికి అయినా ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందిస్తుందని సీఎం స్పష్టం చేసారు. మే లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు..నర్సులు అన్ని రకాల ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇక..ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి రాజధాని గురించి పరోక్ష వ్యాఖ్యలు చేసారు. అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా నిర్ణయాలు ఉంటాయని తేల్చి చెప్పారు. గత పాలకులు చేసిన తప్పులను సరి దిద్దుకుంటూ..అన్ని ప్రాంతాలను డెవలప్ చేయటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పటం ద్వారా..పరోక్షంగా రాజధాని మార్పు తప్పదనే సంకేతాలిచ్చారు.

అన్ని ప్రాంతాలకు న్యాయం చేసేలా..

అన్ని ప్రాంతాలకు న్యాయం చేసేలా..

ముఖ్యమంత్రి జగన్ పరోక్షంగా రాజధానుల వ్యవహారం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రతీ ప్రాంతానికి నీరు..ఉపాధి..అవకాశాలు కల్పించటమే లక్ష్యంగా అన్ని ప్రాంతాలకు న్యాయం చేసేలా తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. గత పాలకులు చేసిన తప్పులను సరి దిద్దుతూ అన్ని ప్రాంతాల డెవలప్ మెంట్ లక్ష్యంగా తాము ముందుకు వెళ్లే నిర్ణయాలు తీసుకోబోతున్నామని స్పష్టం చేసారు. అన్ని ప్రాంతాల వారు అన్న దమ్ముళ్లా కలిసి ఉంటూ మొత్తం రాష్ట్రం పురోగతి సాధించేలా నడుచుకోవాలని సూచించారు. ఏ ప్రాంతం నిర్లక్ష్యానికి గురి కాకూడదని..ఎక్కడా తమ ప్రాంతం వెనుక బడి ఉందనే భావన రాకూడదని..ఆ దిశగా తమ మీద ప్రజలు ఉంచిన నమ్మనానికి అనుగుణంగా ముందడుగు వేస్తామంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ఆరోగ్యశ్రీలో కొత్తగా మరో వెయ్యి వ్యాధులు

ఆరోగ్యశ్రీలో కొత్తగా మరో వెయ్యి వ్యాధులు

ఆరోగ్య శ్రీ పధకం ద్వారా ఇప్పటి వరకు అందిస్తున్నా 1059 వ్యాధులకు ఇప్పటి నుండి అదనంగా మరో వెయ్యి వ్యాధులను జోడించి..మొత్తంగా 2059 వ్యాధులకు చికిత్స అందిస్తామి ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ మేరకు పైలెట్ ప్రాజక్టుగా ఏలూరులో దీనిని ప్రారంభించారు. ఏప్రిల్ నుండి నెలకో జిల్లా చొప్పున అన్ని జిల్లాలకు దీనిని విస్తరిస్తామని స్పష్టం చేసారు. వెయ్యి రూపాయాలు దాటిని ప్రతీ చికిత్స ఆరోగ్య శ్రీ కిందకు వస్తుందని ప్రకటించారు. అన్ని రకాల కేన్సర్ రోగులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ట్రీట్ మెంట్ ఇవ్వనున్నట్లు కీలక ప్రకటన చేసారు. ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా 1.42 కోట్ల మందికి ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ మొదలవుతుందన్నారు. ప్రతీ కార్డు హోల్డర్ కు సంబంధించిన హెల్త్ ప్రొఫైల్ క్యూ ఆర్ ద్వారా కార్డులోనే నిక్షిప్తం అయి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ నెల నుండి డయాలసిస్ రోగులకు..తలసేమియా బాధితులను నెలకు కూ 10 వేలు చొప్పన పెన్షన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

మే లో ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ..

మే లో ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ..

ఆశా వర్కర్లకు మెరుగైన శిక్షణ ఇచ్చి ప్రతీ 300 ఇళ్ల ఆరోగ్య బాధ్యతలు వారికి అప్పగిస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్య..నర్సు పోస్టులను మేలో భర్తీ చేస్తామని వెల్లడించారు. ఆపరేషన్ చేయించుకున్న తరువాత విశ్రాంతి సమయంలో రోజుకు రూ 225 చొప్పున చెల్లిస్తున్నామని వివరించారు. ఆస్పత్రుల్లో పని చేసే పారిశుద్ద్య కార్మికుల వేతనం రూ 8 వేల నుండి రూ 16 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోనే కాకుండా హైదరాబాద్..చెన్నై..బెంగుళూరు లోని కార్పోరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందే వారికి సైతం ఆరోగ్య శ్రీ వర్తించేలా 150 ఆస్పత్రులతో ఒప్పందం చేసుకున్నామని వివరించారు.

మార్చి నెలాఖరుకు 1060 కొత్త 104, 108 వాహనాలు అందుబాటులోకి వస్తాయని..ఫోన్ చేయగానే 20 నిమిషాల్లో అవసరమైన వారి వద్దకు చేరుతుందని ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు.

English summary
CM Jagan inagurated Aroyasri pilot project in Eluru. CM Says free treatment for all types of cancers to the victims. Govt added 1000 new health problems under Arogyasri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more