వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ ట్రాప్ లో ముగ్గురు వైసీపీ ఎంపీలు..!? సీఎం జగన్ అలర్ట్: అందుకేనా ఆ హెచ్చరికలు..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేలను వైసీపీ..బీజేపీ తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తుంటే..ఢిల్లీ రాజకీయం మరో విధంగా నడుస్తోంది. ఏపీ అధికార పార్టీ వైసీపీ తాజాగా జరిగిన ఎన్నికల్లో 22 మంది లోక్ సభ సభ్యులు గెలిచారు. లోక్ సభలో అతి పెద్ద నాలుగో పార్టీగా వైసీపీ నిలిచింది. వైసీపీ ఫ్లోర్ లీడర్ మిధున్ రెడ్డి..ప్రధాన పార్టీల నేతల పక్కనే సీటు కేటాయించారు. ఇది వైసీపీకి దక్కిన అరుదైన అవకాశం. అయితే, ఏపీలో ఎలాగైనా బలపడాలని ఆలోచనతో ఉన్న బీజేపీ..వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఏపీలో వైసీపీ అధికారంలో ఉండటంతో అక్కడి వైసీపీ ఎమ్మెల్యేలను మాత్రం టచ్ చేయటం లేదు. కానీ, రాజకీయంగా బిజీగా ఉండే వైసీపీలోని ముగ్గురు ఎంపీలు మాత్రం బీజేపీలోని ముఖ్య నేతలతో టచ్ లో ఉన్నట్లు ఢిల్లీలో జోరుగా ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే..ఎంపీలు తప్పని సరిగా కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లే సమయంలో విజయ సాయిరెడ్డి లేదా మిధున్ రెడ్డితో కలిసి వెళ్లాలని సీఎం జగన సూచించినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం పార్లమెంట్ సమావేశాల ప్రారంభ సమయంలో హాట్ టాపిక్ అయింది.

జగన్ పగ తీర్చుకుంటున్నారు: చంద్రబాబు ముద్ర లేకుండా: పవన్..నాగబాబు ఆగ్రహం..!జగన్ పగ తీర్చుకుంటున్నారు: చంద్రబాబు ముద్ర లేకుండా: పవన్..నాగబాబు ఆగ్రహం..!

 ముగ్గురు వైసీపీ ఎంపీలకు బీజేపీ ట్రాప్..

ముగ్గురు వైసీపీ ఎంపీలకు బీజేపీ ట్రాప్..

ఏపీలో వైసీపీ నుండి గెలిచిన ముగ్గురు ఎంపీల్లో ముగ్గురు బీజేపీ నేతలతో సఖ్యతగా ఉంటున్నట్లు ప్రచారం సాగుతోంది. వ్యాపారాల్లో స్థిర పడి సుదీర్ఘ కాలంగా రాజకీయాలు సాగిస్తున్న ఇద్దరు ఎంపీలు.. వ్యాపార పరంగా భారీగా నష్టపోయి ఇబ్బందుల్లో ఉన్న మరో ఎంపీ బీజేపీ నేతలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ముగ్గురి వ్యాపారాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ముడిపడి ఉన్నవి. దీంో..వారితో సఖ్యతగా ఉంటూ వ్యాపార ప్రయోజనాలు రక్షించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని అధికార పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. లోక్ సభలో ఇప్పుడు బీజేపీ సొంతంగా కావాల్సిన దాని కంటే ఎక్కువ మెజార్టీతో కొనసాగుతోంది. ఇప్పుడు ఇతర పార్టీల ఎంపీల అవసరం బీజేపీకి లేదు. కానీ, ఏపీలో భవిష్యత్ అవసరాల కోసం వారికి బీజేపీ సైతం వారికి కావాల్సిన విధంగా సహకరాం అందిస్తోందని పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతోంది.

 సీఎం జగన్ అలర్ట్..కీలక సూచనలు

సీఎం జగన్ అలర్ట్..కీలక సూచనలు

కేంద్రంతో ముఖ్యమంత్రి సఖ్యతగానే ఉంటున్నారు. కేంద్రం నుండి ఈ అయిదు నెలల కాలంలో ఏపీకి ప్రత్యేకంగా అందిన సాయం లేదు. ఇక, ప్రత్యేక హోదా విషయంలో ప్రస్తుతం జగన్ సైతం మౌనం పాటిస్తున్నారు. కేంద్రం మీద నిరంతరం ఒత్తిడి చేస్తూనే ఉంటామంటూ..వినతి పత్రాలు..అభ్యర్ధనలు చేస్తున్నారు. కానీ, గతంలో మాట్లాడినంత గట్టిగా డిమాండ్ చేయలేక పోతున్నారు. ఇక, కేంద్రంలో బీజేపీ నాయకత్వం రాజకీయంగా వేసే ఎత్తుగడలు..అనుసరించే వ్యూహాల మీద పూర్తి అవగాహన ఉండటంతో జగన్ అలర్ట్ అయ్యారు. తన పార్టీ ఎంపీలు ఇప్పుడు బీజేపీకి అవసరం లేకపోయినా..వారిని తమ చెప్పు చేతల్లో పెట్టుకొనే ప్రయత్నాలు బీజేపీ చేస్తోందని అనుమానిస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో..ఆయన నేరుగా ఎంపీలకే ఏ రకంగా వ్యవహరించాలో స్పష్టం చేసారు. ఎంపీలు విజయ సాయిరెడ్డి..మిధున్ రెడ్డి మార్గదర్శకంలో మాత్రమే ప్రధానిని..కేంద్ర మంత్రులను కలవాలని నిర్ధేశించారు. దీని ద్వారా వారు ఏం చేస్తున్నారనేది తనకు పూర్తి సమాచారం ఉందనే సంకేతాలు పరోక్షంగా ఇచ్చారు.

ఆ ముగ్గురిని ఉద్దేశించే..టీడీపీ నేతలు సైతం

ఆ ముగ్గురిని ఉద్దేశించే..టీడీపీ నేతలు సైతం

తాజాగా పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ సైతం ఆ ముగ్గురి గురించే ఈ వ్యాఖ్యలు చేసారా అనేది ఇప్పుడు చర్చ. ఇక, టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ నుండి 10 నుండి 12 మంది ఎంపీలు సర్దుకుంటున్నారని..సొంత ఇంటిని సరి చేసుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ఇది మైండ్ గేమ్ లో భాగంగా వైసీపీ నేతలు ఖండించారు. అయితే, ఇప్పుడు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్న సమయంలో బీజేపీ నేతలు ఏ రకంగా వ్యవహరిస్తారనేది మరింత ఆసక్తి కరంగా మారింది.

అయితే, వైసీపీ నుండి ఎన్నికై..బీజేపీతో సఖ్యతగా ఉన్నారనే ప్రచారంలో ఉన్న ముగ్గురు ఎంపీలకు ఏపీ ప్రభుత్వ సహకారం కూడా అవసరమే. దీంతో..వారు పార్టీ మారే అవకాశం కనిపించటం లేదని విశ్లేషణ. అదే సమయంలో బీజేపీ సైతం వారిని పార్టీలో అధికారికంగా చేర్చొకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ, రానున్న రోజుల్లో సమీకరణాలు మారితే..ఇటువంటి వ్యవహారాలు కొత్త రాజకీయాలకు దారి తీసే అవకాశం కనిపిస్తోంది.

English summary
speculations going on in Delhi that three loksabha memebers form YCP is mainataining close relation with BJP. Cm jagan who was alerted and gave particular instructions to the MP's.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X