వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం జగన్ కొత్త ట్విస్ట్ : మంత్రులు..ఎమ్మెల్యేకు షాక్ :సమర్ధతకు పరీక్ష...!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

వైసీపీ నేతలకు జగన్ కొత్త ట్విస్ట్ || CM Jagan New Decision On Nominated Posts || Oneindia Telugu

ముఖ్యమంత్రి జగన్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. మూడు నెలలుగా ఆశలు పెట్టుకున్న మంత్రులు..ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. ప్రభుత్వంలో పదవులు తమకు గ్యారంటీ అని భావిస్తున్న వారికి.. తమ వారికి పదవుల కోసం ప్రయత్నిస్తున్న మంత్రులు..ఎమ్మెల్యేలకు జగన్ కొత్త కండీషన్ పెట్టారు. ఇప్పుడు ఇది వారి సమర్ధతకు పరీక్ష గా మారింది. ముఖ్యమంత్రి జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత కొన్ని కీలక పోస్టులను మాత్రమే భర్తీ చేసారు. అనేక పదవులు ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. తాజాగా టీటీడీ బోర్డు సభ్యులను జగన్ ఖరారు చేసారు. ఇక, మంత్రులు .. ఎమ్మెల్యేలు తమ అనుయాయులకు పదవులు ఇప్పిస్తా మని పలువురికి హామీ ఇచ్చారు. తమ మీద పదవుల కోసం వస్తున్న ఒత్తిడి గురించి మంత్రులు నేరుగా సీఎంకు వివరించారు. అయితే ఆ సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన సమాధానం వారికి షాక్ ఇచ్చింది. దీంతో..ఇప్పుడు మంత్రులు..ఎమ్మెల్యేలు మరో సారి ప్రజల మధ్యకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నామినేటెడ్ పోస్టులు కావాలంటే..
అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ కోసం పని చేసే వారికి పదవుల పందేరంలో ప్రాధాన్యత ఉంటుందని జగన్ ఎప్పటి నుండో చెబుతూ వస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర స్థాయిలో కొన్ని కీలక పోస్టులను భర్తీ చేసారు. ఇక, నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం మంత్రులు ప్రస్తావించగా..ముఖ్యమంత్రి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. నామినేటెడ్ పోస్టులకు..స్థానిక సంస్థల ఎన్నికలకు ముడి పెట్టారు. పదవుల కోసం నెలకొని ఉన్న ఒత్తిడి..స్థానిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ కోసమే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీలో సీనియర్లు, ముఖ్యులకు మాత్రం కొన్ని నామినేటెడ్‌ పదవులను ఈలోపే లభించే అవకాశాలు ఉన్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ పదవులను ఆశిస్తున్న వారి సంఖ్య, నియోజక వర్గాల వారీగా భారీగా పెరిగింది. ప్రతీ నియోజకవర్గానికి సరాసరిన ఇద్దరు, ముగ్గురు సీనియర్లు, ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన నేతలు నామినేటెడ్‌ పదవులను ఆశిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే గెలిచిన ఎమ్మెల్యేలు త్వరలోనే మనవాళ్ళందరికీ నామినేటెడ్‌ పోస్టులు ఖాయమంటూ ప్రచారం చేశారు. ఇదంతా నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య వైరుద్యాలకు దారితీస్తోంది. ప్రతీ నియోజకవర్గంలో ఉన్న పోటీని స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి అనుకూలగా మలచుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దసరా తరువాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

CM Jagan new decision on nominated posts to party cadre

ఏకపక్ష ఫలితాల కోసమే..
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష ఫలితాలు అందుకోవాలన్న కాంక్ష ముఖ్యమంత్రి జగన్ లో బలంగా ఉంది. కొన్ని ప్రధాన నియోజకవర్గాల్లో మొదటిశ్రేణి నేతలంతా పదవుల కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. వీరిని ఇప్పటి వరకు ఊరడించి, అవసరమైతే అధిష్టానంతో మాట్లాడి అంతా తామే చూసుకుంటామని ఎమ్మెల్యేలు భరోసా ఇస్తున్నారు. నానాటికి పెరుగుతున్న ఒత్తిళ్ళు ఒకవైపు, మరోవైపు పోస్టులు కోసం నేతల మధ్య పోటీ పెరగడం ఎమ్మెల్యేలకు కొంచెం తలనొప్పిగానే మారింది. ఇప్పుడు ముఖ్యమంత్రి నిర్ణయం ద్వారా ఏకపక్షంగా ఫలితాలను రాబట్టడంలో ఎవరైతే కీలకంగా వ్యవహరిస్తారో అలాంటి వారికి నామినేటెడ్‌ పోస్టులను కట్టబెట్టేందుకు పరోక్ష నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు నేతల మధ్య ఇప్పటికే ఉన్న పోటీని తగ్గించేందుకు వీలవుతుందని, మరోవైపు అనుకూల ఫలితాల కోసం పార్టీ నేతలంతా ఐక్యంగా పనిచేస్తారని భావిస్తున్నారు. ఈ ఎన్నికలను లక్ష్యంగా తీసుకుని, పార్టీలో నేతలు, కేడర్‌కు బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం తో స్థానిక సంస్థల్లో సైతం వైసీపీ జెండా ఎగుర వేసి .. పూర్తిగా టీడీపీని కోలుకోలేని దెబ్బ తీయాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా కనిపిస్తోంది. దీంతో..త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. పార్టీలో పదవులు కోరుకుంటున్న వారితో పాటుగా ఎమ్మెల్యేలు..మంత్రులకు సైతం ముఖ్యమంత్రి నిర్ణయం పరీక్ష గా మారింది.

English summary
CM Jagan new decision on nominated posts to party cadre. Cm said that After local body elections govt take decision on Nominated posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X