• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కమ్మవారికి వ్యతిరేకం కాదు..వారు ఓట్లు వేస్తేనే: కొడాలి నాని..రఘు గురించి: సీఎం జగన్ కామెంట్లతో..!

|

ముఖ్యమంత్రి జగన్ కమ్మ సామాజిక వర్గం..మంత్రి కొడాలి నాని..అమరావతి గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. కమ్మ వర్గానికి వ్యతిరేకంగా అమరావతి నుండి రాజధాని తరలిస్తున్నారనే ప్రచారానికి సభ వేదిక గా ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చారు. తనకు అన్ని కులాలు..మతాలు సమానమని చెబుతూ ప్రత్యేకంగా కమ్మ సామాజిక వర్గం గురించి ప్రస్తావించారు. అమరావతి నుండి రాజధాని తరలించటం లేదని స్పష్టం చేసారు. తనకు కమ్మ వర్గంతో సహా అందరూ ఓట్లు వేస్తేనే 151 సీట్లు వచ్చాయంటూ వ్యాఖ్యానించారు. విశాఖలో కమ్మ వారు లేరా..అక్కడ వైసీపీ ఎంపీ కమ్మ వర్గానికి చెందిన వారు కాదా అని సీఎం ప్రశ్నించారు. కమ్మవారిలో అభద్రతా భావం సృష్టించి ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం కేవలం దుష్ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు.

సీఎం జగన్ నిర్ణయానికి మంత్రులు షాక్: అసెంబ్లీలో చివరి నిమిషంలో: తీర్మానం వెనుక వ్యూహం..!

కమ్మవారు కూడా ఓట్లు వేస్తేనే..

కమ్మవారు కూడా ఓట్లు వేస్తేనే..

ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో కమ్మ సామాజిక వర్గం పైన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అమరావతి నుండి రాజధాని తరలించటం లేదని స్పష్టం చేసారు. అదే సమయంలో తాను కమ్మ వర్గానికి వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు. అన్ని వర్గాలతో పాటుగా కమ్మ వర్గం సైతం తనకు ఓట్లు వేసిందని..దాని కారణంగానే తనకు 151 సీట్లు వచ్చాయని చెప్పుకొచ్చారు. తనకు గొప్ప సహచరుడుగా కొడాలి నాని ఉన్నారని గర్వంగా చెబుతున్నాని సీఎం సభలో వ్యాఖ్యానించారు. తన కార్యక్రమాల కన్వీనర్ తలశిల రఘురాం గురించి సీఎం ప్రస్తావించారు. రఘు ఎవరు..వీరంతా కమ్మవారు కాదా అని ప్రశ్నించారు. కులం మధ్య చిచ్చుపెట్టి లబ్ధిపొందడం కోసం జగన్‌ కమ్మవారికి వ్యతిరేకమని, విజయవాడ నుంచి రాజధానిని తీసేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. రాజకీయాల కోసం కులాన్ని వాడుకునే నీచానికి పాల్పడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.

విశాఖ ఎంపీ సైతం అదే వర్గం..

విశాఖ ఎంపీ సైతం అదే వర్గం..

తాను కమ్మ వర్గానికి వ్యతిరేకం కాదని..అందరూ తనకు కావాలని చెబుతూనే... విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ రాజధాని పెడితే అక్కడ కమ్మవారు లేరా అని ప్రశ్నించారు. అక్కడ తమ పార్టీ నుండి గెలిచిన ఎంపీనే కమ్మవారు అని చెప్పుకొచ్చారు. విశాఖపట్నంలో నాలుగైదు సార్లు ఎంపీగా గెలిచిన వారు కూడా కమ్మవారేనని... కమ్మవారిలో అభద్రతా భావం సృష్టించి ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం కేవలం దుష్ప్ర చారం కోసం చంద్రబాబు నీచానికి దిగజారారని చెప్పుకొచ్చారు. రాజకీయాల కోసం కులాన్ని వాడుకునే నీచానికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. క్రిష్టా జిల్లాతో తమ కుటుంబానికి విడదీయలేని సంబంధం ఉందంటూ..తన మేనత్తను అదే జిల్లాకు కోడలుగా పంపామని వివరించారు. తాడేపల్లి..మున్సిపాల్టీలకు 1100 కోట్లు ఖర్చు చేస్తే మోడల్ సిటీలుగా మార్చవచ్చని పేర్కొన్నారు.

అమరావతి రాజధానిగానే ఉంటుంది..

అమరావతి రాజధానిగానే ఉంటుంది..

అమరావతి రైతులకు అన్యాయం జరగదని సీఎం హామీ ఇచ్చారు. రైతు పక్షపాతిగా, చరిత్రలో ఏ ప్రభుత్వం చేయనంతగా రైతుకు అండగా నిలబడుతున్న ప్రభుత్వం తమదని.. 13 జిల్లాల్లోని ఏ రైతులకూ అన్యాయం జరగనీయననని చెప్పారు. అమరావతికి కూడా న్యాయమే చేస్తామన్నారు. అమరావతి రాజధానిగా ఉంటుందని.. రైతులకు ఇచ్చే వార్షిక కౌలును పదేళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచుతున్నామని ప్రకటిం చారు. 29 గ్రామాల్లో భూమి లేని పేదలకు జీవన భృతి పెన్షన్‌ను రూ. 2500 నుంచి రూ. 5000కు పెంచుతున్నామని.. దీనివల్ల 21 వేల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని వివరించారు. అసైన్‌మెంట్‌ భూములు ఇచ్చిన పేదలైన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు దీనివల్ల అన్యాయం జరుగుతుందని..తమ ప్రభుత్వం వారికి కూడా న్యాయం చేస్తుందన్నారు. పట్టా భూములు ఇచ్చిన వారితో సమానంగా ప్లాట్లు ఇస్తుందని ప్రకటించారు. అమరావతిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని సభలో ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు.

English summary
Cm jagan intersting comments on Kamma community and Amaravati in Assembly. CM sayig that he watn all communi ties and all areas.CM mentioned that along with kamma community YCP got 151 seats in last elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more