వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త‌క్కువ ధ‌ర‌కే ఇసుక‌: క‌లెక్ట‌ర్ల‌కే ప‌ర్య‌వేక్ష‌ణా బాధ్య‌త‌లు:జ‌గ‌న్ అదేశాలు..!

|
Google Oneindia TeluguNews

ఏపీలో ఇసుక విక్ర‌యాలు..అక్ర‌మ ర‌వ‌ణా అరిక‌ట్ట‌టం పైన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కీల‌క ఆదేశాలు జారీ చేసారు. రెండు నెల‌ల్లోగా ఇసుక విధానం పూర్తి స్థాయిలో పార‌ద‌ర్శ‌కంగా రూపొందించాల‌ని సీఎం నిర్ధేశించారు. అప్ప‌టి వ‌ర‌కు ఏపీలో ఇసుక విక్ర‌యాల బాధ్య‌త‌ల‌ను ఏపీఎండీసీకి అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించారు, ప్ర‌స్తుతం ల‌భిస్తున్న ధ‌ర‌ల కంటే త‌క్కువ ద‌ర‌కే ఇసుక అందించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేసారు. సెప్టెంబ‌ర్ 5వ తేదీ నుండి కొత్త ఇసుక విధానం అమ‌ల‌య్యేలా చూడాల‌ని సీఎం జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు.

త‌క్కువ ద‌ర‌కే ఇసుక‌..
ఏపీలో ఇసుక అక్ర‌మ ర‌వాణా నిరోధానికి..సామాన్యుల‌కు ఇసుక అందుబాటులో తేవ‌టం పైన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేసారు. అందులో భాగంగా ఇక నుండి రాష్ట్రంలో ఏపీఎండీసీ ద్వారా ఇసుకను విక్ర యించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం లభిస్తున్న రేట్లకన్నా తక్కువ రేట్లకే ఇసుకను అందించాలని సీఎం ఆదేశించారు. ఎక్క‌డా ఇసుక విష‌యంలో అవినీతి లేకుండా.. ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా.. పర్యావరణాన్ని పరి ర‌క్షించేలా పారదర్శక విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారుల‌కు సూచించారు.

Cm Jagan ordered official to control Sand mafia with serious steps... to prepare new sand policy before September 5th.

కొత్త ఇసుక విధానం వ‌చ్చే సెప్టెంబ‌ర్ 5వ తేదీ నాటికి రూపొందించి..అదే రోజు నుండి అమ‌లు చేయాల‌ని నిర్ధేశించారు. ఇసుక రీచ్‌ల వద్ద స్టాక్‌యార్డులు, నగరాలు, పట్టణాల్లో అదనపు స్టాక్‌ యార్డులు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. ఇసుకరీచ్‌ నుంచి స్టాక్‌యార్డు వద్దకు తరలింపునకు ఒక రశీదు త‌ప్ప‌ని స‌రిగా ఇవ్వాల‌ని ఆదేశించారు. అదే విధంగా.. రీచ్‌లవద్ద సీసీ కెమెరాల ఏర్పాటు.. వే బ్రిడ్జిల ద్వారా లెక్కింపు చేయాల‌ని డిసైడ్ అయ్యారు.

క‌స్ట‌మ‌ర్‌కు చేరేవ‌ర‌కూ ఇలా..
రీచ్‌లవద్ద, స్టాక్‌యార్డుల వద్ద అక్రమాలను అడ్డుకునేందుకే ఈ చర్యలు తీసుకోవాల‌ని జ‌గ‌న్ సూచించారు. ఇసుక తవ్వకాలు, తరలింపులో వాడే వాహనాలకు జీపీఎస్‌ తప్పనిసరి చేయాల‌న్నారు. మాఫియాకు..అక్రమాలకు.. అవకత వకలకు.. కల్తీలకు దారితీయకుండా పటిష్ట చర్యలు తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేసారు. ఎక్క‌డైనా ఇసుక అక్రమ తవ్వకా లకు పాల్ప‌డినా.. అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకొనేలా వీరిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

రెండు నెలల కాలంలో ఇసుక రవాణా వాహనాల గుర్తింపు, వాటికి జీపీఎస్‌ అమరిక, ఇతర సాంకేతిక సన్నాహాలు, వేబ్రిడ్జి, సీసీ కెమెరాల ఏర్పాటు, స్టాక్‌యార్డుల ఏర్పాటు పూర్తిచేయాల‌ని సీఎం సూచించారు. ఇసుక వినియోగ దారులకోసం ఒక యాప్, వెబ్‌ పోర్టల్‌ను త‌యారు చేయాల‌ని నిర్ణ‌యించారు. కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చేంతవరకూ ఇసుక అందించే బాధ్యతను క‌లెక్ట‌ర్ల‌కు అప్ప‌గించారు. రెండునెలల్లోగా అదనపు రీచ్‌లను గుర్తింపు, డిమాండ్‌కు తగినట్టుగా ఇసుకను అందించాల‌ని సూచించారు.

English summary
AP Cm Jagan ordered official to control Sand mafia with serious steps. Jagan directed to prepare new sand policy before September 5th. Up to that time collectors to take responsibility.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X