వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాసన మండలి రద్దు చేయాలి: సభలో సీఎం తీర్మానం: చర్చ ప్రారంభం..ఆ తరువాత..!

|
Google Oneindia TeluguNews

ఏపీ మంత్రివర్గం శాసన మండలిని రద్దు చేయాలని నిర్ణయించింది. దీని పైన సభలో తీర్మానం ప్రవేశ పెట్టి చర్చించేందుకు బీఏసీ సమావేశం నిర్వహించి ఆమోదించారు. సభలో ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మండలి రద్దు చేయాలనే తీర్మానం ప్రవేశ పెట్టారు. సీఎం ప్రవేశ పెట్టిన ఈ తీర్మానం పైన ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని చర్చ ప్రారంభించారు.ఆయన టీడీపీ హాయంలో ఎమ్మెల్సీగా పని చేసి..2019 ఎన్నికల్లో ఏలూరు నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రభుత్వం ఏపీ భవిష్యత్ కోసమే మూడు రాజధానుల నిర్ణయం తీసు కుందని డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజనకు కారణమైన చంద్రబాబు..ఇప్పుడు అధికార వికేంద్రీకరణకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి సభలో తీర్మానం ప్రవేశ పెట్టటానికి ముందే సభలో అనుసరించాల్సిన వ్యూహం పైన చర్చించారు. ఇందు కోసం అన్ని ప్రాంతాల వారీగా భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించారు. ప్రధానంగా మండలి సభ్యులుగా ఉంటూ మంత్రులుగా కొనసాగు తున్న డిప్యూటీ సీఎం పిల్లి సుభాస్ చంద్ర బోస్..మోపిదేవి వెంకట రమణ సభలో ప్రసంగించనున్నారు.

ఈ ఒక్కరోజే అసెంబ్లీ: మండలి రద్దుపైన తీర్మానం..చర్చ: కేంద్రానికి సిఫార్సు..బీఏసీలో నిర్ణయం..!ఈ ఒక్కరోజే అసెంబ్లీ: మండలి రద్దుపైన తీర్మానం..చర్చ: కేంద్రానికి సిఫార్సు..బీఏసీలో నిర్ణయం..!

అమరావతే రాజధాని అంటూ..
తాము రాజధాని మార్చటం లేదని...అధికార వికేంద్రీకరణలో భాగంగానే మూడు ప్రాంతాలను ఒక్కో విభాగానికి కేంద్రంగా మార్చాలని భావించామని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని చెప్పుకొచ్చారు. ఏపీ డెవలప్ అవ్వాలి అంటే.. ప్రత్యేక హోదా అవసరమని..దాని కోసం జగన్ అనేక పోరాటాలు చేసారని గుర్తు చేసారు. స్వార్థ ప్రయోజనాల కోసం టీడీపీ అరాచకాలు సృష్టిస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు రెండు నాలుకల ధోరణి వల్ల రాష్ట్రం విడిపోయిందన్నారు. ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టి.. సోనియాతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. విభజనతో హైదరాబాద్‌లాంటి మహానగరాన్ని కోల్పోయామని గుర్తుచేశారు. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని ఆరోపించారుజగన్‌కు కులతత్వాన్ని అంటగడుతున్నారని ధ్వజమెత్తారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తు న్నారని విమర్శించారు. టీడీపీ నేతలు కమీషన్లు దండుకుని పోలవరం నిర్మాణంపై దృష్టిపెట్టలేదన్నారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగలేదని వ్యాఖ్యానించారు.

CM Jagan introduced resolution in Assembly on Abolish of council

Recommended Video

Abolish Of AP Legislative Council Resolution In Assembly After AP Cabinet Passes || Oneindia Telugu

ఆళ్ల నాని తరువాత సీనియర్ నేత ధర్మాన ప్రసాద రావు తీర్మానానికి మద్దతుగా మాట్లాడారు. ప్రజల ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంటే..పెద్దల సభ పేరుతో అడ్డుకోవటం సరి కాదనే అభిప్రాయం వ్యక్తం చేసారు. రాజ్యంగంలో పెద్దల సభ గురించి ఏమని ప్రస్తావించారనే విషయాన్ని వివరించారు. సాయంత్రం వరకు ఇదే అంశం మీద సభ్యులు తమ అభిప్రాయాలను వివరించే ఛాన్స్ కనిపిస్తోంది. ఆ తరువాత ముఖ్యమంత్రి చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. దీని ద్వారా మండలిని రద్దు చేయాలని కేంద్రాన్ని కోరుతూ ఏపీ శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి నివేదించనుంది.

English summary
AP CM introduced resolution on Abolish of legislative council in Assembly. Discussion started and after that assembly pass resultion to ask central govt approve the decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X