వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధానులపై సీఎం జగన్ తేల్చి చెప్పేసారు: నీళ్లు..నిధులు..పరిపాలన: తప్పులు సరిదిద్దాలి..!

|
Google Oneindia TeluguNews

బోస్టన్ కమిటీ..హైపవర్ కమిటీ అధ్యయనం..అసెంబ్లీ సమావేశానికి ముందే ముఖ్యమంత్రి రాజధాని పైన పరోక్షంగా స్పష్టత ఇచ్చేసారు. అన్ని ప్రాంతాలకు న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు. గతంలో పాలకులు చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని స్పష్టం చేసారు, గతంలో అన్యాయంగా నిర్ణయాలు తీసుకున్నారని..అన్నదమ్ముల్లా అన్ని ప్రాంతాలు ఉండేలా..ఎప్పటికీ అనుబంధాలు నిలిచేలా..మీరిచ్చిన ఈ బలాన్ని అందరికీ మేలు చేసేలా నడుచుకుంటామని వివరించారు. మూడు ప్రాంతాలు సమానమని.. గ్రామ సచివాలయం నుండి రాష్ట్ర సచివాలయం వరకు అందరూ ఒక్కటేనని సీఎం వ్యాఖ్యానించారు.

గత నిర్ణయాలు సరిదిద్దుతాం..

గత నిర్ణయాలు సరిదిద్దుతాం..

ముఖ్యమంత్రి జగన్ ఏలూరులో జరిగిన ఆరోగ్య శ్రీ పైలెట్ ప్రాజెక్టు కార్యక్రమంలో రాజధాని పైన పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేసారు. గత పాలకులు చేసిన తప్పులను సరిదిద్దుతూ అన్ని ప్రాంతాలకు సమ న్యాయం చేసే నిర్ణయాలు ఉంటాయని సీఎం స్పష్టం చేసారు. గతంలో తీసుకున్న నిర్ణయాలను సరి దిద్దుతామని చెప్పుకొచ్చారు.

ఎక్కడా రాజధాని మార్పు..మూడు రాజధానుల అంశం అని చెప్పకుండానే ముఖ్యమంత్రి తాను ఇవ్వదలచుకున్న క్లారిటీ ఇచ్చేసారు. రాష్ట్రంలోని అందరూ అన్న దమ్ముల్లా కలిసి ఉండాలని..ప్రేమ..అనుబంధాలు నిలిచేలా అన్ని ప్రాంతాలను డెవలప్ చేసే బాధ్యత తమదేనని సీఎం వ్యాఖ్యానించారు. ప్రజలు ఇచ్చిన అధికారం..దేవుడిచ్చిన అవకాశం ప్రజలకోసమే వినియోగిస్తానని వివరించారు.

నీళ్లు..నిధులు..పరిపాలన

నీళ్లు..నిధులు..పరిపాలన

అన్ని ప్రాంతాలకు కావాల్సింది నీళ్లు..నిధులు..పరిపాలన అని సీఎం కొత్త నినాదం తెర మీదకు తీసుకొచ్చారు. ఈ మధ్నాహ్నం బోస్టన్ కమిటీ రాజధానుల అంశం పైన ముఖ్యమంత్రికి నివేదిక అందించనుంది. దీనికి ముందుగానే ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేసారు. తమకు మూడు ప్రాంతాలు సమానమేనని..అన్ని చోట్ల ఈ మూడు వికేందీకరించేలా నిర్ణయాలు ఉంటాయని చెప్పుకొచ్చారు.

ఏ ప్రాంతం నిర్లక్ష్యానికి గురి కాకూడదని..ఎక్కడా తమ ప్రాంతం వెనుక బడి ఉందనే భావన రాకూడదని..ఆ దిశగా తమ మీద ప్రజలు ఉంచిన నమ్మనానికి అనుగుణంగా ముందడుగు వేస్తామంటూ ముఖ్యమంత్రి తన ఉద్దేశాన్ని స్పష్టంగా తేల్చి చెప్పేసారు. అన్ని ప్రాంతాల డెవలప్ మెంట్ కోసమే తాము అధికారం వినియోగిస్తామని ముక్యమంత్రి స్పష్టం చేసారు.

మూడు రాజధానులపైన క్లారిటీ ఇచ్చేసారు

మూడు రాజధానులపైన క్లారిటీ ఇచ్చేసారు

ముఖ్యమంత్రి వ్యాఖ్యలు గమనిస్తే..మూడ రాజధానుల వ్యవహారం మీద ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చినట్లుగా స్పష్టమవుతోంది. ఇప్పటికే బోస్టన్ కమిటీ నివేదిక వచ్చిన తరువాత దాని మీద హైపవర్ కమిటీ అధ్య యనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఆ తరువాత అసెంబ్లీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఇదే సమయంలో అమరావతి ప్రాంతంలో రైతులు.. స్థానికు లు తమ ఆందోళన తీవ్ర తరం చేసారు.

రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. అమరావతి లెజిస్లేచర్ రాజధానిగా ఉంటుందని గతంలో సీఎం సభలో ప్రస్తావించారు. జీఎన్ రావు కమిటీ సైతం అదే ప్రతిపాదించింది. ఇక, ఇప్పుడు ముఖ్యమంత్రి తాజాగా చేసిన వ్యాఖ్యలు పరిశీలిస్తే మూడు రాజధానులు..అమరావతి నుండి సచివాలయం తరలింపు అనివార్యంగా కనిపిస్తోంది.

English summary
CM Jagan indirectly clarified that all regions to be develop in state with water..funds and also with administration. It indicates Cm going to establish three capitals as gn Rao committee proposals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X