వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు అప్పులు అప్పగించారు: మహారాష్ట్ర కొత్త ప్రభుత్వంలో ఏంటీ సమీకరణాలు: సీఎం జగన్..!

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తొలి సారి మహారాష్ట్ర రాజకీయాల మీద స్పందించారు. కొత్త ప్రభుత్వ కూర్పు పైనా కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో ఇంగ్లీషు మీడియం పాఠశాలలు అమలవుతాయని మరోసారి స్పష్టం చేసారు. అదే సమయంలో చంద్రబాబు తమకు వారసత్వంగా అప్పులు అప్పగించారని..ప్రతీ అడుగులోనూ అప్పులు పెట్టి వెళ్లారని దుయ్యబట్టారు. అయినా..సంక్షేమం విషయం లో ప్రధానంగా బీసీల బడ్జెట్ కేటాయింపుల్లో ఎవరూ చేయలేని విధంగా చేస్తున్నామని చెప్పుకొచ్చారు. బీసీల అభ్యున్నతి కోసం బీసీ డిక్లరేషన్‌ చేశామని, అందుకోసం బడ్జెట్‌లో వారి సంక్షేమం కొరకు రూ. 15వేల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఉగాది రోజున 24 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని.. పల్లెలో.. పట్టణాల్లో సెంట్‌ భూమి ఇవ్వనున్నట్లు తెలిపారు.

 హైదరాబాద్ తరహాలో చేద్దామనుకున్నా: అత్యంత అవినీతి పరుడు జగన్: చంద్రబాబు ఫైర్..! హైదరాబాద్ తరహాలో చేద్దామనుకున్నా: అత్యంత అవినీతి పరుడు జగన్: చంద్రబాబు ఫైర్..!

 మహారాష్ట్రలో రాజకీయ కూర్పుల పైన..

మహారాష్ట్రలో రాజకీయ కూర్పుల పైన..

ముఖ్యమంత్రి జగన్ మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కోసం జరుగుతున్న కసరత్తు మీద స్పందించారు. మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడుతున్న ప్రభుత్వంలో కాంగ్రెస్ కు స్పీకర్ పదవి ఇస్తారని.. ఎన్సీపీకి డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని చెబుతన్నారని ప్రస్తావించారు. తమ ప్రభుత్వం లో ఎస్సీ..ఎస్టీ..బీసీ..మైనార్టీ వర్గాలతో పాటుగా కాపు వర్గం నుండి అయిదుగురికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చిన విషయాన్ని జగన్ గుర్తు చేసారు. అదే విధంగా నామినేటెడ్ పదవుల్లోనూ 50 శాతం ఈ వర్గాలకే రిజర్వ్ చేసామని చెప్పుకొచ్చారు. అందులోనూ మహిళలకు రిజర్వేషన్ అమలు చేస్తున్నామన్నారు. బీసీ..ఎస్సీ..ఎస్టీ వర్గాలకు ఇంతగా మరే ప్రభుత్వంలోనూ ప్రాధాన్యత లేదని సీఎం జగన్ వివరించారు.

రూ. 15 వేల కోట్లు కేటాయించాం..

రూ. 15 వేల కోట్లు కేటాయించాం..

మహాత్మా జ్యోతిరావు పూలే వర్థంతి పురస్కరించుకొని జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అణగారిన వర్గాలకు సమాన హక్కు ఉండాలంటూ జ్యోతిరావు పూలే చేసిన పోరాటం గుర్తుచేశారు. బల హీన వర్గాల్లో మహిళలు చదువుకోవాలని ఆరాటపడిన వ్యక్తి పూలే అని కొనియాడారు. దళిత వర్గం నుంచి వచ్చిన అంబేడ్కర్‌, పూలేలు అమలు పరిచిన విధానాలను ఇప్పటికి ఆచరిస్తున్నామని పేర్కొన్నారు.
దేశంలోని పౌరుల్లో ఎక్కువ, తక్కువ అనే బేధాభిప్రాయాలు రాకుండా ఉండేందుకు పూలే పాటు పడ్డారని తెలిపారు. బలహీన వర్గాల కుటుంబాల నుంచి ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు రావాలని ఆలోచన చేసిన వ్యక్తి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని పేర్కొన్నారు. పేద విద్యార్థుల చదువుకు ఎంత ఖర్చైనా భరిస్తామని మహానేత వైఎస్సార్‌ భరోసా ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. బీసీల అభ్యున్నతి కోసం బీసీ డిక్లరేషన్‌ చేశామని.. అందుకోసం బడ్జెట్‌లో వారి సంక్షేమం కొరకు రూ. 15వేల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.

చంద్రబాబు అప్పులు అప్పగించారు..

చంద్రబాబు అప్పులు అప్పగించారు..

రాష్ట్ర ఆర్దిక పరిస్థితి సహకరించకపోయినా తామిచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేసారు. చంద్రబాబు దిగిపోతూ తమకు వేల కోట్ల అప్పులు అప్పగించి వెళ్లారని చెప్పుకొచ్చారు.
పెట్టిపోయాడన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ఎప్పుడూ వెనకడుగు వేయలేదన్నారు. దేవుడిపై నమ్మకంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని జగన్‌ స్పష్టం చేశారు. వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద రాష్ట్రంలోని 46 లక్షల రైతులకు పెట్టుబడి సాయం అందించామని తెలిపారు. దీంతో పాటు కౌలు రైతులకు కూడా ఈ సాయం అందేలా ప్రణాళిక చేశామని పేర్కొన్నారు. ఉగాది రోజున 24 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని.. పల్లెలో.. పట్టణాల్లో సెంట్‌ భూమి ఇవ్వనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు.

English summary
CM Jagan key comments on Maharatra new govt formaation. He says new govt giving only one Dy cm post. In his govt gave five dy cm's and foour of that for Sc, St, Bc, and minority sections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X