మత్స్యకారులకు రూ 10 లక్షలు.. ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకుంటా: సీఎం జగన్!
తాను ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీ నిలబెట్టుకుంటానని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేసారు. ముద్రంలో వేట నిషేధం సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు గత ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.4 వేలు చెల్లించేది. దీనిని ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.10 వేలకు పెంచింది. ఈ పధకాన్ని ముఖ్యమంత్రి తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించారు. డీజిల్ సబ్సిడీ రూ.9కి పెంపు.. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబానికి రూ.10లక్షల పరిహారాన్ని అందిచే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పుడు వాటిని అమలు చేస్తున్నానని వివరించారు. ఈ రోజు నుండే లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు.
శత్రువులు ఏకమయ్యారు..పోరాటం కొనసాగిస్తా: ఇంగ్లీషు మీడియం వ్యతిరేకిస్తే నిలదీయండి: జగన్ భావోద్వేగం..!

మత్య్సకారులకు పది వేల పరిహారం..
ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారు. మత్య్సకారుల సమస్యలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. 974 తీర ప్రాంతం ఉన్న ఏపీలోని మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వలసకు వెళ్లాల్సి వస్తుందన్నారు. వారికి ఇచ్చిన మాటకు కట్టుబడి సముద్రంలో వేట నిషేధం సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు గత ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.4 వేలు చెల్లించేదని... దీనిని ఇప్పుడు తమ ప్రభుత్వం ఏకంగా రూ.10 వేలకు పెంచిందని సీఎం ప్రకటించారు. పధకం ప్రారంభంలో భాగంగా నగదు పంపిణీని అధికారికంగా సీఎం ఆవిష్కరించారు.

మరణించిన వారికి 10లక్షలు..
మత్య్సకారులకు డీజిల్ సబ్సిడీ పధకాన్ని పక్కాగా అమలు చేస్తామన్నారు. మోటార్లకు డీజిల్ వినియోగించే ప్రతీ మత్స్యకారుడిని గుర్తింపు కార్డులు ఇచ్చామని..వారికి డీజిల్ కొనుగోలు సమయంలోనే రాయితీ లభిస్తుందని ప్రకటించారు. లీటర్ కు తొమ్మది రూపాయాల చొప్పున సబ్సిడీ అందుతుందని వివరించారు. మత్స్యకారుల జీవితాల్ల మార్పు రావాలని ఆకాంక్షించారు. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబానికి రూ.10లక్షల పరిహారాన్ని అందిస్తామని చెప్పారు. ఆ పధకం సైతం ఈ రోజు నుండే ప్రారంభం అవుతుందని వివరించారు. తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన పథకంతో రాష్ట్రంలోని 1.35 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. మౌలిక సదుపాయాలను ప్రాధాన్యతా క్రమంలో కల్పించడానికి బడ్జెట్లో మత్స్య శాఖకు రూ.551 కోట్లు కేటాయించిందని సీఎం వివరించారు.

జీఎస్పీసీ చెల్లించాల్సి మొత్తం కూడా ఇస్తున్నాం..
కోనసీమతో గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పోరేషన్ డ్రిల్లింగ్ కారణంగా ఆరు నెలల పాటు 16559 కుటుంబాలు జీవనం కోల్పోయారని..ఆ విషయం తనకు పాదయాత్ర సమయంలో వివరించారని ముఖ్యమంత్రి గుర్తు చేసారు. అక్కడ 13 నెలల పాటు డ్రిల్లింగ్ జరగ్గా.. ఆరు నెలలకే పరిహారం చెల్లించారని తనకు చెప్పుకొని బాధితులు ఆవేదన చెందారన్నారు. వారికి మిగిలిన మొత్తం చెల్లింపుల కోసం రాష్ట్రం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి సంప్రదింపులు చేస్తున్నామన్నారు. ఓఎన్జీసీ నుండి ఆ మొత్తం తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని..ఇప్పటి వరకు ఫలితం రాలేదన్నారు. దీంతో..అన్ని వేల కుటుంబాలు ఇబ్బంది పడకుండా వారికి వెంటనే వారి నుండి రావాల్సిన రూ 78.24 కోట్ల చెల్లిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ వెంటనే వారి ఖాతాల్లోకి ముఖ్యమంత్రి నగదు బదిలీ చేసారు. ఆరు నెలల కాలంలోనే ఇన్ని పనులు చేస్తున్న మీ బిడ్డను ఆశీర్వదించాలంటూ జగన్ అక్కడి మత్య్సకారులను అభ్యర్దించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!