వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ‌గ‌న్ దూకుడు..నో కాంప్ర‌మైజ్: హైకోర్టు చీఫ్ జ‌స్టిత్‌తో భేటీ : సీఎం ఏం చెప్పారు..ఏమ‌ని కోరారు..!

|
Google Oneindia TeluguNews

పాల‌న‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు తెస్తామ‌ని ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌..అందులో భాగంగా కీల‌క అడుగు వేసారు. ఏపీలో జ్యుడిషియ‌ల్ క‌మిష‌న్ ఏర్పాటు దిశ‌గా చ‌ర్య‌లు ప్రారంభించారు. రాష్ట్రంలో అవీనితి ర‌హిత పాల‌న కోసం ఏర్పాటు చేస్తున్న ఈ క‌మిష‌న్ ల‌క్ష్యాల‌ను వివ‌రించి ఆమోదం పొందేందుకు ఏపీ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తితో భేటీ అయ్యారు. హైకోర్టు న్యాయ‌మూర్తి ఆధ్వ‌ర్యంలో ఈ క‌మిష‌న్ ప‌ని చేయ‌నుంది.

హైకోర్టు సీజేతో సీఎం భేటీ..
ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ప్ర‌వీణ్ కుమార్‌తో ఏపీ సీఎం జ‌గ‌న్ భేటీ అయ్యారు. ఏపీలో జ్యూడిషియ‌ల్ క‌మిష‌న్ ఏర్పాటు గురించి జ‌గ‌న్ కీల‌క అడుగు వేసారు. అందులో భాగంగానే ఆయ‌న హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తితో భేటీ అయ్యారు. భేటీలో జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాల్సిందిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్‌ను సీఎం జగన్ విజ్ఞ‌ప్తి చేసారు. జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు ఉద్దేశం, దాని వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు కలిగే ప్రయోజనాలను జగన్ వివరించారు. ఏపీలో గ‌త ప్ర‌భుత్వంలో టెండ‌ర్ల పేరుతో భారీ అవినీతి చోటు చేసుకుంద‌ని..వాటిని స‌రి దిద్ద‌టంతో పాటుగా ప్ర‌తీ కాంట్రాక్టు జ్యూడిషియ‌ల్ క‌మిష‌న్ ఖ‌రారు చేసిన త‌రువాతే కాంట్రాక్టులు ఫైన‌ల్ చేయాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. దీని కోసం హైకోర్టు సిట్టింగ్ జ‌డ్జి నేతృత్వంలో ఈ క‌మిష‌న్ ఏర్పాటు చేయాల‌ని జ‌గ‌న్ కోరారు.

CM Jagan met High court Chief Justice Praveen Kumar Request to appoint judicial commission

జ‌గ‌న్ దూకుడు..
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి దూకుడుగా ఉన్న వైఎస్ జగన్.. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన అందిస్తానని ప‌లుమార్లు స్ప‌ష్టం చేసారు. రివ‌ర్స్ టెండ‌రింగ్ విధానం అందుబాటులోకి తెస్తామ‌ని ముఖ్య‌మం త్రి ప్ర‌క‌టించారు. ప్ర‌ధానంగా ఏప్రిల్ 30లోగా ప‌నులు ప్రారంభించ‌ని సంస్థ‌ల కాంట్రాక్టులు ర‌ద్దు చేస్తూ ఇప్పిటికే ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌, త‌న పాల‌న పూర్తిగా పార‌ద‌ర్శంగా ఉంద‌ని నిరూపించుకోవ‌టానికి జ‌గ‌న్ అనేక చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అందులో భాగంగా..ఒక వైపు న‌వ‌ర‌త్నాల అమ‌లు చేస్తూనే..పాల‌న‌లో విప్ల‌వాత్మ‌క మార్పుల దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. రాజ‌ధాని..పోల‌వ‌రం వంటి కీల‌క ప్రాజెక్టుల్లోనూ అవినీతి పైన దృష్టి సారించారు. దీంతో..జ‌గ‌న్ కేబినెట్ ఏర్పాటు త‌రువాత మ‌రిన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకొనే అవ‌కాశం ఉంది.

English summary
AP CM Jagan met High court Chief Justice Praveen Kumar in amaravati. CM Request CJ to appoint judicial commission in AP with sitting judge to implement reverse
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X