Coronavirus andhra pradesh ycp ap cm jagan mohan reddy fishermen ban compensation ఆంధ్రప్రదేశ్ వైసిపి నిషేధం పరిహారం
మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ .. వారి ఖాతాల్లో 10 వేల నగదు
లాక్ డౌన్ కారణంగా నష్టపోతున్న మత్స్యకారులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది ఏపీ సర్కార్ . ఉపాధి లేక అవస్థలు పడుతున్న మత్స్య కార్మిక లబ్ధిదారుల కుటుంబాలకు రూ. 10 వేల చొప్పున మత్స్యకార భరోసా కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టింది. మత్స్యకారులకు లాక్ డౌన్ కష్ట కాలంలో ఆదుకునేందుకు వేట విరామ సాయాన్ని అందించాలని భావించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి మత్స్యకార భరోసా కింద ఆయా కుటుంబాలకు రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని నేడు తాడేపల్లి క్యాపు కార్యాలయం నుండి బటన్ నొక్కి ప్రారంభించారు .
కరోనాతో యుద్ధం చేసి గెలిచినా... సామాజిక వివక్షతో కృంగిపోతున్న బాధితులు

వేట నిషేధ నిషేధభృతిని అందించిన ఏపీ సీఎం జగన్
మత్స్యకార భరోసా కార్యక్రమంలో మంత్రి మోపిదేవి వెంకటరమణ , సీఎస్ నీలం సాహ్ని, జిల్లాల నుంచి కలెక్టర్లు, పలువురు మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ తో మాట్లాడారు. ఇక కొందరు మత్స్యకారులు కూడా పాల్గొన్నారు. సముద్రంలో వేట నిషేధ నిషేధభృతిని కరోనా లాక్ డౌన్ కష్టకాలంలో మత్స్యకారుల ఖాతాల్లో వేసి వారికి ఆర్ధిక చేయూతనిచ్చింది ఏపీ ప్రభుత్వం . చేపల పునరుత్పత్తి కారణంగా కేంద్ర ప్రభుత్వం సముద్రంలో చేపల వేటను ఏటా ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకూ నిషేధించింది. ఈ 61 రోజులు మత్స్యకారులు చేపల వేట లేక ఖాళీగా ఉంటారు. ఇక వీరి జీవనోపాధి కల్పించాలని భావించిన సర్కార్ వేట నిషేధభృతిని వారి ఖాతాల్లో జమ చేసింది .

కరోనా లాక్ డౌన్ తో ఇబ్బంది పడుతున్న మత్స్యకారులకు ఆర్ధిక భరోసా
నిజానికి వేట నిషేధ భృతిని మళ్లీ తిరిగి వేట ప్రారంభమయ్యేనాటికి అందించేవారు. కానీ ముందుగానే ఏపీ సర్కార్ ఈ సాయం అందించింది.ఈ ఏడాది కరోనా కారణంగా ఏప్రిల్ 15వ తేదీకి 20 రోజుల ముందే వేట బంద్ చేశారు. దీంతో మత్స్యకారులు జీవనోపాధి లేక ఇబ్బందులు పడ్డారు.ఇక ఈ సమయంలో వారికి ఇవ్వాల్సినవి వారి అవసరాలకు తగ్గట్టు ముందుగానే అందిస్తే వారిని ఆదుకున్నట్టు అవుతుందని భావించిన ఏపీ ప్రభుత్వం వేట నిషేధ సాయాన్ని ముందుగానే ఇస్తుంది. ఏపీ కరోనాతో పోరాటం సాగిస్తున్న సమయంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మరింతదిగజారిపోయింది .

ప్రభుత్వానికి ఆర్ధిక ఇబ్బందులున్నా సరే మత్స్యకారులకు అండగా ఉంటుందన్న సీఎం జగన్
ఇక ఈ సమయంలో ఆర్ధిక కష్టాలు ఉన్నా మత్స్యకారుల కష్టాలు పెద్దవని భావించి మత్స్యకార భరోసాను ఇస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు .కరోనా కష్టాలు ఉన్నప్పటికీ మత్స్యకారులకు 1,09,231 మంది కుటుంబాలకు రూ. 10.వేలు ఇస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15వరకూ ఉన్న వేట నిషేధ సమయంలో ఇవ్వాల్సిన డబ్బును గతంలో ఎప్పుడూ సరిగా ఇచ్చేవారు కాదని, అందరికీ లబ్ది జరిగేది కాదని కానీ తమ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క మత్స్యకారుడు ఆకలితో ఉండకుండా సాయం అందిస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.అలాగే మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను గురించి వివరించారు.