నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

50 లక్షల మంది రైతులకు సీఎం జగన్ మేలు.. నెల్లూరు వేదికగా రైతు భరోసా

|
Google Oneindia TeluguNews

నెల్లూరు జిల్లా వేదికగా ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు భరోసా పథకం నేడు ప్రారంభించనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఏపీ సీఎం జగన్ రైతు భరోసా పథకం పేరుతో రైతుల జీవితాల్లో కొత్త వెలుగు తీసుకొచ్చారు. రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు ఆయన చేసిన ప్రకటనతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

 మోదీనీ మెప్పించేలా జగన్: రైతు భరోసాకు ప్రధాని పేరు: పధకంలోనూ మార్పులు..! మోదీనీ మెప్పించేలా జగన్: రైతు భరోసాకు ప్రధాని పేరు: పధకంలోనూ మార్పులు..!

నిన్నమాజీ సీఎం చంద్రబాబు ..నేడు సీఎం జగన్ పర్యటన

నిన్నమాజీ సీఎం చంద్రబాబు ..నేడు సీఎం జగన్ పర్యటన

నెల్లూరు జిల్లాలో నేడు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నారు. దీనికోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు వైసిపి నాయకులు. నిన్నటికి నిన్న మాజీ సీఎం,టిడిపి అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లాలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి,ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై నిప్పులు చెరిగారు. ఇక నేడు అదే నెల్లూరు జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కౌలు రైతులకు కార్డులు ఇవ్వడంతోపాటు, రైతులకు రైతు భరోసా పథకం కింద వ్యవసాయ పెట్టుబడి సాయంగా చెక్కులు ఇవ్వనున్నారు.

రైతు భరోసా క్రింద రూ .13,500

రైతు భరోసా క్రింద రూ .13,500

ఇప్పటివరకు రైతు భరోసా కింద అందజేస్తున్న రూ.12,500లకు రూ.1000 పెంచారు. దీంతో పెంచిన వెయ్యి రూపాయలతో కలిపి ఇప్పటినుండి రూ.13,500 ఇవ్వాలని వైసీపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇక నాలుగేళ్లపాటు రూ.12,500 ఇస్తామని ఎన్నికల సమయంలో జగన్ హామీ ఇచ్చారు. నవరత్నాలు అమలులో భాగంగానే ఇప్పుడు ఐదేళ్ల పాటు రూ.13,500లు ఇవ్వనున్నట్టు వెల్లడించి గుడ్ న్యూస్ చెప్పారు.

50 లక్షల మంది రైతులకు, కౌలు రైతులకు ప్రయోజనం

50 లక్షల మంది రైతులకు, కౌలు రైతులకు ప్రయోజనం

ఈ పథకం ద్వారా 50 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. రెండు లక్షల మంది కౌలు రైతులకు సైతం ఇది ఎంతో ఉపయోగంగా ఉంటుంది. భూమి ఉన్న, వ్యవసాయం చేసే ప్రతి రైతు దీనికి అర్హులే. ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,ఎంపీలు,మాజీ ఎమ్మెల్యేలు,మాజీ ఎంపీలు,మాజీ ఎమ్మెల్సీలకు మాత్రం రైతు భరోసా పథకం వర్తించదని పేర్కొంది ప్రభుత్వం. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చని తెలిపింది.

నేడు సింహపురి వేదికగా రైతు భరోసా

నేడు సింహపురి వేదికగా రైతు భరోసా

ఇక రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం అందించాలి అనుకున్న సాయం లో రైతులకు అవసరాలను అవసరాలను దృష్టిలో ఉంచుకుని మూడు విడతలలో పెట్టుబడి సహాయం చేయాలని రైతు ప్రతినిధులు సూచనలు చేశారు. రైతులు,రైతు ప్రతినిధుల డిమాండ్లను సీఎంకు వ్యవసాయ మిషన్‌ సభ్యులు వివరించారు. మొత్తం మూడు విడతల్లో రైతు భరోసా డబ్బు పంపిణీ చేయనున్నారు. మే నెలలో రూ.7,500, ఖరీఫ్‌ పంట కోసే సమయంలో,రబీ అవసరాలకోసం రూ.4000,సంక్రాంతి పండుగ సమయంలో రూ.2వేలు అందజేయనున్నారు. ఏపీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ పథకం నేడు సింహపురి వేదికగా ప్రారంభం కాబోతోంది.

English summary
The YSR Congress Party (YSRCP) government is set to launch its flagship 'Rythu Bharosa' scheme in Nellore on Tuesday. Rythu Bharosa is a welfare scheme under which financial assistance will be provided to the farmers of the state. The list of eligible farmers will be prepared and financial assistance will be given to them as per the scheme.The Jagan-led YSRCP government has decided to increase the amount of 'Rythu Bharosa' scheme from Rs 12,500 to Rs 13,500 annually and implement it for five years instead of the promised four years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X